Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫోన్ ట్యాపింగ్..! రోజురోజుకూ విభ్రాంతికర అంశాలు వెలుగులోకి..!

January 31, 2025 by M S R

.

నిజానికి ఈ ఫోన్ ట్యాపింగు మీద జరగాల్సినంత చర్చ జరగడం లేదేమో అనిపిస్తోంది… అంత సీరియస్‌కేసు అది… ఏకంగా 18 మంది హైకోర్టు జడ్జిలపై నిఘా అనేది చిన్న విషయం కాదు…

అందులో సుప్రీంకోర్టుకు ప్రమోషన్‌పై వెళ్లిన న్యాయమూర్తి పేరు కూడా ఉందట.! జర్నలిస్టులు, నాయకులు, మేధావులు, సినిమా తారలు, వాట్ నాట్, సొసైటీని ప్రభావితం చేసే అన్ని కేటగిరీల వాళ్ల పేర్లూ… అందరిపైనా నిఘా…

Ads

ఈ వివరాలన్నీ గతంలో వచ్చినవే… పోలీసులు ఈ ఫోన్ ట్యాపింగ్ రికార్డులను తమ స్వార్థం కోసం ఎంత అక్రమంగా వాడుకున్నారో కూడా బయటికి వచ్చినవే… మరీ సినిమా తారల్ని బెదిరించి పబ్బం గడుపుకున్నారట… ఒకడైతే అమ్మాయిలను లోబర్చుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించి ఒక అరాచకాన్ని కళ్లముందుంచాడట…

కానీ ఏకంగా హైకోర్టు, ఏసీబీ కోర్టు జడ్జిల మీద నిఘా వేయడం చిన్న విషయమైతే కాదు… అయిదుగురు మహిళా న్యాయమూర్తులూ ఈ ట్యాపింగ్ బాధితులేనట… అసలు హైకోర్టే దీన్ని సీరియస్‌గా తీసుకుని, తన నేతృత్వంలో దర్యాప్తు జరగాలని ఆదేశిస్తే బెటరేమో అనిపించేంతగా ఉంది కేసు..! కానీ ఒక్కో నిందితుడికీ బెయిల్ వచ్చేస్తోంది…

phonetapping

పోనీ, ప్రధాన నిందితుడిని అమెరికా నుంచి పట్టుకొచ్చే చర్యలు ఏమైనా ఫలిస్తున్నాయా.,.? ఏమీ లేదు… రప్పించలేకపోతున్నాం… అదేదో ప్రకటిత నేరస్థుల అస్త్రం ప్రయోగిస్తారని తాజా సమాచారం… ఇంటర్ పోల్ స్వయంగా ఏమీ చేయలేకపోతోంది… అసలు తెలంగాణ ఐపీఎస్ అధికారులు ఈ కేసు విషయంలో రేవంత్ సర్కారుకు సరిగ్గా సహకరిస్తున్నారా లేదానే సందేహం కూడా కాంగ్రెస్ ముఖ్యుల్లో ఉంది…

నిజంగా ఫిక్స్ చేస్తే,., ఇందులో కేసీయార్ బుక్కవుతాడు… అదే అందరూ చెబుతారు, కానీ ఎటూ కదలదు కేసు… ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు ఆస్తుల్ని వేలం వేస్తారట, సరే, కానీ దాంతో వచ్చేదేముంది..? అసలు చేయాల్సింది వాళ్లను పట్టుకురావడం, సరైన దర్యాప్తు, విచారణ జరగడం… ఓ అరాచక పర్వం బాపతు చీకట్లను వెలుగులోకి తెచ్చి, బాధ్యులను ఫిక్స్ చేసి, కోర్టుకు అప్పగించడం…

ఏయే పోలీస్ అధికారి ఏయే నేరాలకు పాల్పడ్డాడు ఆ ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో… ఎందరి ఉసురు పోసుకున్నారు, అవి కదా బయటపడాల్సింది… కేసీయార్ ప్రభుత్వ అరాచకాల్లో ప్రధానంగా చెప్పుకోదగింది ఈ కేసే… దాన్నే ఓ కొలిక్కి తీసుకురాలేకపోతే ఇక రేవంత్ పార్టీకి వోట్లేసి, తనను అధికారంలోకి తీసుకొచ్చి జనానికి ఉపయోగం ఏమిటి..?

ఫార్ములా కేస్… కోర్టుల అడ్డంకుల్లేవు, గవర్నర్ అనుమతీ ఉంది, ఐనా ఈరోజుకూ దానిమీద కాన్సంట్రేషన్ లేదు, జనం ఊహిస్తున్న అరెస్టులూ లేవు… ఇక ఫోన్ ట్యాపింగ్ కేసూ అంతేనా..?!

ఈనాడు ఈరోజు బ్యానర్ స్టోరీ ఇది… మిగతా మొత్తం మీడియా ఫెయిల్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అయ్యా, నేతాజీ మునిమనవడు గారూ..! ప్రభాస్ గ్లింప్స్‌లో తప్పేం లేదు..!!
  • అసలు నీకు బుద్దుందా వాసూరావ్..? సాయిపల్లవిపై ఈ కూతలేంటి..?
  • నీటికి Expiry Date ఉందో లేదో మీకు తెలుసా..?
  • కొమ్మూరి యుగంధర్ – అప్పట్లో పాఠకుల్ని ఉర్రూతలూగించిన పేరు !!
  • రేవంత్ ప్రయత్నాలకు ఫడ్నవీస్ పాజిటివ్- ఇక కిషన్ రెడ్డి ఏం చేస్తాడో ..!?
  • మొద రాత్రి! ఇది కేయాస్ నేరేటివ్… అంటే గందరగోళమే కథ ముడిసరుకు!!
  • నల జిలుకర మొగ్గ – కాలంతోపాటు మారితేనే ఏ కళకైనా మనుగడ !!
  • వడివేలు వంద కోట్ల భవనం.. కుటుంబం కోసమా? సంపదకు భద్రతా?!
  • గజబ్ రాత్ ! కథ గజబ్… కథనమే గజిబిజి… అనేక మలుపుల చిక్కుముడి !!
  • అల్లుడు అలిగాడు… రచ్చకెక్కిన రాధాకృష్ణ ఇంటి కలహాలు… కానీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions