Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డ్రగ్స్ మత్తు దిగింది సరే… ఆ ‘థార్ పోరగాళ్ల’ డబ్బు బలుపు దిగేదెలా..?

May 24, 2026 by M S R

.

ఏముంది సింపుల్… ఓ పోరీ, ఇద్దరు పోరగాళ్ల పంచాయితీ… ఈ దరిద్రులకు తోడుగా చెత్త గ్యాంగులు… డబ్బు బలుపు… తద్వారా డ్రగ్స్… ధనికులు, ఉన్నతాధికారులు, నాయకులు… డబ్బు చేసిన ప్రతి ఒక్కడి కొడుకూ ఇదే కోవ కదా… ఏం తప్పు జరిగితే పోలీసులు, న్యాయం తమ కాళ్ల దగ్గరకు వస్తుందనే బలుపు… ఒక్కొక్కడి బలుపుకు తగినట్టే తల్లిదండ్రుల మదం కూడా…

అవును, విజయవాడలో అత్యంత ఖరీదైన థార్ కార్లను ఢీకొడుతూ, అద్దాలు పగులగొడుతూ, రాడ్లతో దాడులు చేసుకున్న ఇద్దరు వెధవల (ఇక్కడ మీకిష్టమైన పదం పెట్టుకోవచ్చు) వీరంగం వీడియోలు చూశాం కదా… ఒక్క యువతి విషయమై మనస్పర్థల కారణంగా ఒకరంటే మరొకరు పగ పెంచుకుని.. చంపుకొనే వరకు వెళ్లారు…

Ads

తీరా ఏమైంది..? తాగిందో, డ్రగ్స్ తీసుకున్నదో మత్తు దిగింది… గురువారం రాత్రి హైటెన్షన్ రోడ్డులో భీకరంగా తమ వాహనాలతో ఢీకొట్టుకున్న ఓం, రోహిత్ సాయిలు ఒక్కటయ్యారట… పోలీసుస్టేషన్, కోర్టులో పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకున్నారట…. ఇగోలకు పోయి.. ఇరుక్కుపోయాం.. అనవసరంగా బద్నాం అయ్యామని వారు పశ్చాత్తాపడ్డారట… పరస్పరం మాట్లాడుకున్నారట… మనస్పర్థలను సరిదిద్దుకుంటే సరిపోయేదని ఇద్దరూ అభిప్రాయపడ్డారట…. నిజానికి గొడవల కారణంగా వీరు గత నాలుగు నెలలుగా సరిగా మాట్లాడుకోవడం లేదట కూడా…

ఇప్పుడు ఎందుకు దిగొచ్చారు..? డబ్బు, డ్రగ్స్ బలుపు, మత్తుతో వీరంగం వేశాక… కేసులు పెడ్డాక ఇప్పుడు తత్వం బోధపడింది… అఫ్‌కోర్స్, రిమాండ్‌కు పంపించకుండా పాపం వాళ్ల లాయర్లు వాళ్ల వృత్తికోణంలో మస్తు కష్టపడ్డారు… అయ్యోపాపం, స్టూడెంట్స్, మానసికంగా దిగజారిపోతారు, భవిష్యత్తుపై ముద్రలు పడతాయి అని హ్యూమన్ యాంగిల్‌లో తెగవాదించేశారట, తీసుకున్న ఫీజుకు న్యాయం చేయాలి కదా…

కానీ వాళ్లు విద్యార్థులు, శుద్ధపూసలు అనేసరికి న్యాయాధికారే విభ్రాంతికి గురయ్యాడట… ఎహెపో, వాళ్లను చూస్తే అలా లేరు, రిమాండ్ పంపించేయండి అని ఆర్డరేశారట… గుడ్…

విశాఖలో బీబీఏ పూర్తిచేసిన బొల్లా ఓం… తండ్రికి చెందిన జేజే ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థ వ్యవహారాలను చూస్తున్నాడు… వాడు విద్యార్థి అట… నోట్లో వేలు పెడితే కొరకలేని పిల్లతనం అట… లింగమనేని రోహిత్పాయి… తాడేపల్లిలో బీబీఏ మొదటి ఏడాది చదువుతున్నాడు… అతని తండ్రికి ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ఉంది… ఎవ్వడూ తక్కువ కాదు…

ఘటన జరిగిన రోజు ఇద్దరి వాహనాల్లో వారి స్నేహితులు ఉన్నారు… ఓం… తన వాహనంలో మోహిత్, సిద్ధార్థను ఎక్కించుకుని హెచ్లో లైన్ రోడ్డులోకి వచ్చాడు… రోహిత్సాయి కూడా…. తన స్నేహితుడైన మహ్మద్ అఫాన్ను తీసుకెళ్లాడు… విచిత్రం ఏమిటంటే…? పరస్పరం తెగ ఢీకొట్టుకున్న ఘటనలో స్నేహితుల ప్రమేయం లేదని విచారణలో పోలీసులు నిర్ధరించుకున్నారట…. ఈ నేపథ్యంలో వీరిని సాక్షులుగా చూపించారట…

పోలీసులు నిందితుల రక్తనమూనాలను పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి పంపించారు… వీరు డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాలను తీసుకున్నారా? లేదా అనేది కచ్చితత్వంతో తెలుసుకునే వీలుంది… శుక్రవారం ర్యాపిడ్ పరీక్షల్లో ఓమ్ కు పాజిటివ్ రాగా, రోహిత్సాయికి నెగెటివ్ వచ్చింది… తుది పరీక్షల ఫలితాలు వచ్చాక… డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే… ఎన్డీపీఎస్ సెక్షన్ను కూడా చేర్చనున్నారు… నిందితుడు ఓం ఇంట్లో నిర్వహించిన సోదాల్లో చాలారకాల గోళీలు గట్రా దొరికాయిట కూడా…

రాడ్లు, స్టిక్లతో బయలుదేరి… ఒకరినొకరు చంపుకునేందుకే వెళ్లినట్లు ఇద్దరూ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లలో వెల్లడించారు… రోహితు‌ను చంపేందుకు ఓం వాహనంలో రాడ్‌తో వెళ్లాడు… తొలుత.. జీప్తో ఢీకొట్టి చంపాలనీ, అప్పటికీ చావకపోతే రాడ్తో కొట్టాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో చెప్పాడు… ఓమ్‌ను చంపేందుకు రాడ్ తో పాటు బేస్ బాల్ స్టిక్ ను కూడా తీసుకెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో రోహిత్ వెల్లడించాడు…

ఇద్దరినీ బజారులో బహిరంగంగా కోటింగ్ ఇస్తూ తీసుకెళ్తే… ఇంకాస్త కఠినంగా వెళ్లినా సరే పోలీసులకు పేరొచ్చేది… కానీ కూటమి ప్రభుత్వం కదా… అంత సీన్ లేదు… అఫ్‌కోర్స్, జగన్ ప్రభుత్వమున్నా తేడా ఏమీ ఉండదు… ఎందుకంటే, అది బలిసినవాళ్ల రాజ్యం..!!

ప్రపంచంలోని ప్రతి విశేషానికీ స్పందించే మహేంద్ర ఆనంద్ (థార్ కార్ల తయారీ ఓనర్) ఏమైనా స్పందించాడా..? భలేవారే… అలా స్పందిస్తే తను వ్యాపారి ఎలా అవుతాడు..?

ఇంతకీ ఆ యువతి ఎవరు..? ట్రయాంగిల్ లవ్‌లో ఉన్న ఆమె ఓ కారులో అక్కడే ఉందట… ఎవడు బతికితే వాడే నావాడుఅనుకుందా..? వామ్మో… ఎలా తయారవుతున్నార్రా పిల్లలు..? ఒరేయ్, ఆమె మైనరో, మేజరో ఓసారి చూసుకొండిరా… ఎందుకైనా మంచిది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమిత్ షా పర్యటనలు రెండుసార్లు రద్దు! ఏదో అడ్డుపడుతోంది, ఏమిటది?!
  • ప్యారడైజ్ … సినిమా కాదు, బిర్యానీ కాదు… ఓ సినిమా టాకీసు !!
  • సింగీతం అంటే ఓ పేరు కాదు… తెలుగు సినిమా ప్రయోగాల జాబితా !!
  • Fly dubai – ఎన్నెన్నో కుట్ర కథనాల వ్యాప్తి ! అసలు నిజాలు ఇవీ !!
  • శాస్త్రంతోపాటే విశ్వాసం! అంతరిక్షమైనా.. ఆకాశమైనా.. భగవన్నామ స్మరణే!
  • ఈ ఉగ్ర పైలట్‌ను ఫ్లయ్ దుబాయ్ ఎందుకు నియమించింది?!
  • ఈ పార్వతి పాట… ఇప్పుడు ప్రపంచ చార్ట్‌లో నంబర్ 2 పాట !
  • విక్స్ ! దీని పుట్టుక వెనుక ఓ తండ్రి వేదన- పరిశోధన !!
  • అనగనగా ఓ దొరైస్వామి అనబడు ఓ పాత నటుడి కథ !!
  • కన్నడనాట హిట్టే- తెలుగు వెర్షన్ సో సో… కారణాలు అనేకం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions