.
Maddock Horror Comedy Universe (MHCU) లోని సినిమాలు … స్త్రీ, భేదియా, ముంజ్య, స్త్రీ2… ఇప్పుడు థామా…
Ads
సూపర్ నేచురల్ వరల్డ్ సినిమాలు… సరే, మన భాషలోకి వద్దాం… చందమామ మార్క్ జానపద కథలు… హారర్, కామెడీ, థ్రిల్ జానర్ అన్నమాట… భేతాళులు, విపరీత శక్తులు, వేరే జాతులు అనేసరికి ఇక లాజిక్కులు ఏమీ ఉండవు కదా… కేవలం మ్యాజిక్కు ఉందా లేదానేదే ముఖ్యం…
ఈమధ్య బాలీవుడ్‌లో ఇవే ఎక్కువ నడుస్తున్నాయి… చివరకు సౌత్ నుంచి డబ్ అవుతున్న ఇలాంటి కథలే హిందీ బెల్టులో పాపులర్ అవుతున్నాయి… మరి థామా కూడా హిట్టేనా..?
నేషనల్ క్రష్… వరుసగా బంపర్ హిట్లు కొడుతూ, వేల కోట్ల వసూళ్ల రాణిగా వెలుగుతున్న మన రష్మిక మంధానా ఇందులో ముఖ్యపాత్ర కాబట్టి తెలుగు వాళ్లకూ కాస్త ఆసక్తి ఇప్పుడు దీనిపై… ఆమెతోపాటు ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖి, పరేష్ రావల్, వరుణ్ ధావన్ ఎట్సెట్రా ఇతర తారాగణం…
కథ పెద్దగా ఇంట్రస్టింగు అనిపించదు… ఏదో పిల్లలు చదివే జానపద కథ… ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్ అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఒక అసైన్‌మెంట్‌పై తన సహోద్యోగులతో కలిసి అడవికి వెళ్తాడు… అతడిపై ఒక ఎలుగుబంటి దాడి చేస్తుంది.., కానీ తాడక (రష్మిక) అనే ఓ భేతాళిని (భేతాళ జాతికి చెందిన మహిళ) అతడిని రక్షించడానికి వస్తుంది…
లవ్ ఎట్ ఫస్ట్ సైట్… ఇది జాత్యంతర ప్రేమలో పడిపోతాడు అతను… రష్మిక భేతాళ జాతికీ ఓ కథ ఉంటుంది… మనుషుల రక్తం తాగే ఈ జాతికి విశేష శక్తులూ ఉంటాయి… ఓ గుహలో ఆ జాతి నాయకుడు యక్షాసన్ (థామా) ఓ తప్పు కారణంగా శిక్షను అనుభవిస్తూ ఉంటాడు… తమ లోకంలోకి వచ్చాడు కాబట్టి హీరోను ఆ జాతి శిక్షించే ప్రయత్నం చేస్తే… ఆ యక్షాసన్‌కు ఆహారంగా గుహలోకి పంపిస్తే… ఇక ఈ జాత్యంతర జంట తప్పించుకుని, ఆ అడవి వదిలి జనజీవన స్రవంతిలో వస్తుంది…
తరువాత ఏమయిందనేది కథ… ఇద్దరి నడుమ ప్రేమ పుట్టుక రొటీన్‌గా ఉంటుంది… అక్కడక్కడా కాసిన్ని నవ్వులు… కాస్త యాక్షన్… హీరో కూడా దేవీ అనుగ్రహంతో థామాగా మారడం, యక్షాసన్‌తో పోరుకు సిద్దమవడం అలా అలా కథ సాగిపోతూ ఉంటుంది…
నిజానికి సినిమాలో హారర్ పెద్దగా ఏమీ లేదు… ప్రేమ కథకే ప్రయారిటీ ఇచ్చారు… కాకపోతే ఈ సినిమాలో రష్మిక బాగా చేసింది… ఓ పిశాచి పాత్రను మెప్పించడం అంత సులభం కాదు… తేడా వస్తే నవ్వులపాలు అవుతుంది… కానీ రష్మిక తన అనుభవాన్ని రంగరించింది… గ్లామర్ సరేసరి… బాలీవుడ్‌లో కొన్నాళ్లు ఆమెకు తిరుగులేదు… విజయ్ దేవరకొండ స్వేచ్ఛను ఇస్తే..!
నిజానికి ఈ టీమ్ గత చిత్రాలతో పోలిస్తే ఈ థామా అంత ఆసక్తికరం అనిపించదు… హై ఇవ్వడంలో ఫెయిల్యూర్ ఉంది… అన్నింటికీ మించి… హిందీ వాళ్లే కాదు, సౌత్ వాళ్లు కూడా తెలుగులోకి డబ్ చేసినప్పుడు నిర్లక్ష్యాన్ని కనబరుస్తున్నారు… ఇక్కడా అంతే…
ఓ కృతకమైన తెలుగు వినిపిస్తూ చిరాకు పుట్టిస్తుంది… హిందీ వోకే అనుకున్నవాళ్లు హిందీలో చూడటమే బెటర్… వందల కోట్లు ఖర్చు పెడుతూ తెలుగీకరణలో ఫ్లాప్ అవుతున్నారు నిర్మాతలు… దీనికితోడు హడావుడి క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుంది… వీఎఫ్ఎక్స్ వోకే… బీజీఎం జస్ట్ వోకే… వెరసి సినిమా మరీ అంత ‘హై’ కాదు, తీసిపారేసే ‘లో’ కూడా కాదు… మన రష్మికే సినిమాకు బలం, ప్రాణం..!!
Share this Article