Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పొలిటికల్ అంకగణితం! లెక్కల్లో కేటీఆర్ ఫెయిల్- రేవంత్‌రెడ్డి పాస్!!

July 11, 2026 by M S R

.

కేటీఆర్ పాపం తప్పులో కాలేశాడు!! ఎప్పుడూ తన కోటరీని, తనకు ఇన్‌పుట్స్ అందించే ఓ అసమర్థ యంత్రాంగాన్ని నమ్ముకుంటే ఏమవుతుంది..? ఏమీ కాదు… నవ్వులపాలవుతాడు… ఇదీ అంతే… విషయం ఏమిటంటే..?

అంకగణితం..! మ్యాథ్స్ బేసిక్స్..! రాజకీయాల్లో ఇది అస్సలే పనికిరాదు… పాలిటిక్సులో 2*2 ఎప్పుడూ నాలుగు కాదు… కాకూడదు, లేదు నాలుగే అంటే రాజకీయ గణితంలో వీక్ అని లెక్క… మ్యాథ్స్‌లో ఫెయిల్ అని లెక్క…

Ads

కేటీయార్ ఏమన్నాడు..? ‘‘రేవంత్ సొంతంగా  సర్వే చేయించుకున్నాడు… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేు 119 సీట్లకు గాను మేం 78 సీట్లు గెలుస్తాం (65 శాతం) అని తేలింది, దాంతో ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు పాపం’’ అని ఎక్కడో చెప్పాడు… అందరికీ తెలుసు, ఇదేదో కాలంచెల్లిన మైండ్ గేమ్ పాచికలు అని… కేటీయార్ ఇంకా ఆ ఎక్స్‌పైర్డ్ ఎత్తుగడల్లోనే మునిగీ తేలుతున్నాడు…

దానికి రేవంత్ ఏం కౌంటర్ ఇస్తాడా అని ఎదురుచూశాం… ‘‘ఏమోయ్, కేటీయార్, కాస్త అప్‌డేట్ కావాలి నువ్వు, ఇంకా ఏకాలంలో ఉన్నావు..? నువ్వు అనుకున్నట్టు 2028 డిసెంబరులో ఎన్నికలు జరగవు… (తెలంగాణ ఎన్నికల గడువు)… 2029 మే- జూన్ మధ్యలో జరుగుతాయి… పక్కా, రాసిపెట్టుకో… 119 కాదు, 182 అసెంబ్లీ సీట్లు, 17 ఎంపీ సీట్లు కాదు, 26 ఎంపీ సీట్లకు ఎన్నికలు…

నువ్వేదో పిచ్చి లెక్కలు చెబితే ఎలా..? 182లో 117 సీట్లు (65 శాతం) మేం గెలుస్తాం, భద్రాచలం రాముడి మీద ఆన, గెలిచి చూపిస్తాం… 26 ఎంపీ సీట్లలో 20 మావే…’’ ఇదీ తన సమాధానం… హహహ… ఇక్కడ రెండు అంశాలు…

కేటీయార్ చెప్పిన అదే 65 శాతం సీట్లు మేం గెలుస్తాం అనే గణితానికి… సరిగ్గా అంతే శాతం లెక్క చూసి, అదే 65 శాతం మేం గెలవబోతున్నాం… కాకపోతే నీకు 182 సంగతి తెలియదు, నాకు తెలుసు అంటూ పర్‌ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు, అదీ ట్వీట్ కాదు, ఖమ్మం జిల్లాలో బహిరంగంగా!

ఇదే మరి… రాజకీయాల్లో అంక గణితం వేరు అనేది… బాగా చదివి అమెరికాలో కొలువు చేసిన కేటీయార్ ఈ గణితంలో ఫెయిల్… ఎక్కడో మారుమూల పల్లెలో చదువుకున్న ముఠా మేస్త్రీ మ్యాథ్స్‌లో పాస్… (అదే 65 శాతం మార్కులు)…

సరే, ఇక విషయానికి వద్దాం… తెలంగాణ ఎన్నికలు తన గడువులోపు 2028 డిసెంబరులో జరగబోవడం లేదు… (2023 డిసెంబరు మొదటి వారంలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి, అంటే 2028 డిసెంబరులో కొత్త అసెంబ్లీ కొలువు దీరాలి… లెక్క ప్రకారం) కానీ అసలు లెక్క వేరు… (రేవంత్‌కు ఏకంగా మోడీ సోర్స్)… (ఎంత రహస్య సంసారం చేసినా సరే మోడీ బీఆర్ఎస్ వాళ్లకు ఏదీ చెప్పడు, నమ్మడు)…

డీలిమిటేషన్ బిల్లు మొన్న ఎన్డీయే వాపస్ తీసుకోవచ్చుగాక… మహిళ రిజర్వేషన్లతో లంకె పెట్టి ఏదో ఎత్తుగడ వేసింది కానీ ఫ్లాప్… కానీ ఇప్పుడు మళ్లీ ఆ బిల్లు రాబోతోంది… డీలిమిటేషన్ ఖాయం, తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల పెంపు ఖాయం… దానికి డిసెంబరు బదులు మరో అయిదారు నెలలు తెలంగాణ అసెంబ్లీ పదవీకాలాన్ని పొడిగిస్తారో లేదో చెప్పలేం గానీ… 2029 మే- జూన్‌లోనే ఎన్నికలు… ఇదీ అసలు విషయం!!

ప్చ్… ఇంకా ఇంకా మీడియాకు, సోషల్ మీడియాకు, బినామీ తటస్థ మీడియాకు నెలనెలా కోట్లకుకోట్ల ఖర్చు పెంచుతూ పోవడం కాదు కేటీయార్, కాస్త నమ్మబుల్, ఎఫిసియెంట్ టీమ్‌ను నిర్మించుకో… వర్తమాన నీ కోటరీ నిన్ను నెగ్గనివ్వదు- ఏమో, రేవంత్‌కు కోవర్టులుగా పనిచేస్తున్నారేమో ఓసారి క్రాస్ చెక్ చేసుకో…!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పొలిటికల్ అంకగణితం! లెక్కల్లో కేటీఆర్ ఫెయిల్- రేవంత్‌రెడ్డి పాస్!!
  • ప్రభుత్వ శాఖల్లో ‘డిజిటల్ పాలన’… కొత్త సీఎస్ సంజయ్ జాజు ముద్ర!
  • భారీ ఆర్థిక మోసం ‘షేర్ బజార్’ – ‘కిసాన్ పరివార్’ స్కామ్ వెనుక అసలు కథ!
  • విజయ్ అపరిణతి! స్టేట్ అంటే నీ ఎస్టేట్ కాదు ముఖ్యమంత్రి గారూ!!
  • యూ టూ ఈటల!! అచ్చం హరీష్ భాషే!! ఎవరిని ఆక్షేపిస్తున్నట్టు!?
  • నిదా ఖాన్ బెయిల్ ఇష్యూ! మరి కృష్ణుడి పుట్టుక మీద వ్యాఖ్యలు దేనికి..?!
  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions