Poodoori Rajireddy…….. ఉండకూడని స్పేస్… ఇవ్వాళ పేపర్లో ఒక వెబ్ సిరీస్ గురించిన ఫుల్ పేజీ యాడ్ కనబడింది. పోస్ట్ ఆ సిరీస్ గురించి కాదు. దాని వంకన ఒక దోషం గురించి మాట్లాడుదామని. ఆ ప్రకటనలో ఇలా ఉంది:
బుధవారం నుంచి వెజాగ్ ని వణికిస్తున్న అంతుచిక్కని హత్యలు… ఇక్కడ వైజాగ్, ని మధ్యన స్పేస్ ఉండకూడదు. కానీ కలిపి రాస్తే వైజాగ్ని అయిపోతుంది. అందుకే స్పేస్ ఇవ్వడం ద్వారా దాన్ని మేనేజ్ చేసివుంటారు. చాలామంది పెట్టే ఎఫ్బీ పోస్టుల్లో కూడా దీన్ని గమనించాను. మనోహర్ కు, రాజస్థాన్ లో, కంప్యూటర్ తో… నకారంతో ముగిసే పదాలు వచ్చినప్పుడే ఈ సమస్య వస్తోంది.
విషయాన్ని బట్టి ఫ్లోలో పెద్ద ఇబ్బందిగా ఉండదు గానీ, మరీ కొట్టొచ్చినట్టు కనబడితే బాగోదు. అది పక్కనపెడితే, అట్లా ఉండకూడదు కదా! సరిగ్గా అతుకు పడనట్టుగా రాయడం భాషా దోషమే.
Ads
నేనైతే పాత తెలుగు పద్ధతిలో వైజాగును, రాజస్థానులో, కంప్యూటరుతో అని రాయడం ద్వారా ఈ దోషాన్ని అధిగమించేవాడిని. కానీ అన్నిసార్లూ అలా కుదరదు. నామవాచకాలు యథాతథంగా రాస్తేనే బాగుంటుంది. ఈ సమస్య నాకు మొబైల్ ఫోన్లో చేసే టైపింగుకు మాత్రమే వస్తుంది. ఆఫీసు సాఫ్ట్‌వేర్‌లో ఈ ఇబ్బంది లేదు. కొందరు, రెండింటి మధ్యా క్యారట్ (^) వాడతారు. కొంత నయం. అప్పుడు అది వైజాగ్^ని అవుతుంది. కానీ సమస్య అలాగే ఉంది.
ఇంత సాఫ్ట్‌వేర్ తయారుచేసినవాళ్లు ఈ దోషాన్ని ఎలా వదిలేసివుంటారు అని చాలాసార్లు అనుకున్నాను. అందుకే ఒకరోజు మొబైల్ కీ–ప్యాడ్‌ను కిందికీ, మీదికీ గాలించి, ఈ కీ (ఫొటో చూడండి) పట్టుకున్నాను. ఈ కీయే ఆ సమస్యకు కీ అన్నమాట! ఇది చాలామందికి తెలిసే వుండొచ్చు. నాకైతే అదొక యురేకా మూమెంట్! రాయాల్సిన పదం (వైజాగ్) రాసి, ఈ కీ నొక్కి, తర్వాతిది (ని) రాస్తే– ఆ పదం వైజాగ్ని అని కలిసిపోకుండా, వైజాగ్‌ని అవుతుంది.
(నేనైతే వైజాగ్‌ని అనకుండా, వైజాగ్‌ను అని రాస్తాను. అదింకో చర్చ. మనోహర్‌ని– మనోహర్‌ను; రాజస్థాన్‌ని– రాజస్థాన్‌ను; చిరంజీవి – చిరంజీవిను అనకపోతే చాలు…)
(డెస్క్ టాప్, ల్యాప్ టాప్‌ల మీద ఈ సమస్య వస్తే… మీరు వాడుతున్నది యాపిల్ కీబోర్డ్ అయితే… వైజాగ్ తరువాత Alt 2 కొట్టి ను లేదా ని కొట్టండి… అక్షరాలు కలిసిపోవు… అలాగే చాలామందికి బుుత్వం సమస్య… కృష్ణ అని రాయాలంటే క్రుష్ణ అని రాస్తుంటారు… దీనికీ సొల్యూషన్ ఉంది… క టైప్ చేశాక వెంటనే Alt W కొట్టండి… కృ వస్తుంది… అలాగే అజ్ఞానం వంటి జ్ఞ కొట్టడం చాలామందికి ఓ సమస్య… దీనికి… జ కొట్టాక H కొట్టి వెంటనే Alt T కొట్టండి… జ్ఞ వస్తుంది… ఇలాంటి సమస్యలు- సొల్యూషన్లు మీరూ కామెంట్స్‌లో పంచుకోవచ్చు… ఇంగ్లిషు లిపిలో అక్షరాలు (టీపీ భాష) కొడుతుంటే తెలుగులో సజెషన్స్ వచ్చే కీబోర్డులు కూడా ఉన్నాయి… ఉదాహరణకు పేరు అని కొట్టాలంటే PERU అని కొట్టాలి…)
Share this Article