ఏమాటకామాట… రియాలిటీ షోలకు సంబంధించి ఆహా ఓటీటీ క్రియేటివ్ టీం డూయింగ్ వెల్… వెరీ వెల్… ఇప్పుడొస్తున్న షోలలో ప్రత్యేకించి తెలుగు ఇండియన్ ఐడల్ టాప్… నో డౌట్… తరువాత సుధీర్ సర్కార్… అఫ్‌కోర్స్, వినోదమే ప్రధానమైనా సరే. ఇండియన్ ఐడల్ షో కంటెస్టెంట్లు సినిమా సంగీత ప్రియులను మత్తెక్కిస్తున్నారు…
గత రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి మెరికలను ఎంపిక చేశారు… దొరికారు అలా… ఒకరిని మించి మరొకరు అలరిస్తున్నారు… జస్ట్, ఫర్‌గెట్ అబౌట్ హుక్స్, పిచ్, నోట్స్, డైనమిక్స్ ఎట్సెట్రా… ఒక్కొక్క పదాన్ని, వాక్యాన్ని ఎంత ఎమోషన్ ధ్వనించేలా పాడుతున్నారనేదే ముఖ్యం కదా పాటకు… అదుగో అది పట్టుకున్నారు కంటెస్టెంట్లు…
ధర్మపురి కుశాలుడు ఏ శాస్త్రీయ సంగీత శిక్షణ లేకపోయినా సాధనతో పాట భావం స్పష్టంగా ఆవిష్కరిస్తూ పాడుతుంటే వినముచ్చటగా ఉంది… అసలు పాట ఉద్దేశం స్పష్టమైన భావ ప్రకటనే కదా… ఇక్కడ ఒత్తు పోయిందా, అక్కడ నోట్ తప్పిందా అనేది సగటు శ్రోతకు అక్కర్లేదు…
Ads
ఆ అమ్మాయి ఉంది హరిప్రియ… అందమైన నవ్వులాగే మధురమైన గొంతు, అందమైన ఆలాపన… ఆమె సొంత పాటకన్నా ఇతరులకు కోరస్ పాడుతుంటే ఆ మెరిట్ కూడా ఎన్నదగినదే అనిపిస్తోంది… అలాగే శ్రీ ధృతి కూడా ఓ వైవిధ్యమైన పాటకు భలే ఎఫర్ట్ పెట్టింది… కాస్త శాస్త్రీయ సంగీతంలో బేసిక్స్ తెలిసినవాళ్లు ఎలాగైనా క్లాస్ సాంగ్ పాడగలరు… కానీ మాస్ పాడి మెప్పించేవాళ్లే అసలైన మెరిటోరియస్…
ఎప్పటిలాగే కీర్తన బాగా పాడింది… నజీరుద్దీన్, అనిరుధ్‌లు ఇద్దరూ ఈ షో వదిలేశాక ఖచ్చితంగా షైన్ అవుతారు… నజీరుద్దీన్‌ను అందుకేనేమో సాకేత్ తీసుకొచ్చి మరీ పరిచయం చేశాడు… గుడ్, ఫీల్‌తో పాడుతున్నాడు… అనిరుధ్ గొంతు ఎక్సలెంట్… సరే, శ్రీరామచంద్ర ఎప్పటిలాగే బిత్తిరి సత్తిలాగా ఓ లొడాస్ లాగు, అప్పుడే బాత్‌రూం నుంచి వచ్చినట్టు ఓ పిచ్చి టాప్ వేసుకుని వచ్చాడు… బాగుంది షో…
అవునూ, మొన్న భారతీయుడు-2 ప్రిరిలీజ్ ఫంక్షన్‌కు ఈ కంటెస్టెంట్లు కొందరు వెళ్లి పర్‌ఫామ్ చేశారు కదా… అవి అవాయిడ్ చేయడమే బెటర్… అక్కడి సౌండ్ సిస్టమ్ పాటలు పాడటానికి సూట్ కాదు, ఆర్కెస్ట్రా ఉండదు, జస్ట్ ట్రాక్… డబ్బులిస్తారేమో, కానీ షో అయిపోయేవరకు డిస్టర్బ్ గాకుండా ఉండటమే మేలు… వీలైనంతవరకూ షో అయిపోయేవరకూ యూట్యూబ్ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకపోవడం మరీ బెటర్…
Share this Article