కేశవరామ్… ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరీ తెలుగు ఇండియన్ ఐడల్ సాంగ్స్ కంపిటీషన్ షోలో పాల్గొంటున్నాడు… మొదట్లో ఇరగదీశాడు… ఈసారి నువ్వే ఎలిమినేట్ అయ్యేదంటూ ఎవరు హింట్ ఇచ్చారో గానీ ఈసారి తన రాగం శృతితప్పింది… నీరసంగా సాగాయి రెండు పాటలూ… పాడుతున్నప్పుడే అనిపించింది, జడ్జిలు నెగెటివ్ రెస్పాన్స్ ఇస్తున్నప్పుడే అనిపించింది ఈసారి పడిపోయే వికెట్ అదేనని…
అలాగే ఆ వికెటే పడిపోయింది… చిత్రమేమిటంటే… జడ్జెస్ చాలెంజ్ థీమ్ ఈసారి, అంటే పూర్తి కంట్రాస్టు ఉండే రెండు పాటల్ని వాళ్లే ఇస్తున్నారు… ఒకటి క్లాస్, అంటే శాస్త్రీయం టచ్, మెలొడి.. మరొకటి ఫాస్ట్ బీట్ తరహా… మరి కేశవరామ్‌కు ఆ కాంబో ఇవ్వలేదు, రెండూ సెమీ క్లాసికే… దాంతో ఆ వేరియేషన్, కంట్రాస్ట్ లోపించింది… వెరసి ఎలిమినేట్… మొన్న అమెరికన్ అభిజ్ఞ, ఇప్పుడు ఆస్ట్రేలియన్ కేశవరామ్…
కాకపోతే నువ్వు నాతోపాటు లైవ్ కాన్సర్ట్ షోలలో పాల్గొందువుగానీ కార్తీక్ ఆఫర్ ఇచ్చి బుజ్జగించాడు… ఏదో ఓదార్పు… నిజంగానే ఈ ఎలిమినేషన్లు జనం నుంచి వచ్చే వోట్ల శాతాల ఆధారంగానే సాగుతున్నాయా అనే డౌట్ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది… ఈసారి ఎపిసోడ్‌కు పాటలకన్నా నవీన్ పోలిశెట్టి ప్రధాన ఆకర్షణ… తను పాడాడు, ఆడాడు… హీరో సింగర్ అయ్యాడు… సింగర్ కమ్ హోస్ట్ శ్రీరామచంద్ర డాన్సరయ్యాడు… గీతామాధురితో కూడా డాన్స్ చేయించారు… థమన్, కార్తీక్‌లతో కూడా… సింపుల్‌గా ఇది మ్యూజిక్ షో కాదు… జస్ట్, ఇదొకరకం శ్రీదేవి డ్రామా కంపెనీ షోగా, ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ షోగా మార్చేశారు…
Ads
గతంలో ఇండియన్ ఐడల్ షో ఏకబిగిన చూసేవాళ్లం… నడుమ ఆపకుండా… ఇప్పుడు ఒక్కో పాటకు విరామం తప్పడం లేదు… గతంలో ఒకటీరెండు యాడ్స్… ఇప్పుడు మూడేసి యాడ్స్… ప్రతి అయిదారు నిమిషాలకోసారి… ఆపేసి, స్టార్ట్ చేసిన ప్రతిసారీ… టీవీ సీరియళ్ల యాడ్స్ లెంత్ నయమేమో… పైగా హోస్ట్‌తో స్పాన్సరర్ల భజన పాటకోసారి… చిరాకెత్తిస్తోంది… ప్రతివారం ఒక్కో ఆర్కెస్ట్రా సభ్యుడికి గుర్తింపు, చప్పట్లు… బ్యాలెన్స్.., షో అయిపోయేవరకు అందర్నీ కవర్ చేస్తారు…
టాప్ త్రీలో ఉంటుంది అనుకున్న శ్రీ కీర్తి ఈసారి లీస్ట్ త్రీలోకి వచ్చింది… స్కంధ కూడా… స్థిరమైన పర్‌ఫామెన్స్ ఉండటం లేదు… ఇప్పుడున్నవాళ్లలో కాన్‌స్టంట్‌గా బెటర్ పర్‌ఫారమ్ చూపిస్తున్నది కీర్తన… భరత్ రాజ్ కూడా పర్లేదు… టాప్ 6 ఖరారయ్యారు కాబట్టి ఇక రెండు లేదా మూడు ఎపిసోడ్లలో ఖేల్ ఖతం… ఈసారి ఫినాలేకు అల్లు అరవిందుడు ఏ స్టార్‌ను పట్టుకొస్తాడో చూడాలిక… (బిగ్‌బాస్ షోలాగే ఇకపై ఇలాంటి రియాలిటీ షోల కంటెస్టెంట్లు కూడా బయట వోటింగ్ ఆర్గనైజ్ చేయడానికి ఆర్మీలు, బెటాలియన్లను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని నీతి…)
Share this Article