‘‘హేమిటీ బండి సంజయ్ భాష…’’ ఈ ప్రశ్నపై మొన్న ఓ పార్టీలో చిన్న డిస్కషన్… అవును మరి, కేసీయార్ నేర్పిన భాషే తన పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, వాళ్లకు ఆ భాష తప్ప ఇంకేదీ అర్థమయ్యే స్థితిలో లేరు… వాళ్లకు రేవంతుడు, సంజయుడే కరెక్టు మొగుళ్లు… ఈ జానారెడ్డిలు గట్రా అస్సలు సరిపోరు… తప్పేముంది..? ముల్లుకు ముల్లే కదా సమాధానం అంటూ ఒకాయన సుదీర్ఘంగా డిఫరెంటు వివరణ ఇచ్చాడు… స్థూలంగా చూస్తే, డిబేట్ కోసం వింటే, టెక్నికల్లీ కరెక్టే అనిపించినా… మరీ ఈ స్థాయి భాషకు చేరడం కరెక్టు కాదు… ఇది కచ్చితంగా కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది… బండి సంజయ్ ముందుగా ఇది తెలుసుకోవాలి… కటువైన భాష సరే, కానీ కరెక్టు పంచ్ అవసరమేనేమో కానీ… అది ఎక్కడో తేడా కొడుతోంది… బీజేపీ కేడర్‌కే కలుక్కుమంటోంది…
ఎవరో ఏదో అన్నారు… టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కొందరి భాష నేలటికెట్టు స్థాయే… ఏమోయ్, సంజయ్, నువ్వు అసలు ప్యూర్ హిందువువా అని రెచ్చగొట్టారేమో… సరిగ్గా ఆ ట్రాపులో పడ్డాడు సంజయ్… మొరిగే కుక్కలు అంటూ మొదలుపెట్టి… కేసీయార్, దమ్ముంటే సాగర్‌కు రా అని సవాల్ విసిరాడు… అక్కడివరకూ వోకే… సంజయ్కన్నా ముందే కేసీయార్ వెళ్తున్నాడు… ఇప్పుడు అక్కడ అవసరం కాబట్టి చాలా వరాలు గుప్పిస్తాడు… మహా గొప్ప రాజనీతిజ్ఞుడు కదా… అయితే ఇక్కడ ఎటొచ్చీ అంతుపట్టనిది, చిరాకు పుట్టించేది, సంజయ్ పట్ల ఒకింత జాలి కలిగించేది ఒక వ్యాఖ్య ఉంది… ‘‘డీఎన్ఏ పరీక్షకు నేను సిద్ధం, సీఎం సిద్ధమా..?’’ అనేదే ఆ వ్యాఖ్య…
Ads
ఓహ్, డీఎన్ఏ పరీక్షలో మనిషి మతం ఏమిటో కూడా జెనెటికల్‌గా తేలిపోతుందా..? ఫాఫం, ఆ అమిత్ షాకు ఇది తెలియక పౌరసత్వ సవరణ చట్టంలో ఏదేదో రాయించేశాడు గానీ… డీఎన్ఏ టెస్టు చేయించుకొండి, హిందువని తేలితే పౌరసత్వం తీసుకొండి అని సింపుల్‌గా రాసేస్తే పోయేది… అయినా కేసీయార్ హిందువో కాదో తేల్చే డీఎన్ఏ టెస్టు సాగర్‌లోనే సాధ్యమా..? హేమిటో… ఇది మరీ విచిత్రం… అన్నట్టూ… మతానికి ఒక రీతి డీఎన్ఏ ఉంటుందీ అనుకుందాం సరే… మతం మారినవాళ్ల సంగతేమిటి మరి..? కేసీయార్ పుట్టుకతోనే హిందువు, ఆ విషయం చింతమడకలో అందరికీ తెలుసు… ఆయన తన రాజకీయ అవసరాల కోసం నయా నిజాంగా మారాడు అనుకుందాం,.., కానీ అది కూడా డీఎన్ఏ టెస్టులో తేలుతుందా..? ఇంకా నయం… తాము అధికారంలోకి రాగానే అందరికీ డీఎన్ఏ టెస్టులు చేయించి, కొత్త మత పౌరసత్వ కార్డులు జారీ చేస్తామని ప్రకటించలేదు… హమ్మయ్య…! అవును సారూ… ష్… కులాన్ని తేల్చే డీఎన్ఏ టెస్టులు కూడా ఉన్నాయా సార్..?!
Share this Article