Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నాటి ఈటీవీ ఇంటర్వ్యూ ఒకటి ఎన్టీయార్ జీవితాన్నే మార్చేసింది.. !!

January 18, 2023 by M S R

Murali Buddha……… ఎన్టీఆర్ వర్ధంతి రోజున ఆయన్ని అంతులేని భక్తితో స్మరించుకొంటోంది ఈటివి– ఈటివిలో ఎన్టీఆర్ సినిమాలు వేస్తూ, నిమిషానికి ఓసారి భక్తితో స్మరించుకొంటోంది అని ప్రకటన… ఎన్టీఆర్‌ను గద్దె దించడంలో కీలక పాత్ర వహించి … గద్దె దించేంత వరకు నిద్రపోని ఈనాడులో భక్తితో స్మరించుకుంటున్నాం అనే ప్రకటన చూశాక …. జీవితంలో ఏదైనా సాధ్యమే అనిపిస్తోంది …

అప్పట్లో ఈటివిలో ఆంధ్రావని వార్తలు వచ్చేవి… ఈ రోజు వార్తలు మరుసటి రోజు సింగ పూర్ నుంచి ప్రసారం అయ్యేవి. లక్ష్మి పార్వతి కారణం వల్లే ఎన్టీఆర్‌ను దించాల్సి వచ్చిందని చంద్రబాబు బ్యాచ్ చెబితే…. తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్టు పార్వతి ప్రకటన…. బాబు వర్గం నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది ….

ఈటివే ఆ సమయంలో వారిని ఆదుకుంది … రెండు రోజుల ముందు ఈటివికి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రసారం చేశారు … నాకు ఎన్టీఆర్ ముఖ్యం, mla లు పూచిక పుల్లలతో సమానం అని లక్ష్మిపార్వతి ఆ ఇంటర్వ్యూలో చేసిన ప్రకటన … రెండు రోజుల తరువాత ప్రసారమైంది….

Ads

మేం పూచిక పుల్లలం అని చెబుతూ, మళ్ళీ సయోధ్యకు రమ్మనడం ఎందుకంటూ బాబు వర్గం ప్రశ్న… ఈటివిలోని ఈ వార్త ప్రసారంతో పార్వతి రాజకీయాలకు దూరం అనే ఎన్టీఆర్ చివరి ఆయుధం నిర్వీర్యం అయింది … బాబు వర్గాన్ని ఈటివి కడుపులో పెట్టుకొని చూసుకుంది, ఎన్టీఆర్‌ను దించేంత వరకు నిద్ర పోలేదు … అదే ఈటీవి ఇప్పుడు భక్తితో తనను స్మరించుకొంటోంది… అంతా కాల మహిమ… నాటి పాపాన్ని ఇప్పుడు కాస్త కడిగేసుకుంటున్నట్టుగా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!
  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions