.
ఇటీవల మనం ‘ముచ్చట’లో కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!! శీర్షికతో తమిళనాట తెలుగువాళ్ల వోట్ల కోసం ఈసారి ద్రవడ పార్టీలు ఎలా పెద్దపీట వేస్తున్నాయో, ఎన్నేసి టికెట్లు ఏయే కులాలకు ఇచ్చాయో చెప్పుకున్నాం కదా…
గుర్తుందా..? KGF ( కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ) ఓ మూడు నాలుగు నెలల కిందట కోయంబత్తూరులో ఒక భారీ బహిరంగ సభ పెట్టి, కమ్మలకి ఉప ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసినప్పుడు అందరూ నవ్వుకున్నారు… కానీ నిజంగానే అనేకచోట్ల తెలుగువాళ్లు ఓ వోటుబ్యాంకుగా మారిన తీరుకు అది అద్ధం పడుతోంది…
Ads
రఫ్‌గా ఏయే పార్టీ ఏయే కులాలకు ఎన్నేసి టికెట్లు ఇచ్చిందో ఓసారి చూద్దాం…
• Kamma Naidu: DMK Team (11) | ADMK Team (7)
• Balija/Gavara Naidu: DMK Team (7) | ADMK Team (4)
• Reddy: DMK Team (5) | ADMK Team (5)
• Isai Dravidar/Isai Vellalar: DMK Team (4) | ADMK Team (0)
• 24 Manai Telugu Chettiyar: DMK Team (0) | ADMK Team (3)
• Velama Naidu: DMK Team (0) | ADMK Team (1)
ఈసారి చంద్రబాబును ప్రచారరంగంలోకి దింపింది బీజేపీ… ప్రధానంగా తెలుగువాళ్లు ఉన్నచోటే మీటింగులు ఏర్పాటు చేస్తున్నారు… తను ఏం చెప్పాలి…? అన్నాడీఎంకే కూటమికే వోట్లు వేయాలని చెప్పాలి… డీఎంకే ప్రజావ్యతిరేక ప్రభుత్వమని చెప్పాలి… అంతేకదా…
డీఎంకే కమ్మ సామాజికవర్గానికి 11 మందికి టికెట్లు ఇచ్చింది… ఇప్పుడు వాళ్లందరినీ ఓడించాలని చంద్రబాబు పిలుపు ఇస్తూ తిరగాల్సిందే కదా… అదే పనిచేస్తున్నాడు… బీజేపీ ఏ పనైనా చేయిస్తుంది..!
బలిజ, గవర సామాజికవర్గాలకు కూడా డీఎంకే ఎక్కువ టికెట్లు ఇచ్చింది… ఈసారి పవన్ కల్యాణ్‌ను ఎన్నికల ప్రచారబరిలోకి దింపి… సనాతన ధర్మరక్షణ చాంపియన్ అన్నట్టుగా ఫోకస్ చేయాలని బీజేపీ మొదట్లో భావించిందట… మరేమైందో తెలియదు… ఇప్పుడంటే ఆరోగ్యం బాగాలేక, ఏదో సర్జరీ చేసుకుని హాస్పిటల్‌లో ఉన్నాడు గానీ… మొన్నమొన్నటిదాకా తననెందుకు వాడుకోలేదు బీజేపీ..?
రెండు ద్రవిడ పార్టీలు రెడ్లకు అయిదేసి టికెట్లను ఇచ్చాయి… జగన్ మోహన్ రెడ్డి ఆ ప్రచారానికే వెళ్లే సవాలే లేదు… తను ఇండి కూటమి కాదు, ఐనాసరే, స్టాలిన్‌తో సాన్నిహిత్యం ఉన్న దృష్ట్యా డీఎంకేకు వ్యతిరేకంగా వెళ్లడు… అలాగని బహిరంగంగా బీజేపీకి మద్దతునిస్తూ అన్నాడీఎంకేకు ప్రచారం చేయలేడు…
కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం, పినరై విజయన్ పాలనకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి ఔట్ రైట్ ప్రచారం చేశాడు, తప్పనిసరై కేరళ సీఎం, సీపీఎం తనకు కౌంటర్లు, సమాధానాలు ఇచ్చే సీన్ క్రియేట్ చేశాడు, కానీ తమిళనాట ప్రచారంలోకి కాంగ్రెస్ తనను దింపలేదు ఎందుకో మరి..!
సో, ఈసారి తెలుగువాళ్లకు గణనీయంగా టికెట్లు దక్కినా సరే… ఒక్క చంద్రబాబు తప్ప… వేరే ఏ తెలుగు నాయకుడూ తమిళనాట ‘తెలుగు ప్రాంతాల్లో’ ప్రచారానికి… ‘ఇల్లె’…!!
Share this Article