.
రేవంత్ ఈ- పత్రిక అంటంటారు దాన్ని… ఢిల్లీ ఫలితాలపై కవిత ప్రభావం అని రాస్తూ, మరో స్టోరీలో కేసీయార్ అదేదో ఫ్రంట్ కోసం ఎవరెవరిని కలిశాడో వాళ్లందరూ దెబ్బతిన్నారని మరో విశ్లేషణ…
బీఆర్ఎస్ బ్యాచేమో… రేవంత్‌రెడ్డిని వెక్కిరిస్తూ,.. ఐరన్ లెగ్గు, వెళ్లాడు, ప్రచారం చేశాడు, బొందపెట్టాడు అని వెటకారాలు… మరోవైపు ఇలాంటి ప్లస్, మైనస్ క్యాంపెయిన్లకు పెట్టింది పేరైన టీడీపీ బ్యాచ్ మరో టైపు…
Ads
అందులోనూ ఏబీఎన్, టీవీ5 మరీ ఎక్స్‌ట్రీమ్ భజన కదా… ఇలా బాబు వెళ్లాడు, అలా టర్నయిపోయింది, లేకపోతే ఆప్ గెలిచేది… చంద్రబాబే గేమ్ ఛేంజర్… చంద్రబాబు ఎంట్రీతో ఢిల్లీ రాజకీయాల్లో పెనుమార్పు అంటూ… చంద్రబాబు ఎక్కడెక్కడ ప్రచారం చేశాడో, ఆ రిజల్ట్ ఏమిటో ఏకరువు పెట్టింది…
ఎవరిష్టం వాళ్లు… ఇంకా నయం, మా సారు బిజీగా ఉండి వెళ్లలేదు, లేకపోతే తనే గనుక ఆప్‌కు జై కొట్టి ఉంటే ఇలా సీన్ టర్నయిపోయేది అంటూ వైసీపీ బ్యాచ్ అందుకోలేదు… ఫాఫం పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్ కదా, పోలేకపోయాడు… లేకపోతే బీజేపీకి మొత్తం 70 సీట్లూ వచ్చి ఉండేవి అని జనసేన బ్యాచ్ రాయలేదు…
చంద్రబాబు ఇలాంటి ప్రచారాలకు ఫేమస్ కదా… (శ్రీశ్రీ చెప్పినట్టు పేర్లకు షికార్లకు పుకార్లకు ప్రసిద్ధులు…) దొరికింది చాన్స్ అనుకుని, చూశారా, నన్ను అరెస్టు చేసినప్పుడు 60 దేశాల్లో నిరసనలు జరిగాయి, హైదరాబాద్‌లో నిరసనల్ని అణిచివేయ ప్రయత్నించారు, అనుభవించారు అంటున్నాడు, అక్కడికి నిరసనలు జరగనిస్తే ఫాఫం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేవాడు కాదేమో, కేసీయార్ మళ్లీ సీఎం అయ్యేవాడేమో…
కేటీయార్ కూడా దొరికింది చాన్స్ అనుకుని రాహుల్ గాంధీని వెక్కిరించాడు గానీ, బీజేపీని అభినందించలేదు… అసలు ఎవరినైనా అభినందించడమో, ప్రజాతీర్పును ఆమోదించడమో ఆ పార్టీ చరిత్రలోనే లేదు కదా, ఉండదు కదా… పైగా తెర వెనుక అదే బీజేపీ కరుణాకటాక్షాల కోసం తాపత్రయాలు…!!
ఇన్నిరోజులూ జైలుకు వెళ్లొచ్చినవాళ్లు ముఖ్యమంత్రులు అవుతారనే ఓ పిచ్చి ప్రచారం సాగేది కదా… కేటీయార్‌ను గనుక అరెస్టు చేస్తే అక్కడ యోగసాధన చేసి తరువాత కేటీయార్ సీఎం అవుతాడనే భయంతోనే రేవంత్ తన జోలికి వెళ్లడం లేదనే చెణుకులూ వినిపించేవి కదా… ఇప్పుడు టోన్, ట్యూన్ మారింది…
కేజ్రీవాల్ జైలుకు వెళ్లొచ్చాడు, భంగపడ్డాడు,.. సో, కేటీయార్‌ను జైలులో వేసినా రేవంత్‌కు భయం ఏమీ అక్కర్లేదు అని మరో ప్రచార బ్యాచ్… ఇలా ఎక్కడ ఏ రాజకీయాల్లో ఏం జరిగినా తమ రాజకీయాలకు, తమ ప్రచారాలకు వాడుకోవడం తెలుగు రాష్ట్రాల్లో మరీ పెరిగిపోయింది…
చంద్రబాబు, రేవంత్, కేసీయార్, జగన్, పవన్ ఎట్సెట్రా ఎవరు ఏ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేసినా ప్లస్సూ ఉండదు, మైనస్సూ ఉండదు… వీళ్లు వచ్చారని హఠాత్తుగా అక్కడ సిట్యుయేషన్లు ఏమీ మారవు… లోకల్ పాలిటిక్స్, మంచీ చెడూ మాత్రమే పనిచేస్తాయి… అది రియాలిటీ…!! ఆయా రాష్ట్రాల్లో ప్రచారాలకు వెళ్లడం ఢిల్లీ హైకమాండ్లను, ఆ నేతల్ని మంచి చేసుకోవడం కోసం మాత్రమే…!! వాళ్లు రమ్మంటారు, వీళ్లు వెళ్తారు, ఇస్తినమ్మ వాయినం, అంతే…!!
Share this Article