టీఆర్ఎస్ వాదనలో తప్పేమీ లేదు… అయిదు ఊళ్లు అడగడంలో అనౌచిత్యం కూడా ఏమీలేదు… ఒరే నాయనా… గోదావరి వరద అదుపు తప్పితే భద్రాచలాన్ని కాపాడటానికి కరకట్టలు కడతాం, ఆ అయిదు ఊళ్లు ఇవ్వండిరా బాబూ అని అడగడంలో ఫాల్ట్ లేదు… కాకపోతే… ఆ అడిగే డిమాండ్ బాధ్యతను మంత్రి అజయ్‌కు అప్పగించడమే తప్పు,.. తనకేమీ తెలియదు… ఒక పాయింట్‌కు కమిట్ కావడంలో మెళకువ తెలియదు… ఏదో పైనుంచి ఏదో అసైన్‌మెంట్ ఇచ్చారు… ఈయన పాటించాడు… అంతకుమించి ఫాఫం అజయ్‌కు మాత్రం ఏం తెలుసు..? ఏదో వైద్యవిద్యా వ్యాపారి…
- తెలంగాణ నుంచి పోలవరం కోసం ఏడు మండలాల్ని ఏపీలో కలిపేశారు… వోకే… రెండు రాష్ట్రాల కోణంలో గాకుండా స్థూలంగా జాతి ప్రయోజనాల కోణంలో ఒకే అనుకుందాం… కేసీయార్ సైద్ధాంతిక వ్యతిరేకత కోణంలో వ్యతిరేకించాడు, ఓరోజు బంద్ అన్నాడు, తరువాత వదిలేశాడు… అందులో తనకు వచ్చేదేమీ లేదు కాబట్టి…
- కానీ ఇప్పుడు కాళేశ్వరం డైవర్షన్ కోసం క్లౌడ్ బరస్ట్ అన్నాడు, విదేశీకుట్ర అన్నాడు… వర్కవుట్ కాలేదు, జనం నవ్వుకున్నారు… ఇక పోలవరం మీద పడ్డాడు… రాజకీయంగా ఈ వ్యాఖ్యలు వోకే అనుకుందాం… ఎమోషన్స్ క్రియేట్ చేస్తే పొలిటికల్‌గా వర్కవుట్ అవుతుందనేది స్ట్రాటజీ అనుకుందాం…. అయితే..?
గోదావరిలో గరిష్ట సంభావ్య వరద (Maximum Possible Flood) అని అంచనా వేసింది సెంట్రల్ వాటర్ కమిషన్… ఆ 50 లక్షల వరద వస్తే భద్రాచలం బతుకు బస్టాంటే అని రిపోర్టులు చెప్పాయి… అప్పట్లో కిక్కుమనలేదు… ఇప్పుడు సెగ తగిలింది కాబట్టి కరకట్టలు, అయిదు ఊళ్లు అనే పాట ఎత్తుకున్నారు… ఆ అయిదు ఊళ్లకే పరిమితం గాకుండా పోలవరం ఎత్తు తగ్గించాలి అనే డిమాండ్ ఎత్తుకున్నారు… అది తప్పు ఎందుకంటే..?
Ads
ఫాఫం… పోలవరం అంటే…. ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అన్నట్టుంది దాని పరిస్థితి… అధికారం మారాక రివర్స్ ఇంజనీరింగ్ పేరిట కమ్మ కంట్రాక్టర్ల తలలు నరికేసి, మేఘా కృష్ణారెడ్డికి అప్పగించారు… మేఘా అంటేనే డబ్బులు, కమీషన్లు… కాఫర్ డ్యాములు మన్నూమశానం వదిలేసి స్పిల్ ఓవర్ పనులను వేగంగా చేసిపారేశారు… ఆమధ్య వరదలు వచ్చి పోలవరానికి ప్రాణమైన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది… అదెంత దెబ్బతిన్నదో ఇప్పటికీ ఎవడికీ తెలియదు… ఏం చేయాలో ఎవరూ చెప్పరు… ఆ ఖర్చు ఎవరు భరించాలో ఎవరికీ తెలియదు…
ఎంత ఖర్చు అవసరమో, ఎవరు భరించాలో ఎవడూ చెప్పలేని దురవస్థ… ఈలోపు మళ్లీ భారీ వరదలు… ఈసారి కాఫర్ డ్యామ్ దురవస్థ… అదెంత దెబ్బతిన్నదో ఎవరికీ అంచనా లేదు… ఫాఫం, వెటకారాలు తప్ప ఇంకేమీ సబ్జెక్టు లేని అంబటి ఆ శాఖకు మంత్రి… ఏపీ ప్రభుత్వానికి అదొక శాపం… ఏదీ సరిగ్గా మాట్లాడలేడు… ఎహె, అయిదు ఊళ్లేమిటోయ్, మేం భద్రాచలం అడుగుతాం ఇస్తారా అంటూ తనకు మస్తు తెలివితేటలు ఉన్నట్టుగా కామెంట్స్… అంబటి ఎంపిక జగన్ అద్బుతమైన తెలివితేట కాబట్టి దాన్నీ వదిలేద్దాం…
బొత్స కామెంట్ మరీ దరిద్రం… సారు గారు అంబటికి తాత కదా… ఇలాగే డిమాండ్ చేస్తే మేం మళ్లీ తెలంగాణను ఏపీలో కలపాలని అడుగుతాం అని ఏదో పిచ్చి వ్యాఖ్య వదిలాడు… జగన్ మరో తెలివైన ఎంపిక బొత్స కదా… అంటే..? తెలంగాణ లేకపోతే బతకలేని దురవస్థా ఏపీది..? అదేనా బొత్స చెప్పేది… ఇంతకన్నా అవమానకరం ఏముంది..? జగన్‌ను భ్రష్టుపట్టించడానికి ఒక అంబటి, ఒక బొత్స చాలు… ఇంకెవరూ అక్కర్లేదు…
అసలే పోలవరం భ్రష్టుపట్టించారు… ముంపు ప్రాంతాల పరిహారం ఖర్చుకు జడిసి, మొదటి దశ పేరిట పోలవరం నీటినిల్వకు ఓ పరిమితి మేరకు మాత్రమే అని నిర్దేశించుకున్నారు… అంటే, ఆ బహుళార్థసాధక, ప్రజోపయుక్త ప్రాజెక్టు ప్రాణం వాళ్లే తీసేసుకుంటున్నారు… తెలుగుదేశం భాషలో చెప్పాలంటే పోలవరాన్ని జస్ట్, ఓ బ్యారేజీలా మార్చేస్తున్నారు… అవసరమైతే ఇంకో రెండు ఎత్తిపోతల్ని అర్జెంటుగా మేఘా వాళ్లకు అప్పగించి, కథ నడిపించేస్తారు… మరిక టీఆర్ఎస్ భయసందేహాలు దేనికి..?
మరో కామెడీ ఏమిటంటే…? టీఆర్ఎస్ మంత్రి అజయ్ చేసిన డిమాండ్… పోలవరం ఎత్తు తగ్గించాలి… ఆల్‌రెడీ పోలవరం స్పిల్ వే పూర్తయిపోయింది… ఇప్పుడు దాన్ని అడ్డంగా ఓ రెండు మీటర్లు కోసేసి, ఎత్తు తగ్గించడం సాధ్యం కాదు… అసలు వాళ్లకే పోలవరం ప్రయోజనాల మీద క్లారిటీ లేదు… జలవిద్యుత్తు, నీటినిల్వ, వరదనియంత్రణ గట్రా అంబటికి అర్థమయ్యేంత సీన్ కూడా లేదు… ఇదిలా ఉంటే… ఏదో ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి భద్రాచలం ఇచ్చేస్తారా..? తెలంగాణను కలిపేస్తారా..? వంటి పిచ్చి వాదనలకు దిగారు… ఇటు కేసీయార్‌కేమో కాళేశ్వరం డైవర్షన్ కావాలి… అటు జగన్‌కేమో పోలవరం వైఫల్యాల నుంచి డైవర్షన్ కావాలి… వారెవ్వా… ఏం ప్రజా పాలకులురా స్వామీ…!!
Share this Article