Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అఖండ తమనుడు ఎందుకు హఠాత్తుగా భుజాలు తడుముకున్నట్టు..?!

December 31, 2021 by M S R

ఓ సమయం వస్తుంది… అన్ని వివాదాలు ఒక్కసారిగా చుట్టుముడతయ్… ఎవరుపడితే వాళ్లు రాళ్లేస్తరు… వెక్కిరిస్తరు… దుర్దినాలు… నాని అనుభవిస్తున్నది అదేనేమో… లేకపోతే కాపీ ట్యూన్ల సంగీత దర్శకుడు అని పేరుగాంచిన తమన్ కూడా నానికి నీతులు చెబుతున్నాడు ట్విట్టర్‌లో… విషయం ఏమిటంటే..? నాని ఏపీలో సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయం చెప్పాడు… పవన్ గొంతెత్తినప్పుడే అండగా నిలిస్తే బాగుండేదన్నాడు… థియేటర్లను కిరాణాకొట్లతో పోల్చాడు… దాంతో సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది… వైసీపీ కస్సుమంది… రోజా సహా పలువురు దులిపేశారు…

దీనికితోడు శ్యామ్ సింగరాయ్ బడ్జెట్ పెరిగి, బిజినెస్ సరిగ్గా జరక్కపోవడంతో కొన్నిచోట్ల నిర్మాతలే రిలీజ్ చేసుకున్నారు… నాని తన 8 కోట్ల పారితోషికంలో 5 కోట్లు వాపస్ ఇచ్చేశాడని ఓ వార్త… నిర్మాతల మండలి కూడా ‘వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలను’ పరిగణనలోకి తీసుకోవాల్సిన పనిలేదంటూ పరోక్షంగా నానికి చురక పెట్టింది… ఎవరుపడితేవాళ్లు మాట్లాడవద్దనే ఓ హెచ్చరిక దాగుంది అందులో… ఇండస్ట్రీ పెద్దలు కొందరికి కూడా నచ్చలేదు… ఈ సిట్యుయేషన్‌లో నాని శ్యామ్ సింగరాయ్ సినిమాకు సంబంధించి ఏదో ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘‘సినిమా అంటే అన్నిరకాల వృత్తి నిపుణుల సంయుక్త కృషి, సినిమాలో ఏదీ మరోదాన్ని డామినేట్ చేయకూడదు’’ అని ఏదో చెప్పుకొచ్చాడు… ఒకసారి దిగువ ట్వీట్‌లో తన అభిప్రాయాలు, దానిపై తమన్ రియాక్షన్ చూడండి…

https://twitter.com/PushpaRamAA/status/1476224139048341505

Ads

నిజానికి నాని అన్నదాంట్లో తప్పేమీ లేదు… సినిమాను సంగీతమో, పాటలో, సినిమాటోగ్రఫీయో ఏదో ఒకటి డామినేట్ చేయకూడదు, అన్నీ సమపాళ్లలో కుదరాలి అనేది సరైన అభిప్రాయమే… పైగా తను పర్టిక్యులర్‌గా ఎవరినీ ప్రస్తావించలేదు, పరోక్షంగా కూడా ఎవరినీ టార్గెట్ చేయలేదు… కానీ తమన్‌ ఎందుకో భుజాలు తడుముకున్నాడు… తనకు మాత్రమే అర్థమయ్యే తన ఇంగ్లిషులో నాని అభిప్రాయాలకు కౌంటర్ వేసే ప్రయత్నం చేశాడు, పైగా Lol అంటూ వెక్కిరింపు నవ్వు ఐకన్ ఒకటి జోడించాడు…

We call it a Complete FILM when all the crafts Together Excel in all formats 🥁It’s never so called Dominated Crafts .. lol

it’s the Deeper UNDERSTANDING of a Film Knowing it’s depth in dialogues it’s Narration & making It dive in Smooth to the Next Sequences 🎥🎵🥁

1/2

— thaman S (@MusicThaman) December 29, 2021

ఈ వరుస ట్వీట్లు తమన్ ఓవరాక్షన్ ప్లస్ రీసెంట్ హిట్స్‌తో కాస్త ‘బరువు’ పెరిగినట్టుగా అనిపిస్తున్నయ్… నాని మాట్లాడింది శ్యామ్ సింగరాయ్ అనే సినిమాకు సంబంధించిన ఇంటర్వ్యూలో ఏదో ఓ కాంటెక్స్ట్‌లో వ్యక్తం చేసిన అభిప్రాయం, పైగా ఆ సినిమాకు తమన్‌కు సంబంధం లేదు, దానికి మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు… మరి తమన్‌కు ఎందుకు ఉలికిపాటు..?

So Without a Great Visualisation Great Making Great characterisations Well Written Scripts With True Emotions Narrated in a Proper Pace Directed Magnanimously & Standout Performances from the Artists

It’s Never One Man Show ✊

We love CINEMA & WE DIE FOR IT ❤️‍🩹

God bless

— thaman S (@MusicThaman) December 29, 2021

అఖండ సినిమాలో తమన్ ఇచ్చిన బీజీఎం మీద విమర్శలున్నయ్… పలుచోట్ల అది సీన్లను డామినేట్ చేసిందనీ, కథకు అవసరమైనదానికన్నా బీభత్సాన్ని క్రియేట్ చేసిందనీ ఆ విమర్శల సారాంశం… దీంతో నాని తాజా వ్యాఖ్యలు తనను ఉద్దేశించి చేసినవే అని తమన్ భావించినట్టున్నాడు… మంచి విజువలైజేషన్, మంచి స్క్రిప్టు, మంచి మేకింగ్, మంచి కేరక్టరైజేషన్, సరైన కథనం, ఆర్టిస్టుల మెరిట్ అన్నీ కలిస్తే సినిమా, అంతేతప్ప వన్ మ్యాన్ షో కాదు అంటూ ఏవేవో ట్వీట్లు రాస్తూపోయాడు… మరి నాని చెప్పింది కూడా అదే కదా…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions