Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలుగు జర్నలిస్టుల కోసం ఓ వార్త… ఓ రియాలిటీ… గడ్డు రోజులు…!!

January 25, 2025 by M S R

.

ఒరేయ్… మీరంతా రాజీనామాలు చేసి దొబ్బెయండిరా…. అని ఓ పాపులర్ తెలుగు న్యూస్ చానెల్ ఓనర్ తన మార్కెటింగ్ స్టాఫ్‌ను పిలిచి ఎడాపెడా క్లాస్ పీకాడు…

టాప్ టెన్ జాబితాలోని ఒక ఫేమస్ తెలుగు పత్రిక… కార్డు టారిఫ్ మీద ఏకంగా 75 శాతం డిస్కౌంట్ ఇస్తోంది… అయినా సరే, కనీస రెవిన్యూ చూసి 28 కోట్ల సాలరీ బిల్లు ఎలా మేనేజ్ చేయాలిరా దేవుడా అని ఏడుస్తోంది…

Ads

మరీ ఘోరంగా ఓ పాపులర్ తెలుగు చానెల్ మరీ తన ఓటీటీ, తన యాప్, తన రెండు న్యూస్ ఛానెళ్లు ఫ్లాపయ్యాక.,. ఇక చివరకు నాసిరకం యూట్యూబర్ల స్థాయికి పడిపోయి ఆ రెవిన్యూ మీదే ఆధారపడుతోంది… రీల్స్, షార్ట్స్‌తో పబ్బం గడుపుతోంది…

జెమిని అనే ఓ పిచ్చి చానెల్‌ను వదిలేయండి… అది మరీ ఘోరం… ఎలా నడిపిస్తున్నారో ఫాఫం, ఆ స్టాఫ్‌కే అంతుపట్టడం లేదు… ‘‘గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత దుర్భిక్షం ఈ జనవరి రెవిన్యూ’’ అంటున్నాడు ఓ మిత్రుడు… అదీ దుర్గతి…

అంతకన్నా దారుణం ఏమిటంటే..? కొందరు జర్నలిస్టులు, ఎడిటర్లు, మేనేజింగ్ ఎడిటర్లు వందల కోట్లకు ఎదిగారు… కానీ వాళ్ల ఆర్గనైజేషన్లు పాతాళానికి చేరుతున్నాయి… వాళ్లను యాజమాన్యాలు వదిలించుకోలేవు, చర్యలు తీసుకోలేవు… అన్నీ మూసుకుని నడిపిస్తున్నాయి… అది మరో ట్రాజెడీ…

చివరకు ఉద్యోగుల ఇంక్రిమెంట్లకు కూడా కమీషన్లు, అమ్మాయిల్ని బేరం పెట్టే స్థాయి జర్నలిజం ఇప్పుడు తెలుగులో రాజ్యమేలుతోంది… వీళ్లంతా తెలుగు సమాజానికి ఓ దశను, ఓ దిశను చూపిస్తారట… దిక్కుమాలిన, దరిద్రగొట్టు, శూన్య జ్ఞానపు ఓనర్ల పుణ్యం… టాప్ పాపులర్ చానెల్ బాధ్యుడి మీద సీబీఐని పురమాయించినా సరే, ఆస్తుల విలువ తేల్చడంలో ఫెయిలవుతారని ఓ టాక్…

నాకు ఎప్పుడో అర్థమైంది సర్, ఓ సినిమా కంపెనీలో పీఆర్వోగా జాయినయ్యా సార్ అన్నాడు ఓ మిత్రుడు… మరికొందరు కష్టమైనా సరే అదృష్టం పరీక్షించుకుందామని యూట్యూబ్ చానెళ్లు పెట్టుకున్నారు… అదీ బాగా లేదు, అది వేరే కథ…

డెస్కుల్లో స్టాఫ్ లేరు… ఉన్నోళ్లు ఒక సింగిల్ వార్తకు గంట టైమ్ తీసుకునే బాపతు… బ్యూరోల్లోనూ అదే దుర్గతి… ఉన్నవాళ్లు వాట్సప్ వార్తలు చూసి నాలుగు అక్షరాలు గెలికే నాసిరకం సరుకు… నిష్ఠురంగా ఉన్నా రియాలిటీని ఎవరూ తోసిపుచ్చలేని దుర్గతి… బాధ్యులుగా ఉద్దరించేవాళ్లకే జర్నలిజం ప్రమాణాలు తెలియవు, అయిన కాడికి అడ్డగోలుగా అమ్ముకోవడం మినహా…!

ఓటీటీలు ఏమైనా బాగున్నాయా..? ఏమీ లేదు… ది గ్రేట్ మేఘా, మైహోం, అల్లు కలిసికట్టుగా నడిపిస్తున్నా సరే ఆహా ఓటీటీ రోజురోజుకూ నష్టాల ఊబిలోకి కూరుకుపోతుందని మీడియా సర్కిళ్లలో ప్రచారం… అమ్ముదామని అనుకున్నా ఎవడూ కొనేవాడు లేడు…

సరే, డిజిటల్ జర్నలిజం ఏమైనా బాగుందా..? అదీ బాగాలేదు… నెలనెలా ప్యాషన్‌తో 30 లక్షల దాకా ఖర్చు పెడుతున్న ఓ మోస్ట్ పాపులర్ డిజిటల్ ఈ-పేపర్ నిండా నష్టాల్లో ఉంది… ఎస్, జర్నలిస్టులు దండుకుంటున్నారు… మీడియా సంస్థలు కూరుకుపోతున్నాయి… ఈ మొత్తం కథనంలో చెప్పాలనుకున్నది అదే…

మరిది ఇలా ఎన్నాళ్లు..? ఎవరూ చెప్పలేరు… రాజకీయ ఆకాంక్షలు, సంబంధాలు, ఆబ్లిగేషన్లు ఉన్నవాళ్లు మినహా… సొంతంగా జేబుల నుంచి ఖర్చు చేయడం మినహా… ప్రస్తుతానికి న్యూట్రల్ జర్నలిజానికి ఏమాత్రం స్కోప్ లేదు… లేదు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions