Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మన సినిమా హీరోల ఫైట్లు… భీకర, బీభత్స, భయానక, రౌద్ర కామెడీ బిట్లు…

March 5, 2024 by M S R

Paresh Turlapati…..   కళాఖండం, నిన్ననే చూసా, రాత్రి భయపడతారని చెప్పలేదు !

హీరోని వేసేయ్యలని రౌడీలు కత్తులు కటార్లతో వెంటపడతారు !

హీరో వాళ్ళని తప్పించుకుని పరిగెత్తుకుంటూ ఓ సూపర్ మార్కెట్లో దూరతాడు !

Ads

రౌడీలు కూడా హీరోవెంటబడి సూపర్ మార్కెట్లో దూరతారు !

రౌడీలు సూపర్ మార్కెట్ షట్టర్ వేసేస్తారు !

లోపల హీరో ఒక్కడు

కత్తులు కటార్లతో పదిమంది రౌడీలు !

ఓ రౌడీ బాస్ కత్తిని గాల్లో ఊపుతూ ,

‘ దొరికావ్రా దొంగనాయలా.. ఇప్పుడెక్కడికి పోతావ్.. నిన్ను ము*క్క*లు ము*క్క*లుగా న*రి*కి పార్సెల్ నీ ప్రియురాలికి పంపిస్తాం రా.. హహ్హ… హహ్హ..(వికటంగా నవ్వాడన్న మాట )

హీరో ఏం మాట్లాడడు

రెండు చేతులు వెనక్కి పెట్టుకుని ఉంటాడు !

ఇక్కడే రౌడీలు హీరోని తక్కువగా అంచనా వేశారు !

హీరో వెనక చేతులు పెట్టుకుని నటరాజ్ పెన్సిల్ ని షార్పణర్ తో చెక్కుతున్నాడు !

ఆ విషయం పాపం రౌడీ ముండావాళ్ళు గమనించలేదు !

‘ రేయ్ ! ఇంకెంట్రా చూసేది.. ఏసెయ్యండీన్ని.. ‘ అని రౌడీ బాస్ అరవటంతో కత్తితో హీరోని పొ*డ*వటానికి గాల్లో ఎగురుకుంటూ వస్తాడు ఓ రౌడీ !

అప్పుడు జరుగుతుంది అద్భుతం !

షార్పణర్ తో బాగా చెక్కిన నటరాజ్ పెన్సిల్ తో పేడేల్మని రౌడీ చెయ్యి మీద గుచ్చుతాడు హీరో !

అంతే ,

వెంటనే బకెట్ రగతం బొటబొటా కారిపోతుంది !

అది చూసి మిగతా రౌడీలు షాక్

నేను కూడా షాక్

మైండ్ బ్లాక్

సినిమా పేరు కూడా మర్చిపోయా

హీరో మాత్రం ఆది

డబ్బింగ్ సాయికుమార్ కొడుకు

అంతకుమించి ఇంకేం గుర్తు లేదు

ఈమధ్య సినిమాల్లో ఫైటింగులు భలే ఉంటున్నాయిలే

స్కంద అని ఒకానొక కళాకాండంలో హీరో గారు సీఎం ఇంటికి ఒంటి చేత్తో వెళ్లి సీఎం కూతురిని ఎంచక్కా లేపుకుపోతాడు

ఊర్కో.. సీఎం ఇంట్లో బోలెడు సెక్యూరిటీ ఉంటుంది.. పైగా వాళ్ళ చేతుల్లో దీపావళి తుపాకులు ఉంటాయనుకుంటున్నవా ? స్టెన్ గన్నులు.. ఒక్కసారి ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్లు దిగి బాడీ బియ్యం ఏరుకునే చాటలా అవుతుంది అంటారా ?

నిజమే

ఆ సంగతి మీకూ నాకూ తెలుసు

కానీ మన బోయపాటి వారికి తెలీదు కదా ?

సరిపుచ్చుకుందాం అనుకుంటే ,

వెంకటేష్ తో F2.. F3 తీసి ఫుల్లు కామెడీ చేసిన అనిల్ రావిపూడి వారు భగవంత్ కేసరిలో బాలయ్య ఫైటింగులతో మనల్ని కడుపుబ్బ నవ్వించేసాడు

ఓ వందమంది రౌడీలు మెషిన్ గన్నులేసుకుని డాం డాం జుయ్ జుయ్ మని హైద్రాబాద్ వానలో వడగళ్ల లా బుల్లెట్లు కురిపిస్తే సింపుల్ గా ఓ డ్రైనేజీ మూత అడ్డేట్టుకుని ఆకర్న బుల్లెట్లు అయిపోయి రౌడీలు టక్ టక్ మని ట్రిగ్గర్లు నొక్కుతూ తెల్లమొహాలేసుకుంటే బాలయ్య పక్కనే ఉన్న నాలుగు సోడా గ్యాస్ బండలు వాళ్ళ మీదకు విసురుతాడు

అంతే కుష్మిత బీభత్సం

అంతేనా ఇంకా కామెడీ ఉంది

ఓ లిక్కర్ బాటిల్ ఓపెనర్ తో మెషిన్ గన్నులున్న ఓ వందమందిని సొరకాయ కోతలు కోస్తాడు

అబ్బా అబ్బో అని కడుపుబ్బ నవ్వుకుని వెంకటేష్ సైయింధవ్ సినిమాకి వెళ్తే అక్కడా ఫుల్లు కామెడీయే

వెంకటేష్ సొరకాయలు మాములుగా కోయలేదు మరి !

సినిమాల్లో ఫైటింగులు ఎటునుంచి ఎటుపోతున్నాయ్ ?

కాంతారావు.. నరసింహారాజులు ఈ మూల నుంచి ఆ మూలకు చెంగుచెంగున కత్తులు పట్టుకుని ఎగురుతుంటే ఊపిరి బిగబట్టి చూసేవాళ్ళం కాదూ

ఎన్టీఆర్ కైకాల ముష్టి యుద్ధాలు చేసుకుంటుంటే షబ్బాష్ అదీ.. సత్తిగాడి మూతి మీద ఇంకో గుద్దు గుద్దు..అని ఎన్జీవోడిని ఎంకరేజ్ చేస్తూ ఈలలు వేసేవాళ్ళం కదూ ?

కాలం మారుతుంది

ట్రెండ్ బట్టి అప్డేట్ అవ్వాలి అంటారా ?

అవ్వాలి కానీ ట్రెండ్ పేరుతో సహజత్వాన్ని కోల్పోకూడదు కదా

వరి కోతలు సొర కోతలు.. డ్యాముల్లో రగతాలు మరీ ఓవర్ అయిపోవట్లా ?

పోలీస్ స్టేషన్ కి వ్యానేసుకొచ్చి తాపీగా సామాన్లు దింపుకొని దడదడామంటూ దీపావళి తౌజండ్ వాలా సీమ టపాకాయలు కాల్చిన మాదిరి పేల్చి ఆ గొట్టం వేడిలో సిగరెట్ కాల్చటం బీభత్స భయానక కామెడీకి పరాకాష్ట

నేటి ఫైటింగులు చూసి కూడా తట్టుకుంటున్నామంటే కొద్దోగొప్పో ఆ బీజీఎమ్ముల వల్లే

అవునూ నాకో డౌటు ?

కొంతమంది దర్శక శిఖామణుల కంటికి మనం ఓ మాదిరిగా కూడా ఆనట్లేదంటారా ?

(ఇది డిషేమ్ డిషేమ్ వరకు మాత్రమే..మిగతా ఇషయాలు ఇంకోసారి మాట్లాడుకుందాం )…. పరేష్ తుర్లపాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియా భాయ్… హేట్సాఫ్ సిరాజ్… నువ్వూ ట్రూ హైదరాబాదీ…
  • కర్త, కర్మ, క్రియ కేసీయారే..! ఖ్యాతి మసకబారి, తొలి అధికారిక మరక..!!
  • వంగా సందీప్‌రెడ్డి మార్క్ రోల్… నో, నెవ్వర్, సాయిపల్లవికి అస్సలు నప్పదు…
  • నౌషాద్ ఆఫ్ సౌత్ ఇండియా… ఘంటసాలకూ ఆరాధ్యుడు ఈ సుబ్బరామన్…
  • ఆదాయమే పరమార్థమై… ఆ ‘దేవాదాయ ధర్మాదాయ’ నామకరణాలు…
  • ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది… వందేమాతరం..,
  • జేజమ్మ..! బిరబిరా సాగే నదీప్రవాహం… ప్రేమలో అందరినీ తడిపేస్తూ…!!
  • కడుపు చించుకోవద్దు… రేవంత్‌రెడ్డి మాటల్లో తప్పేముంది..?!
  • ఊరికే రావు జాతీయ అవార్డులు… ఎక్కడైనా సరే లెక్కలుంటాయండీ…
  • 5600 కోట్ల విలాసం అది… అడుగే పెట్టలేదు, అమ్మేస్తున్నాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions