.
కృష్ణాజలాల వాడకంపై గతంలో కేసీయార్ చేసిన ఒక తప్పును సరిదిద్దే దిశలో తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది… ఏపీకి చెప్పింది, కేంద్రానికి చెప్పింది… అంతేకాదు, శ్రీశైలం డ్యామ్ భద్రతపైనా ఆందోళనను వ్యక్తం చేసింది… ఇతర కీలకాంశాలపై పెద్దగా ప్రస్తావనల్లేవ్, చర్చల్లేవ్, నిర్ణయాల్లేవ్…
కొన్నాళ్లుగా నదీజలాల విషయంలో రెండు రాష్ట్రాల నడుమ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో… రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఒక్కచోట కూర్చోబెట్టింది… నదీజలాల వాడకం, కొత్త ప్రాజెక్టుల మీద కొన్నాళ్లుగా బాగా చర్చ జరుగుతోంది కదా… ప్రత్యేకించి బనకచర్ల మీద చర్చ, అభ్యంతరాలు చోటుచేసుకుంటాయని అనుకున్నారు…
Ads
అసలు బనకచర్ల ఎజెండాలో ఉంటే మేం మీటింగుకే రాబోం అని కూడా చెప్పింది తెలంగాణ ప్రభుత్వం… తరువాత మనసు మార్చుకుంది… ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, నీటిమంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి హాజరయ్యారు… ఇద్దరు సీఎంలు బొకేలు ఇచ్చుకున్నారు, శాలువాలు కప్పుకున్నారు… పరస్పర మర్యాదలు, పలకరింపులు…
- అంతేనా..? బనకచర్ల ఇష్యూ రాలేదా అని రేవంత్‌రెడ్డిని మీడియా అడిగితే ‘‘వాళ్లు బనకచర్ల నిర్మిస్తామని ఈ భేటీలో అడగలేదు, అడగనప్పుడు ఇక మేం అభ్యంతరం చెప్పే అవసరం ఎందుకొస్తుంది’’ అని బదులిచ్చాడు… మరి అపెక్స్ కమిటీ భేటీ దేనికి అనడిగితే, అసలు ఇది అపెక్స్ కమిటీ భేటీయే కాదు కదా అన్నాడు…
ఏపీలోనూ, తెలంగాణలోనూ నదీజలాల వాడకం, కొత్త ప్రాజెక్టుల మీద కొందరు పొలిటికల్ లబ్డి కోసం ప్రయత్నిస్తున్నారు కాబట్టి… ఏ ఇష్యూస్ వచ్చినా సరే, కలిసి చర్చించుకుంటే శాశ్వత, సానుకూల పరిష్కారాలు లభిస్తాయి కాబట్టి… ఆ దిశలో కేంద్రం ఇనీషియేట్ తీసుకుంది కాబట్టి ఈ భేటీ… నాలుగు నిర్ణయాలు తీసుకున్నాం అన్నాడు రేవంత్ రెడ్డి… ఏమిటవి..?
కృష్ణాజలాల్ని ఏపీ ఇష్టారాజ్యంగా వాడేసుకుంటున్నది అనే ఆందోళన చాలాకాలంగా ఉన్నదే… ఎవరెంత వాడుతున్నారు అని తేల్చేవి టెలిమెట్రీ పరికరాలు… అన్ని పాయింట్లలో వాటి బిగింపు మీద గానీ, వాటి వివరాల క్రోడీకరణ గానీ గత పదేళ్లలో ఎప్పుడూ సరిగ్గా లేదు… కొన్ని బిగించినా ఎప్పుడూ ఆ లెక్కలు తీయలేదు… ఏపీ ఫలానాచోట కేటాయింపులకు మించి వాడిందని తెలంగాణ అడగడానికి కూడా చాన్స్ లేకుండా చేశారు… గతంలో…
- ఇప్పుడు అవసరమైతే మేమే మా ఖర్చుతో అన్ని పాయింట్లలో టెలిమెట్రీ (నీటి వాడకం లెక్కించే మీటర్లు) పరికరాలు బిగిస్తామని తెలంగాణ చెప్పింది, ఏపీ అంగీకరించింది… ఇది సరైన అడుగే… ప్రత్యేకించి శ్రీశైలం నీటివాడకం లెక్కలు సరిగ్గా తేలాల్సిందే…
రెండు రాష్ట్రాలకూ శ్రీశైలం డ్యామ్ గుండెకాయ… కొన్నాళ్లుగా డ్యామ్ సేఫ్టీ మీద ఆందోళన నెలకొంది… రిపేర్లు, నిర్వహణ ఏపీ బాధ్యత, కానీ పట్టించుకోవడం లేదు… ఈ ప్రమాద సంకేతాల్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది తెలంగాణ… నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది…
గతంలో సీఎంలు, కేంద్ర జలమంత్రి ఉండే అపెక్స్ కమిటీ మీటింగులో… విభజన చట్టం ప్రకారం గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు, ఏపీలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి… త్వరలో దాన్ని పూర్తి చేయాలని ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకున్నారు… (పదేళ్లయినా అది అమల్లోకి రాలేదు)…
కేసీయార్ తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి ధారాదత్తం చేశాడు అనాలోచితంగా… వాటిని మేం సరిదిద్దుతాం అన్నాడు రేవంత్ రెడ్డి…. ఇవీ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన భేటీ వివరాలు… నిజంగా బనకచర్ల ఇష్యూయే రాలేదా..? ఏమో, ఏపీ ఏం చెబుతుందో చూడాలి… ప్రస్తుతానికి ఇప్పుడు జరిగిన భేటీ జస్ట్, ఇస్తినమ్మ వాయినం టైపు…!!
Share this Article