ఇక ఈ కేసులతో ఏం ప్రయోజనం..? భారత క్రికెట్ గర్వపతాక విరాట్ కోహ్లీ… తన భార్య ఓ పాపులర్ నటి… దేశం నిండుగా ఆశీర్వదించిన జంట… వాళ్ల బిడ్డ ఓ చిన్నారి… అన్నెంపున్నెం ఎరుగని, ముక్కుపచ్చలారని పసిబిడ్డ… ఓ గలీజు గాడు (మొదటిసారి ఇలాంటి పదాలు వాడుతున్నందుకు క్షమించండి…) ఇండియా టీ20 పోటీల్లో ఓడిపోతే భరించలేక ఆ పసిగుడ్డును రేప్ చేస్తానని కూశాడు… ఎంత దారుణం..? ఇలాంటివి ట్విట్టర్, ఫేస్‌బుక్ వేదికల మీద బోలెడు… ఆ నీచ్‌కమీనే సోషల్ ప్లాట్‌ఫారాలకు వాటిని పసిగట్టి వెంటనే బ్లాక్ చేసే యంత్రాంగాలు లేవు… అదేమంటే మీ చట్టాలతో మాకేం పనిరా అని ఉల్టా దబాయిస్తాయి… అవి డేంజరస్ వైరస్… వాటికి ఏ యాంటీ వైరల్ డ్రగ్స్ రాలేదు…
వాడి పేరు రాంనరేష్ ఆకుబత్తిని… దొరికిపోయాడు… కోహ్లి మేనేజర్ పోలీస్ కంప్లయింట్ ఇవ్వగానే వాళ్లు కదిలారు, అప్పటికే తన ఐడెంటిటీ బయటపడకుండా వాడు ఏవో జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ దొరికిపోయాడు… హైదరాబాద్ వచ్చి మరీ తీసుకుపోయారు… తీరా చూస్తే తను ఓ ఐఐటీయన్… ఏదో ఫుడ్ డెలివరీ యాప్ తరఫున పనిచేసేవాడు… ఇప్పుడు ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాడట… తండ్రి సంగారెడ్డి బేస్డ్ ఏదో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీ… అబ్బే, మావాడు అలాంటోడు కాదు, పాక్షికంగా గుడ్డి, చూసుకోలేక అలా తప్పుడు ట్వీట్ వెళ్లిందేమో అని ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించాడు… అబ్బ, నువ్వు ఏం తండ్రివి తండ్రీ… ఓ తమ్ముడు కూడా ఉన్నాడట…
Ads
అసలు పాక్షికంగా గుడ్డి కాదు… మంచీచెడూ తెలియని, రాక్షసత్వం ప్రబలిన గుడ్డోడు… ఇలాంటి ట్రోలర్స్ అందరూ జాతికి చీడపురుగులు… వేటకొడవళ్లు పట్టుకుని, యాసిడ్ సీసాలు జేబుల్లో పెట్టుకుని తిరిగేవాళ్లకు వీళ్లకు తేడా ఏముందసలు..? తను ఐఐటీలో చదివితేనేం..? అసలు మన యూనివర్శిటీలు కాలేజీలు సాంకేతిక విద్యను బుర్రల్లోకి ఎక్కిస్తున్నాయి గానీ, మనిషికి అవసరమైన జ్ఞానాన్ని, సంస్కారాన్ని, నడతను ఏం నేర్పిస్తున్నాయి అసలు..? ఈ 23 ఏళ్ల రాం నగేష్ భిన్నమేమీ కాదు కదా…
కొన్ని సైట్లు రాసిన వార్తలు చదివితే ఆశ్చర్యం వేసింది… వాడు టెన్త్ క్లాస్ టాపర్, బాగా కష్టపడి చదివేవాడు, అర్ధరాత్రి దాకా చదువుకుంటూనే ఉండేవాడు అని… ఎవడికి కావాలి..? ఇప్పుడు నువ్వు ఏమిటి అనేదే కదా అసలు ప్రశ్న… ఈ ట్వీట్ చిక్కులు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని గమనించగానే తన ఒరిజినల్ ఖాతాను డియాక్టివేట్ చేశాడు, మరో రెండు మూడు ఖాతాలు ఉండేవట… వాటిల్లోనూ పోలీసుల్ని మిస్‌లీడ్ చేసే మార్పులు చేశాడు… కానీ మహారాష్ట్ర పోలీసులు అన్నీ పట్టుకున్నారు, తనను కూడా పట్టుకున్నారు… ముంబై పోలీస్ సైబర్ సెల్ చాలా యాక్టివ్‌గా వ్యవహరించింది… ఎఫ్ఐఆర్ నమోదు చేసింది…
తాజా వార్త ఏమిటంటే..? బాంద్రా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు తనకు బెయిల్ ఇచ్చేసింది మొన్న శనివారం… అంటే అంత వేగంగా కదిలిన ముంబై సైబర్ సెల్ తనపై గట్టిగా కేసు పెట్టలేకపోయిందా..? అసలు ఈ ట్రోలర్స్ మీద పెట్టాల్సిన సెక్షన్లలో బలం లేదా..? మరిక వీళ్లకు భయం ఎలా..? అదుపు ఎలా..? కట్టడి ఎలా..? ఎవడుపడితే వాడు ఏమైనా చేయొచ్చా ఆన్‌లైన్‌లో..? కోహ్లీ కూతురు అనే కాదు, ఇది అందరి సమస్య కదా… సో, ఈ ప్రమాదకరమైన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఖచ్చితంగా పగ్గాలు అవసరం… ఏం చేయాలో మన కోర్టులే ఆలోచించాలి…!!
Share this Article