Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేణుస్వామిపై తెలుగుదేశం వింత ట్వీట్… ఆహా, సూపర్ చమత్కారం…

May 27, 2024 by M S R

ఏపీలో ఎవరు గెలుస్తారు..? ఏమో, ఎవరూ చెప్పలేని స్థితి… వాడు తెలంగాణ వోటరు కాదు, కడుపులో ఉన్నది కక్కేయడానికి… ఏపీ వోటరు, గుంభనంగా ఉంటాడు, ఉన్నాడు… సరే, ఎవరు గెలిస్తేనేం… దొందూ దొందే… జగన్ ఉద్దరించిందేమీ లేదు, రేపు చంద్రబాబు గెలిస్తే ఉద్దరించబోయేదీ లేదు… పోనీ, జగన్ మళ్లీ గెలిచినా పెద్ద తేడా ఏమీ ఉండదు, ఈ ఐదేళ్ల ఉద్దారకమే మరో ఐదేళ్లు…

కానీ బీజేపీని, జనసేనను కలుపుకుని, సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన తెలుగుదేశం అధికారంలోకి వస్తామనే అంటోంది… ఆశ సహజం, వచ్చినా పెద్ద ఫరకేమీ పడదు… ఎవరికీ అభ్యంతరమూ లేదు… కానీ తమది జాతీయ పార్టీ, అంతర్జాతీయ పార్టీ అంటూ బీరాలు, గొప్పలు, ఏతులు చెప్పుకునే పార్టీ చిన్నాచితకా విషయాలపై ట్వీట్లు పెట్టి అదోతరహా ఆనందం పొందుతున్న తీరే నవ్వొచ్చేలా ఉంది…

తెలుగుదేశం అధికారిక పోస్ట్ ఏమిటంటే… ఇదుగో…

Ads

వేణుస్వామి

ప్రతి తెలుగువాడూ సన్ రైజర్స్ గెలవాలని కోరుకున్నాడు… కారణం, అది హైదరాబాద్ పేరు పెట్టుకున్నందుకు మాత్రమే కాదు, ఈసారి భలే ఫైట్ ఇచ్చిన జట్టు కాబట్టి… పోరాటపటిమ ప్రదర్శించారు కాబట్టి… ఫైనల్‌లో తప్ప మిగతా మ్యాచుల్లో మంచి ఆటతీరు చూపించారు కాబట్టి…

కానీ తెలుగుదేశం అభిమానులు మాత్రమే సన్ రైజర్స్ గెలవొద్దని కోరుకున్నారు… ఎందుకు..? వేణుస్వామి ఆ జట్టు గెలుస్తుందని చెప్పాడట కాబట్టి… సో, చెబితే ఏమిటట..? ఆయన జగన్ గెలుస్తాడని కూడా చెప్పాడు కాబట్టి… సన్ రైజర్స్ జట్టు గెలుస్తుందని చెప్పినా గెలవలేదు, సో, ఆయన చెప్పే జోస్యాలన్నీ తప్పు, జగన్ గెలుస్తాడనే జోస్యం కూడా తప్పే … ఇదీ వాళ్ల లెక్క…

ఫాఫం, దాన్నే ఓ ట్వీటులో చెప్పుకున్నారు… ఒక జ్యోతిష్కుడి జోస్యం ఆధారంగా గెలుపోటముల మీద ఆశలు, ఆకాంక్షలు అల్లుకునే తీరు నిజంగానే నవ్వొచ్చేలా ఉంది… నిజానికి వేణుస్వామి ఏం చెప్పాడో కూడా నిర్దారించుకునే సోయి లేదు ఆ పార్టీ సోషల్ ఖాతాలు హ్యాండిల్ చేసేవాళ్లకు… (వీళ్లకు లోకేషేనట కదా లీడర్)…

కావ్య మారన్ జాతకం బాగుంది, అందుకే సన్ రైజర్స్ జట్టు బాగా ఆడుతోంది అన్నాడు గానీ ఈసారి కప్పు గెలుస్తుందని చెప్పలేదు తను… సరే, ఒకవేళ చెప్పినా జోస్యాలన్నీ నిజం కావాలనేమీ లేదు… అదంతా వేరే సబ్జెక్టు… ఆ జానర్ వేరు… దాన్ని బట్టుకుని ఆయన చెప్పింది జరగలేదు కాబట్టి, ఆయన చెప్పిన జగన్ గెలుపు నిజం కాబోదు అనే సూత్రీకరణే అబ్సర్డ్…

కానీ ఒక్కటి మాత్రం నిజం… వేణుస్వామి ఏ ప్రచారమైతే కోరుకున్నాడో… నెగెటివో, పాజిటివో ఎప్పుడూ తెర మీద ఉండాలని కోరుకున్నాడో… దానికి బాగా సాయపడింది తెలుగుదేశం కేడర్ ఈరకంగా… జోస్యాల స్ట్రయిక్ రేట్ మన స్టాక్ మార్కెట్‌లాగే చిత్రంగా ఉంటుంది… అఫ్‌కోర్స్ సట్టా మార్కెట్ కూడా… అసలు ఎగ్జిట్ పోల్సే తలకిందులవుతున్నప్పుడు ఒక జోస్యం ఆధారంగా ఈ ట్వీట్లు ఏమిటో, ఈ సోషల్ ఆనందం ఏమిటో…

ఐనా, వేణుస్వామి కోణంలో గాకుండా… చంద్రబాబు కష్టపడి చెమటోడ్చి నిర్మించిన హైదరాబాద్ పేరు పెట్టుకున్నందుకైనా సన్ రైజర్స్ గెలవాలని కోరుకోవాలి కదా టీడీపీ కేడర్… అబ్బే, అదంతా మాకు అక్కర్లేదు… జగన్ గెలుస్తాడని చెప్పిన ప్రతి ఒక్కరూ మాకు పరాయివాళ్లే… వాళ్ల దోస్తు నాగబాబు భాషలో చెప్పాలంటే..!!

అవునూ, ఒకవేళ పుసుక్కున వేణుస్వామి గనుక ఈసారి జగన్ గెలవడు, చంద్రబాబుదే విజయం అని చెప్పి ఉంటే… సన్ రైజర్స్ గెలవాలనీ, వేణుస్వామి జోస్యం నిజం కావాలనీ కోరుకునేవాళ్లేమో… భలే దొరికారు స్వామీ…!! జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తరువాత ఇక వేణుస్వామి మీద దుమ్ముదుమారమే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions