Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సంద్రంలో చైతూ పాత్రలాగే దారితప్పిన తండేల్ దర్శకుడు..!!

February 7, 2025 by M S R

.

నిజానికి నాగ చైతన్యకు ఈరోజుకూ ఇదీ తన సినిమా అని గొప్పగా చెప్పుకునే కెరీర్ లేదు… కానీ కాస్త కథ మారింది… తనలోని నటుడిని తండేల్ సినిమా దర్శకుడు చందు మొండేటి బయటికి తీశాడు… చైతూ మారాడు…

తన నటన మెరుగుపడింది… తండేల్ పాత్రకు తగినట్టు నటించాడు… ఎమోషన్స్ కనిపిస్తున్నాయి మొహంలో… పర్లేదు, బండి గాడిన పడినట్టే అనిపిస్తోంది… సాయిపల్లవి సాధారణంగా ఏ హీరో పక్కన ఉన్నా డామినేట్ చేస్తుంటుంది కదా… ఈ సినిమాలో చైతూ ఆమెతో పోటీపడలేదు గానీ, తక్కువ చేయలేదు…

Ads

ఆమెకు ఈ పాత్ర చాలెంజ్ ఏమీ కాదు, అలా అలవోకగా నీళ్లు తాగినంత ఈజీగా చేసేసింది… తన ప్రధాన బలాల్లో డాన్స్ కూడా ఒకటి కదా… ఈ సినిమాలో ఆమెకు కంపోజ్ చేసిన స్టెప్పులు కొత్తగా, పెద్ద ఇంప్రెసివ్‌గా ఏమీ లేవు… జస్ట్, వోకే… ఆమె పాత్ర ఫస్టాఫ్‌లో ఎంత బలంగా ఆవిష్కరించబడిందో సెకండాఫ్‌లో నీరుగార్చేశాడు దర్శకుడు…

ఐనా సరే, ఈ సినిమాకు బలం ఆ ఇద్దరి నటనే… మంచి కెమిస్ట్రీ… సినిమా ఫస్టాఫ్‌లో ఆ జంట ప్రేమబంధాన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు… దీనికితోడు దేవిశ్రీప్రసాద్ సంగీతం, పాటలు కూడా తోడయ్యాయి… దాదాపు అన్ని పాటలూ హిట్టే… (నమో నమఃశివాయ ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉండాల్సిందేమో… ఐనా వెగటు స్టెప్పులకు ప్రసిద్ధుడు శేఖర్ మాస్టర్ ఇలాంటి పాటల్లో మాత్రం ఫ్లాప్)…

అమరన్ సినిమాలో హీరో మరణించే ఆ కీలకమైన ఆపరేషన్‌కన్నా భార్యాభర్తల ప్రేమ, బంధాన్ని ప్రజెంట్ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చినట్టుగా… (సాయిపల్లవి కోసం..?) ఈ తండేల్ కూడా అంతే… సంద్రంలో దారితప్పి, పాకిస్థాన్‌కు చిక్కి, అవస్థలు పడి, తిరిగి ఊరికి, ఇంటికి ఎలా వచ్చాడనే కథకన్నా చైతూ, సాయిపల్లవి బంధాన్ని బలంగా ప్రజెంట్ చేయడానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు…

ఐనా పర్లేదు గానీ… సెకండాఫ్‌లో కథ ఎటెటో వెళ్లిపోతుంది… కథ డీవియేషన్… ఆర్టికల్ 370, భారత -పాకిస్థాన్ సంబంధాల దాకా… ప్రేమ, అనురాగం ఎంత చక్కగా, చిక్కగా ప్రజెంట్ చేయగలిగాడో దర్శకుడు సెకండాఫ్ దేశభక్తి అంశాన్ని నెత్తికి ఎత్తుకునీ, ప్రేక్షకులను గట్టిగా కనెక్ట్ చేయగల సీన్స్ విషయంలో తేలిపోయినట్టు అనిపించింది…

నిజానికి ఇది ఒరిజినల్ కథే… కానీ బాగా క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నారు… సహజమే కానీ… దేశభక్తి కంటెంట్ ప్రేక్షకులకు ఎక్కించడం ఓ డిఫరెంట్ టాస్క్… అక్కడ దర్శకుడు తడబడ్డాడు… సెకండాఫ్ ల్యాగ్ కాస్త… జైలు అధికారులతో ఘర్షణ వంటివి పెద్దగా పండలేదు అనిపించింది… సెకండాఫ్‌లో సాయిపల్లవి పెయిన్ ప్రేక్షకుడిని కనెక్ట్ కాదు… అదే అమరన్‌లో సాయిపల్లవి పాత్రతో, వేదనతో ప్రేక్షకుడు కనెక్టవుతాడు… బట్ ఓవరాల్‌గా తండేల్ అంటే…

చైతూ నటనపరంగా, తన ఇమేజీపరంగా ఓ మెట్టు ఎక్కినట్టే… సాయిపల్లవి గురించి చెప్పడానికి ప్రత్యేకంగా ఏముంటుంది..? ఈ ఇద్దరి జంట సినిమాకు బలం… మరో ప్లస్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ బీజీఎం ప్లస్ పాటలు… (ఏ పుష్పరాజో తన సినిమా బీజీఎం నుంచి డీఎస్పీని తొలగించి, అవమానించి, కొత్తవాళ్లను అర్థంతరంగా పెట్టుకున్నా సరే, ఈరోజుకూ డీఎస్పీ నంబర్ వన్‌గా ఉన్నాడో చెప్పడానికి ఈ సినిమా కూడా ఓ తాజా ఉదాహరణే…) ప్రత్యేకించి బుజ్జితల్లీ పాట సూపర్ హిట్… సినిమాటోగ్రఫీ మరో ప్లస్ పాయింట్…

ఆ పిల్లాడి బూతుల పిచ్చి సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రన్ ముగింపుకొస్తోంది… గేమ్ ఛేంజర్ ఎప్పుడో ఔట్… డాకూ మహారాజ్ ఔట్… అజిత్ పట్టుదల పేలవం… ప్రస్తుతం మార్కెట్‌లో సరైన తెలుగు సినిమా లేదు… కొన్ని మైనస్సులు, హై అంచనాల ఆశాభంగాలు ఉన్నా సరే, ఫ్యామిలీతో వెళ్లాలని అనుకుంటే ఈ తండేల్ మంచి చాయిస్… (ముందస్తు ఎక్స్‌పెక్టేషన్స్ పెద్దగా పెట్టుకోకుండా వెళ్తే…)

సో, కమర్షియల్‌గా హిట్ కావడం ఖాయమే… కాకపోతే ఇంకాస్త బాగా తీసి ఉండొచ్చు కదా ఈ దర్శకుడు అనే చిన్న అసంతృప్తి… అంతే… (యూఎస్ ప్రీమియర్ల ఫీడ్ బ్యాక్)… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రమ్యకృష్ణ నిజమే చెప్పింది…. మళ్లీ లైంగిక దోపిడీ వార్తల్లోకి వచ్చింది…
  • ఆ అద్భుత ఆధ్యాత్మిక యాత్ర మళ్లీ ఆరంభం అవుతోంది..!
  • తెలియదు… నంబాల మరణంతో నా మనస్సు ఎందుకు చివుక్కుమంది..!
  • డ్రాగన్ రాజు కావచ్చు…. కానీ జామపండు రారాజు… ఆరోగ్య చక్రవర్తి…
  • వై నాట్..? జూనియర్ ఎన్టీఆర్ భిన్న పాత్రల్ని ఎందుకు చేయకూడదు…?!
  • ‘ఇంకేదో కావాలనే’ మోజు, ఆకర్షణల ముందు పాతివ్రత్యాలు బలాదూర్…
  • ఒక తమిళ కణ్ణదాసన్…. ఒక తెలుగు వేటూరి… వేరే పోల్చలేను సారీ…
  • ఇడ్లీ నూడుల్స్ కాదు… అసలు ఇడ్లీ రకమే కాదు…. పక్కా ఇడియప్పం…
  • ఎక్కడిదో ఈ దుఃఖ మేఘం, ఆగకుండా వెక్కి వెక్కి కురుస్తోంది… కానీ..?
  • పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions