Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అభిమానం వెర్రితలలు..! గాయని చిత్ర భుజానికి గాయం..!

June 27, 2025 by Rishi

.

అభిమానం హద్దులు దాటిపోతోంది! అడ్డుకుంటే పొగరు అంటారు! అడ్డుకోకపోతే చెలరేగిపోతారు! అభిమానం వెర్రి తలలుగా మారిపోతోంది! ఇటీవల గాయని కె.యస్. చిత్రకు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఫోటోలు దిగుతూ వెనక్కి నెట్టేయడంతో ఆమె కిందపడటంతో భుజానికి గాయమైంది!

చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఈ ఘటన జరిగింది. ఆమె భర్తతో కలసి హైదరాబాద్ రావడానికి చెన్నై ఎయిర్ పోర్ట్ లో వున్నప్పుడు ఇలా జరిగిందని ఆమె చెప్పారు. చేతికి కట్టు కట్టుకుని నిన్న మలయాళం స్టార్ సింగర్స్ 10వ సీజన్ షో లో పాల్గొన్నారు.

Ads

ఈ చేదు అనుభవం గురించి చిత్ర తన సహజ ధోరణిలో నవ్వుతూనే చెప్పారు. ఆమె చెన్నై ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకుని భర్త కోసం ఎదురు చూస్తుండగా, అభిమానులు గుర్తించి ఫోటోలు మొదలుపెట్టారు!

అలా అభిమానులు గుమికూడారు! ఆమె వెనుక సెక్యూరిటీ ట్రే వుంది! అది చూసుకోలేదట! అభిమానుల తాకిడి ఎక్కువవడంతో ఆమె వెనక్కి జరుగుతూ ట్రే ఫై కాలు వేయడంతో, దాన్ని తప్పించుకోబోయి బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోయారట!

హైదరాబాద్ వచ్చాక ఆసుపత్రికి వెళితే, భుజం ఎముక కాస్త కిందకు జరిగిందని సంబంధిత పరీక్షలు చేసి వైద్యులు నిర్ధారించారు. సరి చేసి మూడు వారాలు విశ్రాంతి తీసుకోమని, మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు చిత్ర వివరించారు.

అభిమానం ఉండాలి కానీ, మరీ సెలబ్రిటీ లను ఇబ్బంది పెట్టే విధంగా మారకూడదు! అభిమానం ఉండాలి! గుండెల్లో పెట్టుకోవాలి! కానీ, ఎదురుగా కనిపించగానే ఎగిరెగిరి పడకూడదు! [ – డా. మహ్మద్ రఫీ ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కొత్త TRS vs కొత్త TRS -! పిల్ల పుట్టకముందే కుల్ల కుడితే ఇలాగే మరి!!
  • హేమిటో మరి… ఆ కురురాజ్య చక్రవర్తికీ ఇన్ని నగలు తొడగలేదేమో…
  • ఆదానీ పరుగుకు కేరళ కొత్త సీఎం బ్రేకులు! కాంగ్రెస్ మార్క్ ‘అడ్డు పుల్లలు’!
  • మీ ఇంట్లో ఓవెన్ ఉందా… అనడిగింది ఆమె ఆ బ్యాంకు మేనేజర్‌ను!
  • ‘పతివ్రత’ ఓ రేంజులో అదరగొట్టింది- అకస్మాత్తుగా మాయమైంది
  • పోడు వేధింపులకు తెర! ఆదివాసీల మెప్పు పొందిన రేవంత్!
  • రావు బహదూర్‌పై కంప్లీట్ డిఫరెంట్ రివ్యూ! 3.5 గంటల Psychological Trauma…!
  • ALPHA – ఆ పాత్రకు ఆలియా అస్సలు నప్పలేదు – అదే మేజర్ మైనస్!!
  • ఒక చిరంజీవి – ఒక ప్రభాస్ – ఒక పవన్ కల్యాణ్ … ఒక మాధవీలత!!
  • ‘‘తింటే తిన్నారు – ఏ గుడిలో దొంగలు లేరు – ఇవన్నీ దొంగ ఏడుపులు సర్’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions