Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రేమ ఎంత మధురంలోకి ఓ తెలుగమ్మాయి… ఈమె కథ ఎన్నిరోజులో మరి…

February 11, 2023 by M S R

తెలుగు సినిమాలు అంటే మలయాళ, తమిళ సినీతారలు… లేదంటే ముంబై భామలు… నటన కావాలంటే దక్షిణం… వైట్ స్కిన్, ఆరబోత కావాలంటే ముంబై, అనగా నార్త్… కానీ తెలుగు సీరియల్స్ అంటే కన్నడ తారలు… నిజంగా మంచి మెరిట్ చూపిస్తున్నారు… మీరు ఎప్పుడు బెంగుళూరు ఫ్లయిట్ ఎక్కినా సరే ఎవరో ఒకరు సీరియల్ నటి కనిపిస్తారు… మెల్లిమెల్లిగా సినిమాల్లోకీ వ్యాపిస్తున్నారు… నవ్య స్వామిలా..!

ఆమె వదిన ఐశ్వర్య పిస్సె కూడా మంచి నటే… అయితే తెలుగు వాళ్లు చివరకు టీవీ సీరియళ్లకు కూడా పనికిరారా..? అంత మెరిట్ ఉన్నవాళ్లు లేరా..? ఎందుకు లేరు..? కాకపోతే సీరియల్ దర్శకులు, నిర్మాతల కళ్లకు కనిపించడం లేదు… నిజానికి సినిమాలతో పోలిస్తే టీవీల్లో తారలకు కాస్త నటన తెలిసి ఉండాలి… మొహంలో ఉద్వేగాలు పలకాలి… ఎందుకంటే టీవీ సీరియళ్లలో క్లోజప్ షాట్స్ ఎక్కువ… కథ, కథనాలు సాగదీతకు గురై ఎంత దరిద్రంగా ఉన్నా సరే, ఆ నటీనటుల నటన మాత్రం మెచ్చుకునేలా ఉంటోంది… ఎవరూ తక్కువ కాదు… అయితే..?

premi2(ప్రేమి విశ్వనాథ్)

Ads

ఏళ్లకేళ్లు నడుస్తుంటాయి కదా సీరియళ్లు… దర్శకులు, నిర్మాతల పైత్యానికి కొందరు బలైపోతుంటారు… అకస్మాత్తుగా మానేయబడతారు… వెళ్లగొట్టబడతారు… రెమ్యునరేషన్ ఎక్కువ అడిగినా, వాళ్లంతట వాళ్లు మానేసినా సరే హఠాత్తుగా ఆ పాత్రల్లోకి కొత్తవాళ్లు వస్తారు… లేదంటే ఆ పాత్రలే మాయమైపోతాయి… అడిగేవాడెవ్వడు… తీసేవాడికి చూసేవాడు లోకువ…

ashika(ఆషిక పడుకోన్)

సీరియల్ తారల్లో ఖచ్చితంగా టాప్ పాపులారిటీ సాధించింది ప్రేమి విశ్వనాథ్… ఈమె కన్నడ స్టార్ కాదు… కానీ కార్తీకదీపంతో ప్రతి తెలుగింటికీ పరిచయమైంది… అందరికీ ఇంటి ఆడబిడ్డ అయ్యిందంటే అతిశయోక్తి కాదు… ఆమె పాత్రను చంపేస్తే ఆ సీరియల్‌ను చూసినవాళ్లు లేక, చివరకు మళ్లీ ఆ దర్శకుడే కళ్లు తెరిచి, ఆమెను బతిమిలాడి మళ్లీ తెచ్చి, సీరియల్‌లో ఇరికించి, చివరకు ఆ సీరియల్ ఎలాగోలా ముగించాడు… ఆ ప్రేమిని కూడా శోభాశెట్టి పలుసార్లు సీరియల్‌లో నటన కోణంలో డామినేట్ చేసింది…

anusri(అనుశ్రీ)

నవ్వొచ్చే విషయం ఏమిటంటే…? ప్రేమ ఎంత మధురం అని జీతెలుగులో ఓ సీరియల్ వస్తుంది… మంచి ప్రైమ్ టైమ్ సీరియలే… కానీ గతంలో త్రినయని సీరియల్‌కు పోటీపడేది… కానీ ఇప్పుడు త్రినయని స్టార్‌మాటీవీ సీరియళ్లతో పోటీపడుతుంటే, దాంతో సమానమైన రేటింగ్స్ సాధించిన ప్రేమ ఎంత మధురం సీరియల్ మాత్రం నానాటికీ తీసికట్టులా మారి బాగా దిగువకు జారిపోయింది…

gowri raj(గౌరీరాజ్)

నిజానికి ఆ సీరియల్‌ కోసం మంచి ప్రతిభ కలిగిన తారల్ని వెతుకుతున్నారు, పెడుతున్నారు… కానీ సరిగ్గా ఉపయోగించుకోలేక అర్ధంతరంగా మార్చేస్తున్నారు… అదరగొట్టిన అనుశ్రీ పాత్ర మాయమైపోయింది… రాజనందిని పాత్రలో ఉండే మానస మనోహర్ కొన్నాళ్లు కనిపించి, మాయమైపోయింది… ఇప్పుడు గౌరీరాజ్ బాగా చేస్తోంది… హఠాత్తుగా మన తెలుగమ్మాయి ప్రియాంక చౌదరిని తీసుకొచ్చారు… ఈమెనైనా కొన్నాళ్లు ఉంచుతారా..? సందేహమే…

varsha(వర్ష)

కార్తీకదీపంలో అత్త కేరక్టర్ చేసిన అర్చన అనంత్ కేరాఫ్ అనసూయ సీరియల్‌ను ఒంటి చేత్తో మోస్తోంది… ఆఫ్ పీకవర్స్‌లో వచ్చే సీరియల్ అయినా సరే, మిగతా సీరియల్స్‌తో పోటీపడుతోంది… నిజానికి అది ప్రైమ్ టైమ్‌లో రావల్సిన స్టార్ మాటీవీ సీరియల్… కార్తీకదీపంలో దీపను, కార్తీక్‌ను చంపేశాక, ఆ పిల్లలు పెద్దవాళ్లవుతారు కదా, ఆ పాత్రల్లో కీర్తి భట్, అమూల్యను తీసుకున్నారు… మారిన స్థితిలో ఇద్దరినీ ఊడబీకారు… కీర్తి ఎవరో తెలుసు కదా, బిగ్‌బాస్‌లో అందరి ప్రశంసలూ పొందింది… మనసిచ్చిచూడు సీరియల్‌‌ను తనే మోసింది… దాన్ని అర్థంతరంగా మూసేశారు…

rajanandini(మానస మనోహర్)

ఎక్కడ ఏం తేడా కొట్టిందో కానీ షీలా పాత్రను చేసే నటినే పక్కకు తప్పించేశారు… త్రినయని సీరియల్‌లో హీరోయిన్ తల్లి పాత్రను మార్చారు… అంతేకాదు, మాన్సి పాత్రను చేస్తున్న వర్షను మార్చేసి, కొత్తగా ఇంకెవరినో తీసుకొచ్చారు… అఫ్‌కోర్స్ ఈమె కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న ఆ పాత్రను బాగానే చేస్తోంది… హీరోయిన్ పాత్రలో హెచ్.కె.వర్ష బాగానే చేస్తున్నా సరే, కేరక్టరైజేషన్ అధ్వానంగా ఉండి ఆమె హైలైట్ కావడం లేదు…

keerthi bhat(కీర్తి భట్)

ఇక మన తెలుగమ్మాయి సంగతికొస్తే… గతంలో త్రినయని సీరియల్‌లో జాస్మిన్ పాత్ర పోషించేది… అందం ఉంది, నటన ఉంది… కానీ అర్థంతరంగా ఆ పాత్రనే తప్పించేశారు… ప్రియాంకతో ఎక్కడ బెడిసిందో ఏమో మరి… ఆమె మరీ జూనియర్ ఏమీ కాదు… ఈ విజయవాడ పిల్ల జెమినిలో రోజా సీరియల్‌తో స్టార్ట్ చేసి, అభిషేకం, ఇంటికి దీపం ఇల్లాలు, నాగభైరవి తదితర సీరియల్స్ చేసింది… హైదరాబాద్‌లో బీబీఏ చేసి, మోడలింగ్ చేసేది… తరువాత సీరియళ్లలోకి అడుగుపెట్టింది…

 

priyanka(ప్రియాంక చౌదరి)

ఇప్పుడు ఈమెను ప్రేమ ఎంత మధురం సీరియల్‌లోకి తీసుకొచ్చారు… ఈమెకూ హీరో శ్రీరాంకూ నడుమ ఏదో బంధాన్ని పెట్టి ఇంకొన్నాళ్లు సాగదీస్తారు…  తరువాత ఈమె పాత్ర కూడా మాయమవుతుంది… జనం పిచ్చోళ్లవుతారు… ఏమాటకామాట టీవీ సీరియళ్లలో తారలు కష్టపడుతున్నారు… బెంగుళూరు – హైదరాబాద్ నడుమ చక్కర్లు కొడుతూ, సినిమా తారలకన్నా బాగా చేస్తున్నారు… ఎటొచ్చీ వాళ్ల పాత్రలు, వాళ్లకు ఇచ్చే జీతాలే అస్థిరం… సీరియల్ కథల్లాగే వాళ్ల పాత్రలూ అడ్డదిడ్డం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions