.
ఏదో ఫేస్‌బుక్ పేజీలో హఠాత్తుగా నూడుల్స్ ఇడ్లీ అంటూ ఓ రెసిపీ కనిపించి హాశ్చర్యం వేసింది… పోనీ, ఇడ్లీ నూడుల్స్ అని చదివానేమో…. అదొక కొత్తపదం… సదరు రైటర్ క్రియేటివ్‌గా కాయిన్ చేసినట్టున్నారు…
ఇంతకీ ఆ రెసిపీ ఏమిటబ్బా, ఇంత కొత్తగా వినిపిస్తోంది అని చూస్తే… అది ఏదో కాదు, జస్ట్ ఇడియప్పం… దానికే ఇడ్లీ నూడుల్స్ అని పేరు పెట్టారు… నిజానికి అదేమీ కొత్త రెసిపీ కాదు… చాలా చాలా పాత వంటకం…
Ads
మన తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఫాస్ట్ అనగానే దోశలు, పెసరట్లు, ఇడ్లీలు, వడలు ఎట్సెట్రా అలవాటే గానీ ఎందుకో మరి ఈ ఇడియప్పం అనే ఫేమస్. పాపులర్ తమిళ, మలయాళ వంటకం అలవాటు కాలేదు… అఫ్‌కోర్స్ తెలంగాణకు ఆ ఇడ్లీ, దోశలే లేటుగా వచ్చాయనుకోవాలి… అంతకుముందు ఎక్కువగా జొన్న గట్క, రొట్టె, అంబలి….
సరే, ఇడియప్పం కథకొస్తే… ఇదీ ఇడ్లీయే ఒకరకంగా… కాకపోతే ఇడ్లీలను గుండ్రంగా (పొట్టెక్కలు వంటివి వేరు) దాదాపు ఒకే సైజుతో వండుకుంటాం కదా ఆవిరి మీద…. ఈ ఇడియప్పం అంటే ఇడ్లీ కుక్కర్లలోనే నూడుల్స్‌గా వండుకుంటాం, అంతేనా… కాదు, చాలా తేడా ఉంది… అందుకే దీన్ని ఇడ్లీ అనే పేరుతో పిలిస్తే అన్యాయం… (ఇడియప్పంను నూల్ పుట్టు అనీ అంటారు)…
ఇడ్లీకి మినపపప్పు ఎట్సెట్రా ఫర్మెంటేషన్ (పులియడం) వంటి ప్రక్రియ, ప్రయాస ఉంటాయి… కానీ ఇడియప్పం కేవలం వరి పిండితో చేసేది… వినాయకచవితికి ఉండ్రాళ్లు, కుడుములు చేస్తాం కదా, గుర్తుకు తెచ్చుకొండి…
ఇడియప్పం కోసం ముందుగా కాస్త బియ్యపు పిండిని వేడి చేసి పక్కన పెట్టుకొండి… తరువాత నీటిని మరిగించి, అందులో తగినంత ఉప్పు ప్లస్ ఈ బియ్యపు పిండిని కలిపి, కాస్త గట్టిగా ఉండేలా కలుపుకోవాలి… అంటే అట్లు వేసే జారుడు పిండిలా కాదు…
ఆ పిండి ముద్దను మురుకులు ఒత్తే పావు (మురుకు ప్రెస్ మేకర్) లో ఉంచి, నూడుల్స్‌లా ఇడ్లీ పాన్ మీదే ఆ గుంతల్లో ఒత్తుకోవాలి… ఇడ్లీల్లాగే కాసేపటికి ఈ ఇడియప్పం రెడీ… దానికి ఆధరువుల్లా కొబ్బరి పచ్చడి లేదా పలు స్ట్యూస్ చేసుకోవచ్చు…
చాలామంది ఇడియప్పం, తెలంగాణ ప్రాంతంలో చేసుకునే జంతుకాలు సేమ్ అనుకుంటారు… కానీ కాదు… జంతుకాలు కూడా సేమ్ బియ్యపు పిండితోనే చేసినా… పిండి ముద్దలు ముందుగానే ఉండ్రాళ్లు, కుడుముల్లా ఉడికించుకుని, ఆ ముద్దలను మురుకుల పావుల్లో పెట్టి నూడుల్స్‌లా ఒత్తుకోవాలి… దీనికి ప్రత్యేకంగా జంతుకాల పీటలు కూడా ఉంటాయి…
వేసవి రాగానే లేదా కొత్త బియ్యం వచ్చినప్పుడు… అంటే కొత్త ఆవకాయలు, మామిడి పళ్ల సీజన్‌లో… ఈ జంతుకాలు చేసుకోవడవడం కద్దు… ఇంగ్లిషులో జంతుకాలను రైస్ నూడుల్స్ అనొచ్చు, అంతే తప్ప ఇడియప్పంను ఇడ్లీ నూడుల్స్ అనడం మాత్రం నప్పదు..!!
Share this Article