Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగునాట జర్నలిజం స్వేచ్ఛ, నిష్పాక్షికత… ఓ పే-ద్ధ భ్రమ..!!

May 26, 2026 by M S R

.

ఏపీలో, తెలంగాణలో మాత్రమే కాదు… దేశమంతటా ఒకే తీరు… జర్నలిజం వేరు- రాజకీయం వేరుగా లేదు… పార్టీలకు పత్రికలు, టీవీలుంటాయి… మీడియాకు పార్టీలుంటాయి… గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం వేస్ట్… ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం చాలా ప్రశ్నలను లేవనెత్తుతోంది… ఎక్కడో ఓ ఫుల్ స్టాప్ పడాల్సిన కంట్రవర్సీ మరింత రాజకీయ రంగులు పులుముకోవడానికి, కక్షలు పెరగడానికి నాగేశ్వర్ వ్యాఖ్యలు కూడా కారణమే…

జగన్‌ను జైలులో పారేయాలని పవన్ కల్యాణ్ అమిత్ షా భేటీ కోరాడని… కానీ జగన్ మాకు లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ అనీ, చంద్రబాబే ఇన్‌స్టంట్ ఫ్రెండనీ అమిత్ షా రిజెక్ట్ చేశాడని నాగేశ్వర్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడట… ఇలాంటి కథనాలు, వ్యాఖ్యలు జర్నలిజంలో కొత్తేమీ కాదు… అంతెందుకు ఏబీఎన్ రాధాకృష్ణ పీఎం, సీఎంల ప్రైవేటు రూముల్లో కూడా స్పై హిడెన్ కెమెరాలు, సీక్రెట్ ఇయర్ బగ్స్ పెట్టి మరీ విన్నట్టు, చూసినట్టు ఎన్ని రాయలేదు..?

Ads

నాగేశ్వర్ వ్యాఖ్యల్లో తప్పొప్పుల గురించి ఇక్కడ చర్చించడం లేదు… జనసేనతో గోక్కోవడం ఇష్టం లేక తనది రాంగ్ సోర్స్  అనీ, క్షమించండనీ చెప్పాడు, ఇక వదిలేయాలి… కానీ అప్పుడే అయిపోలేదు సుమా అన్నట్టు తను వ్యాఖ్యలకు కొనసాగింపు ఇవ్వడంతో జనసేనను, తెలుగుదేశాన్ని మరింత గోకినట్టు అయిపోయింది… కేసులు పడ్డాయి… చివరకు పవన్ కల్యాణ్ కూడా ఏదో స్పందించినట్టుంది… (అర్థమయ్యీ కానట్టు ఎప్పటిలాగే)…

  • అన్నట్టు… చెప్పేదేదో నేరుగా పెట్టి చెప్పొచ్చు కదా… అదేమైనా బ్రహ్మరహస్యమా..? త్రివిక్రమ్ డైలాగా ఏదో మార్మిక లోతు ఉన్నట్టు ధ్వనించడానికి… పైగా ఓ మాట వెనక్కి తీసుకోవాలి తను… నాగేశ్వర్‌కు తన కులం ఏమీ సపోర్టుగా రాలేదు, అవసరం లేదు… అసలు తను కులంతో ఎప్పుడూ ఐడెంటిఫై కాలేదు, కులానికి తను ఊడబీకింది కూడా ఏమీ లేదు… తను పదవుల్లో ఉన్నప్పుడు… పైగా 10టీవీ వసూళ్ల స్కాం సమయంలో తను కూడా ఓ బాధ్యుడే… ఈ ప్రముఖ పాత్రికేయుడు అప్పుడు దాన్ని వ్యతిరేకించలేదు, పైగా సహకరించాడు..!!

కూటమికి కోపం వచ్చింది కాబట్టి సహజంగానే వైసీపీకి ఆప్తుడు అయిపోయాడు నాగేశ్వర్ హఠాత్తుగా… అదొక వింత పోకడ… కరడుగట్టిన టీడీపీ మనిషి కొమ్మినేనికి లోకేష్‌కు ఎప్పుడైతే బెడిసికొట్టిందో అకస్మాత్తుగా కొమ్మినేని జగన్ ఆప్తుడు అయిపోయాడు… కొనసాగుతున్నాడు కూడా..! తను కూడా ఓ కేసు బాధితుడే అనుకుంటాను… వాళ్ల జర్నలిస్టుల(?)పై వీళ్లు, వీళ్ల కూతరాయుళ్లపై వాళ్లు కేసులు కామన్ అయిపోయాయి… అంతెందుకు..? అంతటి రామోజీరావునే జగన్ లిఫ్ట్ చేయాలనుకున్నాడు కదా… (సరే, పేరుకు ఇష్యూ మార్గదర్శి అయినా సరే)…

తెలంగాణ ఏమీ మినహాయింపు కాదు… కానీ కల్వకుంట్ల కవిత దీనికి ప్రాంతీయవాదాన్ని పులుముతోంది… నాగేశ్వర్ తెలంగాణవాడు కాబట్టి చంద్రబాబు గనుక అరెస్టు చేస్తే ఖండిస్తాం, చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తుందట… నిజంగానే చంద్రబాబు ఇంటిని ముట్టడించాలీ అనుకుంటే రోజుకు పది చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక పోకడలు దొరుకుతాయి…

ప్రత్యేక తెలంగాణను కరాఖండీగా వ్యతిరేకించి, అడ్డుపడిన సీపీఎం పార్టీ మనిషి నాగేశ్వర్…  మరిచిపోయినట్టుంది కవిత… ఐనా తెలంగాణవాడు అనే ముద్ర చాలా..? ఏం చేసినా, ఏం రాసినా, ఏం మాట్లాడినా నేరం కాదా..? తప్పు కాకుండా పోతుందా..? పర్ సపోజ్, రేప్పొద్దున ఎవరో ఆంధ్రుడు ఏదైనా తప్పు చేస్తే, తెలంగాణ పోలీసులు కేసు పెడితే, ఆంధ్రుడిని అరెస్టు చేస్తే ఊరుకోం అని ఎవరైనా ఆంధ్ర పార్టీ లీడర్ హెచ్చరిక జారీ చేస్తే సమర్థిద్దామా..?!

ఇదంతా పక్కన పెడితే… కూటమిలో మీడియా కథనాల పట్ల విపరీతమైన అసహనం కనిపిస్తోంది… లీడర్ అనే వైజాగ్ చిన్న పత్రికలో ఈ కథనం చూడండి…

లీడర్

హోం మంత్రి ఇలాకాలో దళిత మైనర్ బాలికపై లైంగిక వేధింపు వార్త రాసినందుకు లీడర్ రిపోర్టర్‌కు నోటీసులు జారీ చేశారట పోలీసులు… అసలే బాలిక, ఆపై మైనర్, దళిత్… పోక్సో కేసు బలంగా బిగుసుకోవాలి… బండి సంజయ్ కొడుకు పోక్సో కేసే తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది… తను మీడియా సంస్థల మీద, జరుగుతున్న పొలిటికల్ ఉద్దేశపూర్వక దుష్ప్రచారం మీద కోర్టుకెక్కాడు…

ఆ కేసుల ప్రభావం అంత బలంగా ఉంటుంది… మరి పాయకరావుపేట రిపోర్టర్ ఆ వార్త రాసినందుకు కేసులు పెడతానంటే… ఏపీలో ఎలాంటి మీడియా స్వేచ్ఛ ఉందో అర్థం చేసుకోవచ్చు..! ఎవరు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఎవరిని బుక్ చేయాలనుకుంటున్నారు..?!

అవునూ… నాగేశ్వర్‌కు వత్తాసుగా మస్తు ప్రకటనలు, ఖండనలు జారీ చేసిన అత్యంత ప్రముఖ పాత్రికేయులు ఈ పాయకరావుపేట రిపోర్టర్ ఇష్యూలో ఏమైనా స్పందించారా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తను దెయ్యమా..? వామ్మో, నన్నే ఎందుకు పలకరిస్తున్నాడు..?!
  • ప్రతిపక్షం అంటే ఇదీ… ఇటాలియన్ ట్రూ స్పిరిట్ అంటే ఇదీ…
  • ఇంతకీ అతను ఖతం అయిపోయినట్టేనా..? మరి ఇవేం రాజకీయాలు..?!
  • Still గుర్తుండిపోయే ఫోటోగ్రాఫర్… ఆయన పేరే ‘స్టిల్ భూషణ్…
  • Alia Bhatt … ‘Alpha’ మోడల్… ఏ చట్రంలోనూ బందీ కాదు…
  • ఈవీవీ మార్క్ అప‘హాస్యం ట్రాక్… లేటు వయస్సుల రొమాన్స్…
  • పంప్డ్ స్టోరేజీ..! తెలంగాణ పవర్ సెక్టార్‌లో ఓ నిశ్శబ్ద విప్లవం..!
  • పేదల వాహనం..! పల్లె బాటలపై ఈరోజుకూ తోపు టూవీలర్ ఈ మోపెడ్..!
  • సీరియస్ స్టోరీ..! ఈ నేరానికి పేరేమిటి..? అసలు ఇది నేరమేనా..?
  • అయ్యా, నవీన్ బాబూ… ఒక్క ప్రశ్న… ఈ సినిమా ఎందుకు తీసినట్టు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions