.
తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా అచ్చ తెలుగులో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు కాపీ బాగుంది… తెలుగులో తీర్పులు, తెలుగులో ఉత్తర్వులు, తెలుగులో ఆదేశాలు అని ఎన్నేళ్లుగానో చెప్పుకుంటాం కానీ…
అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి కానీ… ఈ ఉత్తర్వులు సరళమైన భాషలో… అందరూ రోజూ చదువుకునే పత్రికాభాషలో వెలువడటం బాగుంది… ఇదీ ఆ ఉత్తర్వు కాపీ (పీడీఎఫ్)… Telangana Thalli – GO 1946 (1)
Ads
దాన్నే ఎందుకు చెప్పుకోవాలంటే..? అసెంబ్లీలో ఇనుప గుగ్గిళ్ల వంటి తెలుగు భాష కనిపిస్తూ ఉంటుంది… అత్యంత కఠోరమైన, విచిత్రమైన భాష… తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాల్లోనూ భాష ప్రామాణికంగా ఉండదు… ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్లాట్‌ఫామ్స్ వాడే తెలుగు భాష గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…
వివిధ కస్టమర్ కేర్ సెంటర్లు వాడే తెలుగు భాష కూడా అత్యంత కృతకం… కొన్నిచోట్ల సరళమైన తెలుగు వినిపిస్తుంది, కనిపిస్తుంది… ఉదాహరణకు హైదరాబాద్ మెట్రో… తలుపులు కుడి వైపు తెరుచుకోబడతాయి వంటి వాక్యాలు…
ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వుల్లో బాగా నచ్చింది ఏమిటంటే..? కొన్నిచోట్ల ఇంగ్లిషు పదాలను అలాగే తెలుగు లిపిలో రాశారు తప్ప, మరీ ఈనాడు తరహా కృతక అనువాదాలతో చేతబడి చేయలేదు… అనువాదకుల చేతబడి హత్యకు గురికాలేదు…
మెడకు కంఠె, గుండుపూసల హారం, చెవులకు బుట్టకమ్మలు వంటి తెలంగాణ వ్యవహారిక పదాలను అలాగే చేర్చారు… నోటిఫికేషన్, పొలిటికల్, గెజిట్, గవర్నరు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, కమిషనర్ ప్రింటింగ్ స్టేషనరీ, కలెక్టర్లకు… ఇలాంటి ఇంగ్లిషు పదాలను యథాతథంగా వాడారు…
ఇదే ఉత్తర్వుల్లో తెలంగాణ తల్లి ఫోటోను కూడా ముద్రించి, దాన్ని ఏరకంగా కించపరిచినా శిక్షార్హులనే హెచ్చరికను, డిసెంబరు 9వ తేదీని తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా పాటించాలనే ఆదేశాన్ని కూడా అందులోనే పొందుపరిచారు…
కానీ డిసెంబరు 9 ఎందుకు..? సోనియా జన్మదినం అయినందుకా..? ఈ విధేయత ఈ విషయంలో సరైందిగా లేదు… తెలంగాణ అవతరణ దినం జూన్ 2… అదే అపాయింటెడ్ డే… మరి డిసెంబరు 9కి తెలంగాణ ఏర్పాటు దిశలో ఉన్న సంబంధం ఏమిటి..? ఇది తెలంగాణ తల్లి అవతరణ దినం ఎలా అవుతుంది..? తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన తేదీ అంటే పుట్టుక తేదీయా..? అసెంబ్లీలో దీనికి సంబంధించిన వివరణ ఏమైనా ముఖ్యమంత్రి ఇచ్చాడో లేదో తెలియదు..!
Share this Article