Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జగన్‌ను మెచ్చినా సరే… టీడీపీని ఛీఅన్నా సరే… ఆ మీడియా అస్సలు ఊరుకోదు…

April 11, 2023 by M S R

Adimulam Sekhar………   జస్టిస్ చంద్రు‌ అయినా…డాక్టర్ ప్రభాకర్ రెడ్డి‌ అయినా…ఆ మీడియా తీరు‌‌ అంతే..! కర్నూలు జనరల్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి గుండె జబ్బుల నిపుణులుగా మంచి పేరు వుంది. ఆయన ముఖ్యమంత్రి జగన్ ను పొగుడుతూ సొషల్ మీడియాలో కవిత రాశారంట. చిర్రెక్కిన ఓ పత్రిక ఓ డాక్టర్ స్వామి భక్తి అంటూ మెయున్ పేజీలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఆయనపై వృత్తి పరమైన ఆరోపణలూ చేసింది.

డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తన సేవలతో రోగుల మన్నలు పొందారు. ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటారు. సినిమాలు, రాజకీయాలు, వైద్యం‌ ఇలా అ‌న్ని అంశాలపై స్పందిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయన ఆయనకు చాలామంది అభిమానులు కూడా ఉన్నారు కరోనాకాలంలో ఎందరికో విలువైన వైద్య సలహాలు ఇచ్చారు. కర్నాలులో వున్నా మన ఎదుటే వున్నట్టు భరోసా ఇస్తుంటారు. అలాటి వైద్యుడు తన అభిప్రాయం చెప్పడమే నేరమైనట్టు ఆ పత్రిక కథనం రాసింది. అది జగన్‌ మీద‌ అక్కసుతో‌ రాసిందని‌ ఎవరికైనా అర్థమవుతుంది.

yellow

Ads

కొంతసేపు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి విషయాన్ని పక్కనపెట్టి జస్టిస్ చంద్రు విషయానికొస్తే…. జస్టిస్ చంద్రు కొన్ని నెల క్రితం విజయవాడకి వచ్చారు. ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రతిపక్షాలకంటే కోర్టులతో పోరాడాల్సి వస్తున్నదని వ్యాఖ్యానించారు. అంతే ఒక్కసారిగా పచ్చ మీడియా జస్ట్ చంద్రుపై దాడి మొదలుపెట్టింది. ఆయనకున్న కీర్తిని కూడా పక్కనపెట్టి అవాకులు చవాకులు తేలింది. వేలాది కేసుల్లో తీర్పు చెప్పి జై భీమ్ సినిమాకు స్ఫూర్తి ప్రదాత అయిన జస్ట్ చంద్రు ఘనతను తోసిరాజంటూ ఆయనపైన టీవీలో చర్చలు చేస్తూ విరుచుకుపడింది పచ్చ మీడియా.
doctor

అది జస్ట్ చంద్రు విషయమైనా, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి అంశమైనా బోధపడేది ఒకటే. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ను పొగిడినా లేదా తెలుగుదేశం పార్టీని విమర్శించినా పచ్చ మీడియా ఊరుకోదు. వారు ఎంతటి వారైనా తమదైన పద్ధతిలో దాడికి పూనుకుంటుంది. ఎవరైనా మా జోలికొస్తే ఖబడ్దార్ అని బెదిరిస్తుంది. ఇటువంటి మీడియా రౌడీయిజం.. సోషల్ మీడియా యుగంలో సాగదని ఆ మీడియా ఎప్పుడు గుర్తిస్తుందో..! మొన్న జస్టిస్ చంద్రూకిగానీ నేడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డికి గానీ సోషల్ మీడియామే అండగా నిలబడింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions