.
అనుకుంటున్నదే… ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ మొదట్లో బాగుండేది… తరువాత కొద్దికొద్దిగా మరీ జీతెలుగు సరిగమపలాగే భ్రష్టుపట్టిస్తున్నారని… మూడో సీజన్ లో చూశాం కదా…
మరి కొత్తగా స్టార్టయిన సీజన్ 4..? సేమ్, ఇంకెలా ఉంటుంది… ఇంకాస్త దిగజారుస్తారు… అదే గీతామాధురి, అదే థమన్, అదే కార్తీక్ కదా… తోడుగా శ్రీరామచంద్రకు కోహోస్ట్‌గా సమీర వచ్చింది…
Ads
ఒకామె వచ్చింది అమెరికా, డాలస్ నుంచి… పేరు శ్రీజ… ఓ టెడ్డీ బేర్ తెచ్చి థమన్‌కు ఇచ్చి ఏదేదో మాట్లాడేస్తోంది… పెద్ద ఇంప్రెసివ్ టాలెంట్ అనిపించలేదు కానీ… ఓ పిచ్చి కోరిక కోరింది… థమన్ బుగ్గలు పిండాలని ఉందట…
థమన్ ఆనందంగా ఎస్ ఎస్ అన్నాడు… ఆమె వెళ్లి బుగ్గలు పిండింది… అంతా స్క్రిప్టే కదా… తలతిక్కతనం అంటారు దీన్ని… వెంటనే థమన్ పక్కనే ఉన్న గీతామాధురి బుగ్గలు పిండాడు.,. ఆమె కూడా ఎంజాయ్ చేసింది… మరీ బాగుండదులే అనుకుని థమన్ కార్తీక్ బుగ్గలు కూడా పిండాడు…
సో, ఈ పిచ్చి, ఈ పైత్యం ఈ సీజన్4 మొత్తం కనిపించబోతున్నాయని, మొదటి రెండు లాంచింగ్ ఎపిసోడ్లతోనే పిచ్చ క్లారిటీ వచ్చింది… థమన్, ఇంకా ఇలాంటివి ఏమేం టాస్కులు ఏమున్నయ్..? సరే, ఈ తిక్క వేషాలు అవసరమా..? ఇది మ్యూజిక్ అని మరిచిపోయావా బ్రో… సరే, ఇది పక్కన పెడితే…
కొత్త గొంతులకన్నా ఈసారి కాస్త పరిచయమున్న పాత గొంతులనే తీసుకుందాం అనుకుంది ఈసారి… పర్లేదు… కానీ ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ స్పిరిట్ బాగుంది… అన్నీ ఫ్రెష్ గొంతులు… భిన్న ప్రాంతాలు, భిన్న నేపథ్యాల నుంచి… గుడ్…
ఒకామె అమెరికా, ప్రిస్కో నుంచి వచ్చింది… పేరు స్నిగ్ధ… పక్కా అమెరికన్ యాక్సెంట్‌లో పరిచయం గట్రా జరిగినా… ఆమె పాడిన పాటలో పదాల ఉచ్ఛారణ చాలా బాగుంది… ఈమె మంచి పోటీ ఇవ్వబోతోంది… గతంలో నండూరి శృతి, అభిజ్ఞలు కూడా అమెరికా నుంచి వచ్చి మంచి పోటీ ఇచ్చారు కూడా… సేమ్, ఈమె…
బాలకృష్ణ, విజయనగరం గరివిడి… తప్పెటగుళ్ల కుటుంబం… నో మ్యూజిక్ ట్రెయినింగ్, కానీ బాగా పాడాడు… భిన్నమైన బ్యాక్ గ్రౌండ్… సహస్ర 14 ఏళ్లు, హైదరాబాద్ నుంచి… వోకే…
మరొకతను పవన్ కల్యాణ్, సాఫ్ట్ వేర్, ఇన్ క్రెడిబుల్… కార్తీక్ పెట్టిన స్వర పరీక్షలో పాసై ఏకంగా గోల్డెన్ మైక్ తీసుకున్నాడు, అంటే టాప్ 12 లోకి వచ్చేశాడు… వైజాగ్ హేమంత్, సొంతంగా రాసుకుని, తనే కంపోజ్ చేసుకుని, గిటార్ వాయిస్తూ పాడాడు… థమన్ తనకు పెట్టిన టాస్క్ నచ్చింది… సినిమా పాటలు గాకుండా, అన్నీ నీ సొంత పాటలతో పోటీపడాలి అని… గుడ్…
కొందరిని అక్కడే రిజెక్ట్ చేస్తున్నారు కదా.., కానీ ఇన్ని వేల మంది పాల్గొన్న ఆడిషన్స్‌లో ఎలా సెలక్టయి, ఈముగ్గురు ఎదుటకు వచ్చారు అసలు..? అంటే ఫిల్టర్ సరిగ్గా జరగలేదా..? లేక ఇదీ స్క్రిప్టేనా..? మస్తు వడబోశాం అని చెప్పడానికి..?!
శశాంక్ నెల్లూరు… ఫ్లూట్ సాయంతో పాట బాగుంది…, తరువాత హర్షిత… శ్రీనివాస్ అనే బర్త్ బ్లయిండ్ అబ్బాయి కూడా మంచి గొంతు… తను కూడా మంచి పోటీ ఇస్తాడేమో బహుశా… నిహాల్‌కు ఏకంగా గోల్డెన్ మైక్ ఇచ్చారు… తను పోటీలో చాలా దూరం వెళ్తాడు… డాక్టర్ సింధూర కూడా మెరిటోరియస్…
లాంచింగ్ రెండు పార్టుల్లోనే రెండు సినిమా ప్రమోషన్లు… మిరాయ్, సుందరకాండ… రాబోయే ఎపిసోడ్లలో ఇంకా ఉంటయ్… బుగ్గలు పిండే వేషాల్ని మినహాయిస్తే… ఈ రెండు ఎపిసోడ్ల వరకూ వోకే…
Share this Article