గత వారం బార్క్ రేటింగ్స్ చూస్తే ఒక్క విషయంలో ఆశ్చర్యమేసింది… అది పొన్నియిన్ సెల్వన్‌కు వచ్చిన రేటింగ్స్… నిజానికి ప్రేక్షకులు టీవీల్లో సినిమాలు చూడటం గణనీయంగా తగ్గిపోయిన మాట వాస్తవం… ఆ యాడ్స్ భరిస్తూ, అదే టైంకు టీవీ ముందు కూర్చోవడం చాలామందికి నచ్చడం లేదు… అందుకే సినిమాలకు జీఆర్పీలు చాలామేరకు పడిపోయాయి…
10 జీఆర్పీలు వస్తే అది టీవీలో సూపర్ హిట్ కింద లెక్క… కానీ పొన్నియిన్ సెల్వన్‌కు వచ్చిన జీఆర్పీలు ఎంతో తెలుసా..? 2.11 మాత్రమే… రెండు బార్క్ రేటింగ్స్ అత్యంత దరిద్రమైన ఫ్లాప్ అన్నమాట… దిక్కుమాలిన చెత్త సీరియల్స్ కూడా 4, 5 జీఆర్పీలు సంపాదిస్తుంటాయి… అలాంటి మణిరత్నం సినిమా… అందులోనూ త్రిష, ఐశ్వర్యారాయ్, ఇంకో ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్, కార్తి, తదితరులున్న సినిమాను ప్రేక్షకులు మరీ లైట్ తీసుకున్నారు…
Ads
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా తమిళ ప్రజలు ఈ సినిమాను తమ చరిత్రకు గర్వకారణంగా భావించారు… ఇతర భాషల ప్రేక్షకులు తిరస్కరించినా సరే, తమిళ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పట్టారు… సినిమా రెండో భాగం కూడా విడుదల కావల్సి ఉంది… ఎందుకో రిలీజ్ వాయిదా వేశారు… కొన్ని సీన్లు రీషూట్ చేసే అవకాశముంది… ఇతర భాషల ప్రేక్షకులు ఎందుకు ఈసినిమాను తిరస్కరించారో చెప్పాలంటే చాలా కారణాలు చెప్పాలి… కానీ మరీ ఈ రేంజులో టీవీ ప్రేక్షకులు కూడా లైట్ తీసుకోవడం ఒకరకంగా మణిరత్నానికి పరాభవమే… ఓ దిగ్దర్శకుడికి ఇది అవమానమే…
జెమిని టీవీలో ప్రసారం కావడం ఈ సినిమాకు ఒక మైనస్… దాని రీచ్ మరీ మరీ తక్కువ… నిజానికి జెమినీ టీవీకన్నా జెమిని మూవీస్‌లో ప్రీమియర్ ప్రసారం చేసి ఉంటే మరో అర లేదా ఒకటి జీఆర్పీ అధికంగా దక్కేదేమో… అర్థం కాలేదు కదా… నిజమే… తెలుగులో పాపులర్, నంబర్ వన్ వినోద చానెల్ మాటీవీ… దాదాపు వంద జీఆర్పీలు పడిపోయినా సరే, అదే నంబర్ వన్ ప్లేసు… దాని సీరియల్సే దానికి బలం… రెండో ప్లేసులో జీతెలుగు ఉంది… దాని జీఆర్పీలు కూడా తగ్గాయి… కానీ రెండో ప్లేసు కాపాడుకుంది… ఇదీ చార్ట్…
ఈటీవీ కాస్త పికపైంది… దాని సీరియల్స్ కూడా జనం చూస్తున్నారు… జబర్దస్త్‌లు, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీల తదితర షోలను జనం పట్టించుకోవడం లేదు కానీ సీరియల్స్ పాపులర్ కావడంతో మూడే ప్లేసులో స్థిరంగా నిలబడిపోయింది… ఇక నాలుగో ప్లేసులో ఉండాల్సిన జెమిని టీవీ మరీ అయిదో స్థానానికి పడిపోయింది… అందులో చూడటానికి ఏ షో కూడా ఆసక్తికరంగా లేదు… పట్టించుకునేవాడే లేడు… విచిత్రంగా అదే చానెల్‌కు చెందిన జెమిని మూవీస్ మాత్రం నాలుగో ప్లేసులోకి వచ్చింది… అంటే పాత సినిమాల్ని వేసుకునే చానెల్‌కన్నా జెమినిటీవీ దిక్కుమాలిన తనాన్ని అనుభవిస్తోందన్నమాట…
మాటీవీ కంటెంటును మనం హాట్ స్టార్‌లో చూడాలి… జెమిని కంటెంటును Sun Nxt ఓటీటీలో చూడాలి… జీతెలుగు కంటెంట్ జీ5 ఓటీటీలో చూడాలి… ఇన్నాళ్లూ ఈటీవీ కంటెంటును యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేవాళ్లం కదా… మిగతా ఓటీటీలకు సబ్‌స్క్రిప్షన్ ఫీజు కట్టాల్సి ఉండేది కదా… ఇప్పుడిక ఈటీవీ కూడా తమ కంటెంటెను ఈటీవీ విన్‌కు మాత్రమే పరిమితం చేయనుంది… దానికీ సబ్‌స్క్రిప్షన్ పెట్టబోతోంది… సో, తెలుగు వినోద చానెళ్ల కంటెంటు ఇక యూట్యూబులో మనకు దొరకదు… సంబంధిత ఓటీటీలో లేదా టీవీలో చూడాలి… దేనికైనా డబ్బు… డబ్బు… డబ్బు…!!
Share this Article