విధి… డెస్టినీ… కర్మ… టైమ్… పేరు ఏదైనా సరే, అదే అల్టిమేట్… జీవితం మన చేతుల్లోనే ఉందనేది పాక్షిక సత్యమే… జీవితం ఆల్రెడీ ఎప్పుడో రాయబడి ఉందనేదే డెస్టినీ… అది ప్రజెంట్ డైనమిక్ కాదు, ప్రి-ప్రోగ్రామ్డ్…
ఇది వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కథలు… మతాధిపతులు, మేధావులు, ఫిలాసఫర్లు చెబుతూనే ఉంటారు… అర్థం చేయించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు… సంక్లిష్టమైన వివరణలు కాదు, సరళమైన ఉదాహరణలే ఎక్కువ ప్రభావశీలం…
అలాంటిదే ఇది కూడా… సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది… ఈ కథపై క్రియేటివ్ హక్కులు ఎవరికి ఉన్నాయో తెలియదు కానీ, ధన్యవాదాలు…
Ads
ఇంద్రుడి భార్య ఇంద్రాణి… ఒక చిలుకను పెంచుతూ, దాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది… ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది… ఆమె దిగులుపడి చిలుకను దేవ వైద్యునికి చూపించింది…
ఆ వైద్యుడు పెదవి విరిచాడు… ఇక నీ చిలుక బ్రతకడం కష్టం తల్లీ అని చెప్పాడు… ఆ మాట విన్న ఇంద్రాణి దుఖం ఆపుకుంటూ పరుగుం పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లింది.., “మీరేం చేస్తారో నాకు తెలియదు… నా చిలుకకు బ్రతికించండి… లేదంటే నేనూ చనిపోతాను” అని విలపించింది…
దానికి ఇంద్రుడు… “దీనికే ఇంత ఏడవడం ఎందుకు..!? అందరి తలరాతలు రాసేది ఆ బ్రహ్మే కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను… నువ్వేం దిగులు పడకు… అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు…
ఇంద్రుని ద్వారా విషయం మొత్తం విన్న బ్రహ్మ తాపీగా… “నేను తలరాతలు మాత్రమే రాస్తాను… దాన్ని అమలు పరిచేది మహా విష్ణువు..! మనం విష్ణువు దగ్గరికి వెళదాం పదండి…” అంటూ తనూ బయలుదేరాడు…
వీరి రాక గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు… “నిజమే, ప్రాణాలు కాపాడేవాడిని నేనే…! కానీ చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే ఆ లయకారుడు శివునికే సాధ్యం..! మనం ముగ్గురం శివుని ప్రార్థిద్దాం పదండి… ” అన్నాడు…
అందరూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు… శివుడు ‘‘లయకారుడిని నేనే, ఆయుష్షు పోయగలిగేదీ నేనే, కానీ ప్రాణాలు తీసే పని యమధర్మరాజుకు అప్పజెప్పాను… మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి’’ అని తనూ బయలుదేరాడు…
ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు అందరూ కలిసికట్టుగా యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించాడు… విషయం తెలుసుకున్నాడు…
“అయ్యో.. అదేమీ పెద్ద పనికాదు… మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను, వారు ఎలా చనిపోతారనే వివరాలు ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తాము. ఏ ఆకు రాలి ఎప్పుడు క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు… పదండి, వెళ్లి ఆ ఆకు రాలిపడకుండా ఆపి, చిలుకను కాపాడుదాం..!” అన్నాడు…
యముడు, అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది… ఆ ఆకు ఈ చిలుకదే… అందులో ఏమి రాసి ఉందో చూద్దామని ఆ ఆకును తీసి చదివాడు యముడు… ఆకుపై చిలుక మరణానికి కారణం రాసి ఉంది ఇలా..!
ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక
మరణిస్తుంది అని రాసి ఉంది… అందరూ అలా కలిసికట్టుగా ఒక చిలుక కోసం రావడం అసాధారణం… ఐనా విధి కదా… జరిగింది..!!
Share this Article