Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వామ్మో… అయోధ్యపై టెర్రర్ ప్లాన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?!

January 22, 2024 by M S R

పార్థసారథి పోట్లూరి……. పెద్ద ప్రమాదం తప్పింది! ఇప్పుడు అంటే జనవరి 22… అయోధ్య లో శ్రీ రామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న సంగతి తెలిసిందే! అయితే అయోధ్యలో 22న విధ్వంసం సృష్టించేందుకు గత 3 నెలల నుండి వివిధ రకాల ప్రయత్నాలు జరగడం, వాటిని సమర్థవంతంగా ముందుగానే పసిగట్టి నిరోధించడంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులతో పాటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సఫలం అయ్యారు.

ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ – ATS మరోసారి తమ సత్తా చాటింది. ముగ్గురు ముష్కరులను శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది! ముగ్గురు ఎవరు?

శంకర్ లాల్, అజిత్ కుమార్, ప్రదీప్ పూనియ… వీళ్లలో శంకర్ లాల్ రాజస్థాన్ లో రౌడీ షీటర్, గ్యాంగులు మెయింటైన్ చేయడమే కాదు రాజస్థాన్ లో ఉన్న ఇతర గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయి. అయితే శంకర్ లాల్ రాజస్థాన్ కే పరిమితం అవలేదు. కెనడాలో ఉన్న గ్యాంగులతో పరిచయాలు ఉన్నాయి.

Ads

************************

ఖలిస్తాన్ – శంకర్ లాల్!

కెనడాలో ఉన్న గ్యాంగులతో ఉన్న పరిచయాల మూలంగా కెనడాలో ఉన్న ఖలిస్తాన్ టెర్రర్ గ్రూపుల కంట్లో పడ్డాడు శంకర్ లాల్! ఖలిస్థాన్ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ కెనడా అమెరికాల మధ్య తిరుగుతూ ఉంటాడు. అయితే రామవిగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగబోతున్న రోజున అయోధ్యలో ఏదన్నా విధ్వంసం సృష్టించేందుకు ఆలోచన చేశాడు. దీని కోసం కెనడాలోనే ఉంటున్న ఖలిస్తాన్ మద్దతుదారుడు హర్మీందర్ అలియాస్ లండాను కలిసి మనకి సహకరించే వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో ఎవరన్నా ఉన్నారా అని అడిగాడు. హార్మీందర్ అలియాస్ లండా రాజస్థాన్ లో శంకర్ లాల్ గురుంచి చెప్పాడు. గురుపత్వంత్ అడిగినంత డబ్బు ఇద్దాము మనకి పనిచేస్తారేమో అడగమన్నాడు. శంకర్ లాల్ ఒప్పుకున్నాడు.

************************

గురుపత్వంత్ తనకి ఏం పని కావాలో హర్మీందర్ చేత ఆడిగించాడు శంకర్ లాల్ ని. అయోధ్య నగరం క్షుణ్ణంగా పరిశీలించి రిపోర్టు ఇవ్వాలి,

అయోధ్య నగరం మ్యాప్ సేకరించి ఇవ్వాలి. ఎక్కడ విద్రోహ చర్యలకు వీలుగా ఉంటుందో మ్యాపులో మార్కింగ్ చేయాలి. ఒక వేళ దొరికితే మా పేర్లు చెప్పకూడదు. మరి ఎలా దొరికారు?

చాలాకాలం నుండి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూపుల మీద నిఘా పెడుతూ వస్తున్నది RAW. అయోధ్య ప్రాణ ప్రతిష్ట విషయంలో పాకిస్థాన్ ISI ఊరికే చూస్తూ ఉంటుంది అని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుకోవట్లేదు కాబట్టి నిఘా పెట్టారు. రాజస్థాన్ నుండి శంకర్ లాల్ మాయం అవగానే ఎలర్ట్ అయిపోయారు రాజస్థాన్ పోలీసులు. RAW నుండి వచ్చిన ఇన్పుట్ సీరియస్ గా తీసుకుని వేట మొదలు పెట్టారు. స్కార్పియో వాహనానికి కాషాయ జెండాలు కట్టి వాహనం వెనక ముందు ఆంజనేయ స్వామి స్టిక్కర్స్ అంటించి రెక్కీ నిర్వహించినట్లు తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ ATS పోలీసులు చివరికి స్కార్పియో వాహనాన్ని అడ్డగించి ముగ్గురినీ అరెస్టు చేసి విచారిస్తే విషయం బయటపడ్డది!

************************

ఇది పెద్ద వార్త కాకపోవచ్చు! కానీ నిందితులు ముగ్గురూ హర్మీందర్ మరియు గురుపత్వంత్ పేర్లు న్యాయమూర్తి ముందు చెపితే అది అమెరికన్ FBI మరియు CIA లకి చుక్కలు కనపడతాయి! ఇది పెద్ద వార్త! అసలేమైంది అంటే…

గత డిసెంబర్ నెలలో గురుపత్వంత్ ను హత్య చేయడానికి RAW నిఖిల్ గుప్తాకి నిధులు సమకూర్చింది అంటూ జో బిడెన్ ఆరోపించాడు. దీనికి కెనడా ప్రధాని ట్రాడూ వంత పాడారు. ఇంతకీ గురుపత్వంత్ ఎవరు? గురుపత్వంత్ కి అమెరికా, కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. నిఖిల్ గుప్తా ఎవరు?

నిఖిల్ గుప్తాకి కూడా అమెరికన్, కెనడా పౌరసత్వాలు ఉన్నాయి. గురుపత్వంత్ కెనడా, అమెరికాలలో స్వేచ్చగా తిరుగుతూ పాకిస్థాన్ ISI తో కలిసి భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. అలాంటి వాడికి అమెరికన్, కెనడాలు రెండూ పొరసత్వం ఎందుకు ఇచ్చాయి?

నిఖిల్ గుప్తా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేస్తుంటాడు. భారతీయుడు అయిన నిఖిల్ గుప్తాకి, అందులోనూ డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తికి పౌరసత్వం ఎందుకు ఇచ్చాయి రెండు దేశాలు?

**********************

జో బైడన్, ట్రాడో లు RAW ను టార్గెట్ చేస్తూ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఎందుకంటే RAW ప్రధాని మోడీ పర్యవేక్షణలో పనిచేస్తుంది కాబట్టి.

గురుపత్వంత్ ను హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి RAW కాంట్రాక్ట్ ఇచ్చింది అని అమెరికా, కెనడాలు ఆరోపించాయి అంటే పరోక్షంగా భారత్ ను టార్గెట్ చేస్తూ చేసిన ఆరోపణ.

నిజానికి జో బిడెన్ కి, జస్టిన్ ట్రాడు కి మోడీజీ మూడో సారి అధికారంలోకి రావడం ఇష్టం లేదు. మరో వైపు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కొరకరాని కొయ్య అయ్యారు పశ్చిమ దేశాల కి. ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని విస్తరించి మన దేశంలో విధ్వంసం సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మోడీ ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడమే కాదు ప్రమాదకరంగా మారుతున్న నిజ్జర్ ను కెనడా లోనే మట్టుబెట్టింది RAW.

RAW ఆపరేషన్స్ అమెరికా, కెనడా, బ్రిటన్ లలో విజయవంతంగా అమలు చేస్తున్న ప్రయత్నాలను ఎలాగయినా ఆపాలని ప్రయత్నిస్తున్నాయి అమెరికా, కెనడా, బ్రిటన్ లు. గురుపత్వంత్ ఖలిస్థాన్ విషయంలో అమెరికాకి, కెనడాకు చాలా ముఖ్యుడు. అయితే RAW మాత్రం CIA వేలితో CIA కన్ను పొడిచే ప్రయత్నం చేసింది.

నిఖిల్ గుప్తాకి RAW కాంట్రాక్ట్ ఇచ్చింది అని అమెరికా కెనడాలు ఆరోపించడంలో నిజమెంతో అబద్ధమెంతో ఎవరూ నిర్ధారించలేరు కానీ విషయాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నాయి అమెరికా, కెనడా దేశాలు. జో బైడెన్ ఆరోపణ చేయగానే నిజ నిర్ధారణ కోసం CIA  కానీ FBI కానీ భారత్ కి వచ్చి విచారించుకోవచ్చు అని మోడీ కోరడమే తరువాయి బిడెన్ FBI DIRECTOR ను పంపించాడు.

*********************,*

ఇది హై లైట్! 

క్రిస్టోఫర్ రే… FBI డైరెక్టర్ (Christopher Wray) డిసెంబర్ 11, 12 తేదీలలో భారత్ వచ్చి NSA అజిత్ దోవల్ తో సమావేశం అయ్యాడు. గురుపత్వంత్ ని హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి RAW కాంట్రాక్ట్ ఇచ్చింది అనే ఆరోపణలకు ఆధారాలు చూపించమని అజిత్ దోవల్ అడిగారు. అయితే నిఖిల్ గుప్తాని అమెరికా రప్పించి విచారిస్తేనే కానీ ఆధారాలు చూపించలేమని క్రిస్టోఫర్ బదులిచ్చాడు.

క్రిస్టోఫర్: మీరు గురుపత్వంత్ సింగ్ పన్నును హత్య చేయడానికి నిఖిల్ గుప్తాకి కాంట్రాక్ట్ ఇచ్చింది నిజం కాదా?

అజిత్ దోవల్: గురుపత్వంత్ సింగ్ CIA ASSET (CIA ఏజెంట్) అని మాకు తెలుసు. అతను మీ దేశంలో ఉన్నా, కెనడాలో ఉన్నా CIA రక్షణలో ఉంటాడు అని మాకు తెలిసీ అతన్ని చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాము?

క్రిస్టోఫర్: తెల్లమొహం వేశాడు. అజిత్ దోవల్ గారి నుండి ఇలాంటి సమాధానం వస్తుంది అని ఊహించలేదు.

అజిత్ దోవల్: నిఖిల్ గుప్తాకి అమెరికా పౌరసత్వం ఇచ్చి, అతను డ్రగ్ మాఫియా డాన్ అని తెలిసీ CIA కి పని చేసేట్లు కాంట్రాక్టు ఇచ్చారు కదా? మరి ఇద్దరూ CIA కి పని చేస్తున్నారు కాదా? మరి CIA ఏజెంట్లు ఒకరిని ఇంకొకరు చంపుతారా?

క్రిస్టోఫర్ మొహంలో నెత్తురు చుక్క లేదు. నిశ్శబ్దం.

అజిత్ దోవల్: మీ అధ్యక్షుడు మా మీద ఆరోపణ చేసిన సమయంలో నిఖిల్ గుప్తా CIA ఆపరేషన్ కోసం చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నది నిజం కాదా?

క్రిస్టోఫర్ నిశ్శబ్దం. RAW లేదా అజిత్ దోవల్ దగ్గర ఇంత ఖచ్చితమైన సమాచారం ఉందా? ఇది క్రిస్టోఫర్ మౌనానికి అర్థం.

*********************

జో బిదేన్ ఎప్పుడయితే నిఖిల్ గుప్తా పేరు బయటపెట్టాడో అప్పుడు నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్ దేశంలో ఉన్నాడు CIA పని మీద. తనని CIA ఇరికించబోతున్నది అని గ్రహించి చెక్ రిపబ్లిక్ దేశంలోని కోర్టులో పిటిషన్ వేశాడు తనని అమెరికాకి అప్పగించవద్దని. దాంతో కోర్టు తీర్పు వచ్చే వరకు నిఖిల్ గుప్తాని అమెరికాకి అప్పచెప్పవద్దని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

నిన్న అంటే 21-01-2024 న నిఖిల్ గుప్తాను అమెరికాకి అప్పచెప్పవచ్చు అని తీర్పు వెలువరించింది. మూడు రోజుల ముందు ఉత్తర ప్రదేశ్ ATS శంకర్ లాల్ గాంగును అరెస్ట్ చేసింది. విచారణలో గురుపత్వంత్ సింగ్, హర్మీందర్ సింగ్ పేర్లు బయట పడ్డాయి. నిఖిల్ గుప్తాను రేపు అమెరికాకి తీసుకెళ్ళి విచారిస్తారు, దానికి కౌంటర్ గా శంకర్ లాల్ న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇస్తాడు. ఎలా ఉంది ఆట?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions