Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…

July 12, 2025 by M S R

 

Bharadwaja Rangavajhala…….  రాజనాల కాళేశ్పర్రావు అని … ఓ భారీ విలనుడు ఉండేవాడు కదా … టాలీవుడ్డులో … ఈ అబ్బాయి గురించి ఓ సారి రావికొండలరావుగారు నాతో చెప్పిన విషయాలు మీకు చెప్తా ….

వీరాభిమన్యు సినిమాలో రావికొండలరావుగారు ద్రోణాచార్యుడి వేషం వేశారు …

Ads

రాజనాల దుర్యోధనుడు వేశారు.

ఓ సన్నివేశంలో గురువు ద్రోణుడి కాళ్లు శిష్యుడు దుర్యోధనుడు కడగాలి …

అప్పుడు రాజనాల నేరుగా రావి కొండలరావుగారి దగ్గరకు వచ్చి …

ఏమయ్యా కొండల్రావూ … చివరకి నీ కాళ్లు కడగాల్సిన పరిస్థితి వచ్చింది అనేశారట.

కొండలరావుగారు ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోయారట.

అసలు ఈ సీనును డూపుతో మేనేజ్ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన యూనిట్ వాళ్లతో చేశారట రాజనాల …

విషయం దర్శకుడు వి. మధుసూదనరావుగారి దగ్గరకు పోయింది.

అదేంటి సీను లో రైటర్ ఏం రాశాడు … కాళ్లు కడిగి ఈ నీరు నెత్తిన జల్లుకోమని కదా …. అలాగే సీను ఉంటుంది.

అందులో ఏ మార్పూ ఉండదు… ఒక వేళ ఆయనకి ఇబ్బంది అయితే …. ఇంకో దుర్యోధనుడ్ని చూసుకుందాం … అనేశారట..

దీంతో … రాజనాలగారు దారిలోకి వచ్చేసి సీను చేసేశారట …

మరి అంతటి రాజనాలగారున్నూ …

తర్వాత రోజుల్లో వేషాలు లేక ఉన్నదంతా అనేక విధాల కరిగిపోగా …

రకరకాల ఇబ్బందులతో … ఉన్న రోజుల్లో …

అదే రావి కొండలరావు గారి దగ్గరకు వచ్చి …

ఏవైనా వేషాలుంటే చెప్పండీ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని గోల చేస్తుంటే …

rajanala

…..

ఓ సినిమాలో ముసలి తల్లిదండ్రుల పాత్రలకు రావికొండలరావుగారినీ , రాధాకుమారిగారినీ బుక్ చేశారట.

రాజనాల బాధ విని .. అందులో ఆ భర్త పాత్ర రాజనాలకు ఇవ్వండని తను ఆ సినిమా నుంచీ తప్పుకున్నారట … కొండల్రావు గారు.

వేషం దొరికిన తర్వాత రాజనాల లోని ఒరిజినల్ బయటకు వచ్చేశాడట పాపం ..

సీన్ ఎలా తీయాలి అని దర్శకుడికి క్లాసు చెప్పడం లాంటి కార్యక్రమాలు మొదలెట్టేశాడట ..

దీంతో ఆ చిత్ర నిర్మాత దర్శకులు కొండలరావుగారికి ఫోన్ చేసి ఏమిటి మాస్టారూ మీరు ఈయన్ని తగిలించారూ అని తలపట్టుకున్నారట…

మీరు మాట్లాడండీ అంటే … అబ్బే ఆయన పెద్ద నటుడు … ఆయనకి నేనెలా చెప్తానూ … ఈ రెండ్రోజులూ అలా భరించేయడమే అన్నారట ఈయన.

ఇలా ఉంటుందయ్యా వరస అని ముగించారు కొండలరావుగారు …

ఆ రాజనాలకు తొలిసారి అవకాశం ఇచ్చిన హెచ్.ఎమ్ .రెడ్డిగారు తీయించిన మేకప్ స్టిల్ … ఇక్కడ తగిలిస్తున్నాను …

rajanala

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీన్ రివర్స్..! ’ఆడబిడ్డ’ అస్త్రం కేటీయార్ మీదే ఉల్టా ఉరుముతోంది..!!
  • రాజకీయ ఎదుగుదలకు ప్రేయసినే తార్చటానికి సిద్ధపడిన ఓ నాయకుడు..!!
  • నేములోనేముంది అనకండి..! ఇప్పుడు నామకరణమూ వ్యాపారమే..!
  • ప్రపంచంలోకెల్లా అందమైన టాప్-11 ఆటగత్తెలు వీళ్లేనట..!!
  • అక్కడ దుమ్ము రేపుతున్న షో… ఇక్కడ దుమ్ము కొట్టుకుపోయింది..!!
  • తొక్కిసలాట విషాదం… ఈ గుడి నిర్మాణం వెనుక ఓ ఇంట్రస్టింగు కథ…
  • ఒక కోట… ఒక బ్రహ్మి… ఎప్పుడు చూసినా నవ్వులు పండించే హిట్ మూవీ….
  • ఒక గొప్ప ఫోటో..! దీని వెనుక ప్రతి లీడర్ తప్పక చదవాల్సిన ఓ కథ..!!
  • నీలిపూల నిద్రగన్నేరు చెట్టు… పరోమా! ఉదాత్తమైన అక్రమ ప్రేమ కథ…
  • గొప్పల తిప్పలు తరువాత… ముందు నీ గోచీ సరిచూసుకోవయ్యా ట్రంపూ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions