‘‘గతంలో కాస్త సిన్సియర్ రివ్యూలు పెట్టే కొన్ని సైట్లు కూడా పర్లేదు అనేసరికి… నమ్మి మోసపోయి… థాంక్యూ బ్రదర్ అనే సినిమా చూడటం స్టార్ట్ చేశా… కాసేపటికే అర్థమైంది… వాళ్లు కూడా యాడ్స్‌తో మేనేజ్ చేయబడుతూ, డప్పు రివ్యూలు రాస్తున్నారు అని… మరీ ఈ సినిమా షార్ట్ ఫిలిమ్‌కు కాస్త ఎక్కువ సినిమా మాత్రమే అని… నిజానికి షార్ట్ ఫిలిమ్స్ కొందరు బాగా తీస్తున్నారు… మరీ ఇది ఏ కోవలోకీ రాదు… ఓటీటీ అంటే దొరికిన స్క్రాప్ అంతా నింపేసే వేదిక కాదు అనే నిజం ఆ అల్లు అరవింద్‌కు జన్మలో అర్థం కాదేమో…’’ ఓ మిత్రుడు కోపంగా పెట్టిన మెసేజ్… చూద్దామా, వద్దా అనే డైలమాలో పడి, కాసేపటికి చూడటం స్టార్ట్ చేసి, ఆ మిత్రుడి అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించేశా… ఇది ‘థాంక్యూ బ్రదర్’ అనే తాజా మినీ సినిమా గురించి…
టిఫిన్, మీల్స్ వేర్వేరు కదా… ఫుల్ మీల్స్ కాదు, ప్లేట్ మీల్స్ కూడా ఎక్కువే అనుకుని లిమిటెడ్‌గా తినేవాళ్లకు మినీమీల్స్ అని దొరుకుతాయి హోటళ్లలో… అంటే టిఫిన్‌కు కాస్త ఎక్కువ, మీల్స్‌కు కాస్త తక్కువ అన్నట్టుగా… సినిమాల్లోనూ షార్ట్ ఫిలిమ్స్, రెగ్యులర్ ఫిలిమ్స్ అని రెండు రకాలు… మధ్యరకం ఈమధ్య కనిపిస్తోంది… వర్మ అలవాటు చేశాడు… మరీ అరగంట కాదు… అలాగని రెండున్నర గంటల సినిమా కాదు… గంటాగంటన్నర… మంచిదే, కానీ ఆ సమయంలో చెప్పాల్సిన కథను క్రిస్ప్‌గా చెబితే… ఇదీ గంటన్నర సినిమాయే… కానీ అది చూశాక… హమ్మయ్య, దీన్ని రెగ్యులర్ సినిమాగా రుద్దనందుకు థాంక్స్ బ్రదర్ అని చెప్పాలనిపించింది దర్శకుడికి…
Ads
రెండేళ్ల క్రితం వచ్చిన ఓ నైజీరియన్ సినిమా పేరు ఎలివేటర్ బేబీ… అనుకోకుండా ఓ లిఫ్టులో చిక్కుబడి, పురుటినొప్పులు స్టార్టయిన ఓ మహిళకు అదే లిఫ్టులో ఉన్న ఓ అపరిచితుడు సాయం చేసి, ప్రసవం చేస్తాడు… ఈ సీన్లు పండాలంటే నటీనటుల మొహాల్లో ఎమోషన్స్ బాగా పలకాలి… సరైన బీజీఎం పడాలి… ఎడిటింగ్ బాగుండాలి… నిజానికి ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చాయి… త్రీ ఇడియెట్స్లోనూ ఓ ప్రసవసాయం సీన్ ఉంటుంది… అదిరిపోయింది… సరే, ఈ సినిమాకు వద్దాం… ఆ ఎలివేటర్ బేబీ సినిమాను చూసి ఈ కథ రాసుకున్నాడు అని స్ట్రెయిట్‌గా చెప్పలేం… కానీ అదే మెయిన్ ప్లాట్ ఈ సినిమాలోనూ… మరెందుకు ఇలా తయారైంది..?
ఓటీటీకి అమ్ముకోవడానికి అనసూయ సెల్లింగ్ పాయింట్ అనుకున్నట్టున్నాడు నిర్మాత… అలాగే వర్కవుట్ అయింది, అల్లు అరవింద్‌కు ముడిపెట్టి చేతులు దులిపేసుకున్నాడు… కానీ నిజానికి అనసూయ సరైన సెల్లింగ్ పాయింట్ కానే కాదు… ఆమె మొహంలో ఏ ఎమోషన్సూ సరిగ్గా పలకవు… అంతెందుకు ఐటం సాంగ్ చేస్తే, ఆ ఫీల్ కూడా ఆమె మొహంలో కనిపించదు… ఇక లేబర్ పెయిన్స్, ఇతరత్రా ఎమోషన్స్ ఏం ఆశించగలం..? సరే, కథయినా సరిగ్గా రాసుకున్నారా అంటే… హీరో కేరక్టరైజేషన్ మరీ తెలుగు టీవీ సీరియల్ మగ పాత్రల కేరక్టరైజేషన్కన్నా నాసిరకం… అనసూయ కథా అంతే… పోనీ, రాసుకున్న కథనైనా సరిగ్గా ప్రజెంట్ చేశారా అంటే అదీ లేదు… వెరసి తలనొప్పి… ఓటీటీ కాబట్టి చకచకా జంపులు చేస్తూ, ఆ గంటన్నరనూ ఇరవై నిమిషాల్లో కష్టమ్మీద చూసి, క్లోజ్ చేసి, తేలికగా ఊపిరి పీల్చుకున్నాక గానీ అర్థం కాలేదు… ఇందులో అర్చన అనంత్ కూడా ఉంది కదాని…. అంత అనామకంగా ఉంది ఆమె పాత్ర… కార్తీకదీపం అనబడే బంపర్ హిట్ సీరియల్లో సౌందర్య అనబడే ప్రధానమైన అత్త పాత్ర ఆమెది… కేరాఫ్ అనసూయ అనే సీరియల్‌ను ఒంటి చేత్తో మోస్తోంది… పాపం, ఈ సినిమా చూస్తే ఆమె మీద జాలేసింది… ఇంకా చెప్పడానికి ఏమీ లేదు… సెలవు… అసలే రోజులు బాగాలేవు, రిస్క్ వద్దు బ్రదర్స్ అండ్ సిస్టర్స్…
Share this Article