ఉషా ఉతుప్… ఆమెను చూస్తుంటే భలే అనిపిస్తుంది… నొసటన తిలకం స్థానంలో బంగారంతో కూడిన ఓ ఆర్టిఫిసియల్ తిలకం, పైన పాపిట కూడా ఓ చిన్న పాపిటబిళ్ల… బంగారు ఫ్రేమ్ కళ్లజోడు… చెవులకు వేలాడే పెద్ద రింగులు… దానిపైన చిన్న దుద్దులు… బొటనవేళ్లు మినహా అన్ని వేళ్లకూ ఉంగరాలు… బంగారు గాజులు… మెడలో మూణ్నాలుగు రకాల గొలుసులు, నదురుగా కనిపించే ముక్కుపుడక… మొత్తానికి నడిచొచ్చే నగల దుకాణం ఆమె… బప్పీలహరిని చూస్తే అలాగే అనిపించేది…
ఆమె గొంతు కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది… ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… పెద్దగా తెలుగు షోలకు రాదు… ఎవరూ పిలవరు… తెలుగు ఇండియన్ ఐడల్ షోకు గెస్ట్ జడ్జిగా వచ్చింది… పాటల గురించి తెలిసిన చాలా సీనియర్ కాబట్టి సహజంగానే ఆమె అభిప్రాయాలకు కాస్త విలువ ఉంటుంది కదా… తోటి జడ్జిలు కూడా విలువ ఇస్తారు కదా… ఎట్ లీస్ట్ అలా అనుకుంటాం కదా… కాదు, కాదు… నెవ్వర్… థమన్ దగ్గర అవేమీ చెల్లవు… ఈ షోలో నేనే చీఫ్ జస్టిస్ అన్నట్టుగా… ఉషా ఉతుప్ మొహం మీద ఈడ్చి కొట్టినట్టుగా అనిపించింది ఓ సందర్భంలో… ఉషా ఉతుప్ మొహం మాడిపోయింది…
కావచ్చు, సహజంగానే ఓటీటీలు, టీవీల ప్రోమోలు బాగా మిస్‌లీడ్ చేసేవిగా ఉంటయ్… ఈ తాజా ప్రోమో కూడా అలాంటిదే కావచ్చుగాక… కానీ చూస్తుంటే ఇంట్రస్టింగుగా అనిపించింది… విషయం ఏమిటంటే… రాబోయే ఎపిసోడ్ షూటింగ్ అయిపోయింది… బాలయ్యతో కూడా ఓ ఎపిసోడ్ చేస్తున్నారు… అదీ షూటింగ్ అయిపోయింది… అన్‌స్టాపబుల్ టాప్ 6 పేరుతో ఎపిసోడ్ అది… బాలయ్య డాన్సు గట్రా హంగామా చేస్తారు కదా సహజంగానే… బాలయ్య పాటలతో అదిరిపోయి ఉంటుంది… నిజానికి ఈ షో ప్రొడ్యూసర్స్‌తో బాలయ్యకు బాగా సత్సంబంధాలున్నట్టున్నయ్… అప్పట్లో కంటెస్టెంట్లకు ఏదో పండుగపూట స్వీట్లు కూడా పంపించాడు… థమన్‌తో బాలయ్యకు ఎలాగూ గుడ్ రిలేషన్స్ ఉన్నయ్… అలాగే ఆహాలో గతంలో అన్‌స్టాపబుల్ టాకింగ్ షో చేశాడు కూడా… అందుకని ఇప్పుడూ వచ్చాడు…
Ads
ఈసారి ఓ ప్రయోగం చేశారు… బాగున్నట్టనిపించింది… మొన్న కామాక్షి అనే వయోలిన్ ప్లేయర్‌కు గిఫ్ట్ ఇచ్చి అభినందించారు కదా… ఈసారి ఒక్కొక్క సింగర్‌కు ఆర్కెస్ట్రాలోని ఒక్కో ఇన్‌స్ట్రుమెంట్‌తో, ఆ ప్లేయర్లతో పోటీ పెట్టారు… బాగుంది… వైష్ణవికి వయోలిన్‌తో… ప్రణతికి ఫ్లూటుతో… జయంత్‌కు గిటార్‌తో… వాగ్దేవికి కీటార్‌తో పోటీ… (హిందీ ఇండియన్ ఐడల్‌లో కూడా మన షణ్ముఖప్రియ ఓ ఎపిసోడ్‌లో కీటార్‌తో బలంగా ఢీకొట్టిన తీరు రక్తికట్టించింది…)
వాగ్దేవి పాట అయ్యాక ఉషా ఉతుప్ ‘‘నీ గొంతు బాగుంది’’ అంటూనే… తనకు పెద్దగా నచ్చలేదన్నట్టుగా కామెంట్స్ పాస్ చేసింది… గెస్ట్ జడ్జిలు పెద్దగా హార్ష్ కామెంట్స్ చేయరు… ఇండియన్ ఐడల్‌లో అస్సలు చేయరు… కంటెస్టెంట్లను డిస్కరేజ్ చేసే కామెంట్స్ వద్దని ముందే చెబుతారు… ఉషా ఉతుప్ వ్యాఖ్యలతో థమన్ ఆశ్చర్యపోయాడు… ఎందుకంటే… వాగ్దేవి టాప్ కంటెండర్… బాగా పాడింది కూడా… వెంటనే థమన్ అందుకుని వాగ్దేవి పాటను ఫుల్లు మెచ్చుకున్నాడు… సీరియస్‌గా మొహం పెట్టేసి, చేతులు అదోరకంగా పెట్టేసి, ఉషా ఉతుప్ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా… కౌంటర్ అన్నట్టుగా… ఎహె, నీ కామెంట్స్ ఎవడిక్కావాలి అన్నట్టుగా… దాంతో ఆమె మొహం మాడిపోయింది… ఓ గెస్ట్ జడ్జిని అలా కించపరచవచ్చా అనకండి… అది ఆమె అభిప్రాయం… దానికి పూర్తి భిన్నంగా థమన్ అభిప్రాయం… తప్పేముంది..? ఎటొచ్చీ… ఇది నిజంగానే జరిగిందా, ప్రోమో పైత్యమా అనేది సందేహం..!!
Share this Article