Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిజంగా మనకు థర్డ్ వేవ్ ముప్పు ఉందా..? అది కబళించేయబోతోందా..?

August 24, 2021 by M S R

………… By…. Amarnath Vasireddy…..    మన దేశంలో మొదటివేవ్ రెండోవేవ్ లలో సుమారుగా డెబ్భై శాతం మంది ఇన్ఫెక్ట్ అయ్యారు . మొదటి వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి ఆల్ఫా కరోనా యాంటీబోడీలు వచ్చాయి . రెండో వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారికి డెల్టా లేదా డెల్టా ప్లస్ కరోనా యాంటీబోడీలు వచ్చాయి . యాంటీబోడీలు రక్తం లో ఆరు నుంచి ఎనిమిది నెలలు ఉంటాయి . యాంటీబోడీలు రక్తంలో వున్నప్పుడు కరోనా సోకే అవకాశం లేదు . రెండో వేవ్ లో సుమారుగా 45 శాతం జనాభా ఇన్ఫెక్ట్ అయ్యారు . రెండో వేవ్ ఏప్రిల్ -మే నెలల్లో వచ్చింది . అంటే ఈ యాంటీబోడీలు కనీసం డిసెంబర్ దాకా ఉంటాయి . పై రెండిటికి తోడు వాక్సిన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది . మొదటి వేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారు , రెండోవేవ్ లో ఇన్ఫెక్ట్ అయినవారు , అసలు ఇప్పటిదాకా ఇన్ఫెక్షన్ కు గురికానివారు కూడా వాక్సిన్ లు వేసుకొన్నారు .

covid22

యాంటీబోడీలు అయితే ఎనిమిది నెలలే ఉంటాయి కానీ immunity వ్యవస్థలోని టి సెల్స్, శరీరంలో ప్రవేశించిన వైరస్ ను photographic మెమరీ లో దాచుకొంటాయి . అవి భవిష్యత్తులో తిరిగి శరీరంలోకి ప్రవేశిస్తే దాన్ని గుర్తించి దాడి చేసి సులభంగా చంపేస్తాయి . వాక్సిన్ వేసుకున్నా టి సెల్స్ రక్షణ ఉంటుంది . మనకు అందుబాటులో ఉన్న వాక్సిన్ ఆల్ఫా వెరైటీది. అటుపై డెల్టా . డెల్టా కరోనా ను గుర్తించడంలో ఇమ్మ్యూనిటి వ్యవస్థ కొంత confuse కావడం వల్లే వాక్సిన్ వేసుకున్న కొంతమందికి తిరిగి కరోనా సోకుతోంది . దీన్నే breakthrough ఇన్ఫెక్షన్స్ అంటున్నారు . ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు మొదటివేవ్ లో సోకినవారి కూడా సోకవచ్చు . కానీ అసలు విషయం ఏమిటంటే ఇలాంటివారికి ఇన్ఫెక్షన్ వచ్చినా వ్యాధి తీవ్రం కాదు . ముందుగా కాస్త confuse అయినా , చివరకు టి సెల్స్ వైరస్ భరతం పట్టేస్తుంది . అంటే మనదేశంలో ఇన్ఫెక్షన్ వల్ల నైతేనేమి , వాక్సిన్ వల్ల నైతేనేమి పెద్దల్లో అత్యధిక శాతానికి టి సెల్స్ రక్షణ వుంది . ఇది కనీసం 15 ఏళ్ళు రక్షణ కల్పిస్తుంది . మీకు మొదటివేవ్ లో కానీ లేదా రెండోవేవ్ లో కానీ కరోనా సోకిందా ? లేదా కనీసం వాక్సిన్ వేసుకొన్నారా ? అయితే మీకు 15 ఏళ్లపాటు టి సెల్స్ రక్షణ ఉంటుంది . కరోనా సోకినా అది సాధారణ జలుబు లాగే అవుతుంది . మీ ఇమ్మ్యూనిటి వ్యవస్థ మరీ దెబ్బ తినిపోతే తప్పించి కరోనా మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు . డ్రగ్స్ తీసుకోవడం , వేరే కారణాల వల్ల తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఆక్సిడెంట్, సర్జరీ లాంటి కారణాలతో ఇమ్మ్యూనిటి బలహీనం అవుతుంది . అప్పుడు కరోనా సోకితే డేంజర్ .

Ads

corona

ఇక మిగిలింది పిల్లలు . వారికి శరీరం లో ACE2 receptors తక్కువ . అంటే వారి శరీరంలోకి కరోనా ప్రవేశించినా అది శరీరకణాల్లోకి చొచ్చుకొని పోలేదు . కాబట్టి వారికీ మహా అంటే ఒకటి రెండు రోజులు జలుబు , జ్వరం ఉంటుంది . అంతే. పుట్టుకతో జన్యుపరమైన వ్యాధులు ఉన్న పిల్లలకు మాత్రం డేంజర్ . ఇక మనదేశంలో వేవ్ లు ఉండవు. ఇన్ఫెక్షన్స్ ఉన్నా మరణాలు పెద్దగా ఉండవు . పైన చెప్పినట్టు ఇమ్మ్యూనిటి బాగా దెబ్బతిన్నవారికి మాత్రం ప్రమాదం . ఎండలో నడవండి . రోజుకు నాలుగు litres నీరుతాగండీ . ప్రోటీన్ లు మినరల్స్ విటమిన్ లు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోండి . భయం, ఆందోళన, చిరాకు, కోపం, అసహనం లాంటి నెగటివ్ ఫీలింగ్స్ కు దూరంగా వుండండి . చక్కగా నిద్రపోండి . ఇవే ఇమ్మ్యూనిటి సూత్రాలు . ఇవేవి చేయనివారికి, ఇమ్మ్యూనిటిని బలహీనపరుచుకొన్న వారికీ కరోనా గండం జీవిత కాలం వుంటుంది .

vaccination1

ఇమ్మ్యూనిటిని అందులోని టి సెల్స్ ను బలంగా ఉంచుకొన్న వారికి కరోనా అనేది ఇకపై సాధారణ జలుబు లాంటిది . సంవత్సరానికి రెండు సార్లు కాదు మూడు సార్లు సోకినా ఏమీ కాదు . సోకదా అంటే ముక్కునవాడికి తప్పక సోకుతుంది . సోకకుండా ఎందుకు ఉంటుంది ? కాకపోతే herd ఇమ్మ్యూనిటి వల్ల లక్షల మంది ఒకేసారి ఇన్ఫెక్షన్ కు గురికావడం జరగదు . అంటే వేవ్ లు రావు . కేసులు పోవు . కరోనా పోదు . కొత్త varient వస్తే అంటారా ? మ్యుటేషన్ అనేది రోజూ జరుగుతుంది . గత 18 నెలల్లో లక్షల వారియెంట్ లు వచ్చాయి . వాటికి అంత సీన్ ఉండదు . ఆల్ఫా కరోనా కు కొమ్ములు పెట్టి భారతీయుల జన్యుపూల్ కు ఆల్ఫా నుంచి వున్న రక్షణ తగ్గిపోయేలా జెనెటిక్ ఇంజనీరింగ్ చేసి డెల్టా ను తయారు చేసి వదిలారు . ఇక దానికి కోరలు , విషం , కాళ్ళు పెట్టలేరు . ఇక ఆ సీక్వెల్ ముగిసింది . మరో సరికొత్త వైరస్ ను తయారుచేస్తే కానీ గడ్డురోజులు రావు . అలాంటి స్థితి వస్తుందని అప్పుడు “చూసావా ! మూడో వేవ్ వస్తుందని నేను చెప్పాను! “ అని పైశాచిక ఆనందంతో యెగిరి గెంతులు వేయొచ్చని మెడికల్ మాఫియా , శాడిస్ట్ లు చూస్తున్నారు . వారిని అలా వదిలేద్దాము ప్రస్తుతానికి !

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…
  • పాపం ఉండవల్లి, ఎంత లాజిక్స్ మాట్లాడేవాడు, ఎలా అయిపోయాడు..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions