Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈవారం తెలుగు టీవీ వినోద చానెళ్ల స్థితిగతులు, రేటింగులు ఇవీ…

June 6, 2025 by M S R

.

దేశవ్యాప్తంగా స్టార్ గ్రూపు చానెళ్లదే హవా… ఏం మేనేజ్ చేస్తాడో ఏం పాడో గానీ… నేషనల్ లెవల్‌లో టాప్ చానెళ్లన్నీ వాడివే… బార్క్ రేటింగుల్లో కూడా స్పష్టమైన ఆధిపత్యం…

ఓ ప్రాంతీయ తెలుగు చానెల్ స్టార్ మాటీవీ ఏకంగా రెండో ప్లేసులో ఉంటుంది జాతీయ స్థాయిలో… దానికి రియాలిటీ షోలు చేతకావు (నాన్-ఫిక్షన్… బిగ్‌బాస్ మినహా)… సినిమా ప్రసారాలను పెద్దగా జనమే చూడటం లేదు… మరి ఏమిటి దాని బలం…

Ads

రీచ్… ఏమో, ఇంకేమైనా ఉందో… సీరియళ్లే దాన్ని ఎప్పుడూ ప్రథమ స్థానంలో ఉంచుతున్నాయి… కాస్తో కూస్తో జీతెలుగు వాడితో పోటీపడటానికి విశ్వప్రయత్నం చేస్తోంది… ఎటొచ్చీ ఫాఫం, ఈటీవీ చాలా దూరంలో ఉండిపోయింది… రేటింగ్స్ పతనం…

నిన్నమొన్నటిదాకా దాని బలం రియాలిటీ షోలు… అవీ మొనాటనస్… ప్రత్యేకించి మరీ నాసిరకం, సినిమా ప్రమోషన్ల సుమ అడ్డా… చివరకు పాడుతా తీయగా కూడా ఒకటి రేటింగ్ దగ్గరే తచ్చాడుతోంది… ఫ్యామిలీ స్టార్, శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త నయం… ఢీ, జబర్దస్త్ ఎట్సెట్రా షోలు కూడా ఫ్లాపే… ఈ స్థితి, ఈ పతనం ఇలాగే ఉంటే నాలుగో ప్లేసు త్వరలో ఖాయం…

barc

ఈటీవీ సీరియల్స్ కూడా నాసిరకమే… ఐతే జీతెలుగు ఈ పోటీలో కాస్త నయం… ఎప్పుడూ టాప్ టెన్ సీరియల్స్‌లో మాటీవీదే ఆధిపత్యం, పెత్తనం… కానీ ఎప్పుడో ఓసారి హఠాత్తుగా ఏదో జీ సీరియల్ ఆ జాబితాలోకి వస్తుంది… ఈసారీ ఒక సీరియల్ టాప్ టెన్‌లోకి వచ్చింది… అది మేఘసందేశం…

అదెలా నాసిరకంగా ఉన్నా సరే.., ప్రేమి విశ్వనాథ్, పరిటాల నిరుపమ్ నటించే కార్తీకదీపం రేటింగ్స్‌ను భలే దంచుతాడు మాటీవీ వాడు… ప్రస్తుతం టాప్ ప్లేస్ దానిదే… తరువాత ఇల్లు ఇల్లాలు పిల్లలు… ఇక వరుసగా గుండె నిండా గుడిగంటలు, ఇంటింటి రామాయణం, చిన్ని, నువ్వుంటే నాజతగా… ఫాఫం, ఒక దశలో బ్రహ్మముడి టాప్… ఇప్పుడది ఎనిమిదో ప్లేసు…

జీతెలుగు మేఘసందేశం ఏడో ప్లేసు కాగా తరువాత చామంతి, జగద్ధాత్రి… దాదాపు అన్ని సీరియళ్లలోనూ లాజిక్‌రాహిత్యాలు, హాస్యాస్పద సీన్లుంటాయి… కానీ పాపం ఇళ్లల్లో ఇంకా వెబ్ సీరీస్, ఓటీటీలు అలవాటుపడని మహిళలే వీటికి మహారాజపోషకులు, తప్పనిసరై ఓ అడిక్షన్‌లాగా చూస్తుంటారు… లేకపోతే కార్తీకదీపం ఫస్ట్ ప్లేసు ఏమిటి..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • స్టెమ్ సెల్ థెరపీ..! సుగర్ వ్యాధిపై మనిషి గెలుపు త్వరలోనే..!
  • కృష్ణంరాజు డేట్స్ ఇచ్చాడు… ఓ సినిమా లాగించేశారు… అంతే…
  • రెడ్ గోల్డ్..! బంగారం, వెండి మాత్రమే కాదు… రాగి కూడా ‘ఆకర్షిస్తోంది’…!!
  • ఆ ఎమ్మెల్యే ఎవరో గానీ… అయ్యా, సారూ, నీకో దండం సామీ…!!
  • శతాబ్దం తరువాత ఈ గర్భగుడి తెరుచుకుంటోంది..! అసలు ఏమిటీ కథ..?
  • గీ బూతులు, గీ పాటలు… అరె, గిట్ల తయారయ్యారేందిర భయ్…
  • హే బలవంత్..! ఒక ఈటీవీ జబర్దస్త్ తరహా పే-ద్ద సినిమా స్కిట్…!!
  • వెగటు స్టార్..! యాటిట్యూడ్‌ను ప్రేక్షకులు గుంజీ గుంజీ — పగులగొట్టారు…
  • డాక్టర్ శ్రీలీల..! కాలేజీకి ఎప్పుడు పోయింది..? ఎప్పుడు చదివింది..?
  • వేదాంత దేశికులు… చిన జియ్యరుడికి అసలు తెలుసో లేదో…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions