మరిచిపోయారా..? మొన్నమొన్ననే కదా, భక్తిపరురాలైన మంగ్లీ బోనాల పాట మీద రచ్చ రచ్చ చేశారు కదా… అమ్మవారిని మోతువరి అని తిడతావా అంటూ మీరే మంగ్లీని బోలెడంత తిట్టిపోస్తిరి… పాపం, ఆమె ఈ కృత్రిమ మనోభావాలకూ తలొంచి, పాట మార్చింది… వందల పాటలు రాసిన ఆ రచయితను అడిగి వేరే పదాలు పెట్టించి, రీఅప్‌లోడ్ చేయించింది… దాన్నీ వదల్లేదు… చివరకు పాటనే తీసేశారు… తెలంగాణతనాన్ని ఓన్ చేసుకున్న ఒక బంజారా గాయనిని డీమోరల్ చేసేదాకా ఊరుకోలేదు… సరే, దాన్నలా వదిలేద్దాం… మరి ఈ పాట సంగతేమిటి..? ది గ్రేట్ కాపీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన నిర్వాకం మీద ఎవరూ మాట్లాడరేం..? మంగ్లీ కాబట్టి అల్కగ దొరికిందా..,? థమన్ బరువైన భారీ దర్శకుడు కాబట్టి భయమవుతుందా..? పైగా అనంత శ్రీరామ్ రాశాడట… నాగశౌర్య హీరో అట… రీతూవర్మ హీరోయిన్ అట… పాడింది సూపర్ సింగర్ శ్రేయోఘోషాల్ అట… సినిమా పేరు వరుడు కావలెను అట… హహహ…. ఒక సాంగ్ విడుదల చేయడానికి కూడా ప్రొమో అట… అది రిలీజ్ చేశారు… చూస్తే చివుక్కుమనేలా ఉంది…
చూడబోతే ఐటమ్ సాంగ్‌లా ధ్వనిస్తున్నది… దిగు దిగు నాగా, దివ్యాసుందర నాగో నాగా… ఇదే పల్లవి… రీతూవర్మ, డాన్సర్లు డాన్స్ పేరిట ఏవో పిచ్చి గెంతులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నది… ఆ మ్యూజిక్ ట్యూన్ కూడా ఊరమాస్ అనబడే ఏదో ఐటమ్ సాంగ్‌లాగే వినిపిస్తున్నది… కానీ ఇదేం పల్లవి..? థమన్‌కు కాపీ కొట్టడం తప్ప ఇంకేమీ తెలియదు అని ఇండస్ట్రీ అంతా తెలిసిందే… కానీ చివరకు భక్తి పాటలను కూడా… హిందూభక్తగణం నాగరాజును కీర్తిస్తూ పాడుకునే కోలాటం తరహా పాపులర్ సాంగ్ పల్లవిని, ట్యూన్‌ను కూడా కాపీ చేయాలా..? కాపీ చేస్తే చేశాడు, మరీ ఓ బూతు తరహా పాటకు పెట్టాలా..? ఆ పల్లవి మీద ఈ చిల్లర, వెకిలి స్టెప్పులు వేయించాలా..? ఇన్నేళ్లుగా ఈ పాటను పాడుకునే మహిళల మనస్సులు ఈ డర్టీ కాపీ చూసి గాయపడితే, వాటిని మనోభావాలు అనకూడదా..? మీకు ఉదాహరణ కావాలా..? 2016లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఆ సాంగ్ చూడండి… వీడియో ఏమీ ఉండదు, జస్ట్ లిరిక్, బ్యాక్ గ్రౌండ్‌లో శ్రావ్యంగా పాట… 40 లక్షల వ్యూస్… అంటే ఎంత పాపులరో అర్థమైందిగా… దీనికి అయ్యప్ప స్తుతిని కూడా కలిపి పాడుతూ ఉంటారు… ఆ వీడియోలూ యూట్యూబ్‌లో ఉన్నయ్…
Ads
ఒరిజినల్ లిరిక్ మొత్తం కావాలంటే… ఇదుగో…
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
—-
ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసన తొ నాగన్న
కోలాట మాడి పోరా నాగన్న ||
—-
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
—–
భామా లంత చేరి నాగన్న
బావీ నీళ్ళ కెళితే నాగన్న
బావిలొ వున్నావ నాగన్న
బాలా నాగు వయ్యో నాగన్న ||
—-
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
—–
పిల్లాలంత చేరి నాగన్న
పుల్లాలేర బోతె నాగన్న
పుల్లలొ వున్నావ నాగన్న
పిల్లా నాగు వయ్యో నాగన్న ||
—–
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
——
స్వామూలంత చేరి నాగన్న
రేవు నీళ్ళ కెళితే నాగన్న
రేవులొ వున్నావ నాగన్న
బాలా నాగు వయ్యో నాగన్న ||
—–
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
—–
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండలో వున్నావ నాగన్న
కోడె నాగు వయ్యో నాగన్న ||
——
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ||
లవ్ స్టోరీ సినిమా కోసం నీ కుడి భుజం మీద కడవా అనే ఓ పాత జానపద పల్లవిని సుద్దాల కాపీ చేస్తే… రచ్చ రచ్చ చేశారుగా… (పాపం, అదీ మంగ్లీ పాడిన పాటే…) పాటంతా వేరు, కేవలం పల్లవి మాత్రమే సుద్దాల కాపీ చేసింది… ఐనా అంత కథ చేశారు… మరి ‘‘ఈ దిగు దిగు నాగ’’ ఎపిసోడ్ మరీ నీచం కదా… ఓ భక్తి పాట పల్లవిని ఓ బూతు పాట పల్లవిగా మార్చేయడం… ఒరిజినల్ పాట రచయిత ఎవరో యూట్యూబ్ వీడియోల్లో తెలియడం లేదు… ఆగస్టు నాలుగున పాట రిలీజ్ చేస్తే గానీ… థమన్ ఇంకెన్ని వేషాలు వేశాడో, అనంత శ్రీరాముడు ఎన్ని కథలు పడ్డాడో, శ్రేయోఘోషాల్ తెలుగు పదాల్ని ఇంకెంత ఖూనీ చేసిందో, రీతూవర్మ మాస్ పేరిట ఎన్ని హొయలు పోయిందో తెలియదు…!! చివరగా……. పాత శోభన్‌బాబు సినిమాలో వానపాటల ఐటం హీరోయిన్ వాణివిశ్వనాథ్ పాట, బెండు అప్పారావు అనే చిల్లర నరేష్ సినిమాలో కూడా ఈ పల్లవిని వెగటుగా వాడుకున్నారు…. థమన్ కొత్తగా చేసిందేముంది అనేవాళ్లూ ఉన్నారు…. అవి మరింత నీచం అనేదే ఇక్కడ సమాధానం…!!!
Share this Article