ఓ వ్యాన్ వేగంగానే పోతోంది… పెళ్లిచూపులు షూటింగు రోజులు… బ్రేకులు ఫెయిలయ్యాయి… అందులో దర్శకుడు తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ, మరో నటుడు దర్శి ఉన్నారు… మొదట్లో విజయ్ ఆందోళన పడ్డాడు… దర్శి, తరుణ్ కిందామీదా పడుతున్నారు… దర్శి లాగితే హ్యాండ్ బ్రేక్ ఏకంగా చేతిలోకి వచ్చింది… లక్కీగా ఓ చెట్టు దగ్గర ఆగింది… అప్పటి విజయ్ కులాసాగా చూస్తున్నాడు… ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాం అనే ఆనందంకన్నా విజయ్ నిమ్మలంగా ఎందుకున్నాడు అనే క్యురియాసిటీ ఎక్కువైందట తరుణ్‌కు…
ఏందిర భయ్ ఇది అనడిగాడట… ఫస్టుల ఆందోళన అనిపించిందిరా… తరువాత చస్తే అందరమూ కలిసే చస్తాం కదా అనుకుని, బేఫికర్‌గా కూర్చున్నా అన్నాడట విజయ్… ఇది ఎవరో కాదు చెప్పింది తరుణ్ భాస్కరే… ఆలీతో సరదాగా షో తాజా ప్రోమో భలే సరదాగా ఉంది… నిజానికి సినిమా అంటేనే అతి పెద్ద హిపోక్రటిక్ వాతావరణం కదా… గొప్పలు, ఏతులు, పొగడ్తలు, భజనలు, జోకుళ్లు చాలా ఉంటయ్… కానీ కొందరు ఉంటారు… అవన్నీ జాన్తా నై… దిల్ మే క్యా హై, బోల్నా బస్…
తరుణ్‌లో భలే కామెడీ టైమింగు ఉంది… అన్నింటికీ మించి విజయ్, దర్శి తదితరులతో పనిచేసినవాడు కదా… అంతా ఫ్రెండ్స్ టైపు… ఈ సోకాల్డ్ కీర్తనలు బ్యాచ్ కాదు… అవి అసలే వరంగల్, వడ్లకొండ నీళ్లు కదా… దాస్యం ప్రణయభాస్కర్ ఫ్యామిలీ… షార్ట్ ఫిలిమ్స్ తీసేవాడు కాస్తా దర్శకుడు అయిపోయాడు తరుణ్… హిట్… తరువాత సినిమాల్లేవు… ఏవేవో సినిమాల్లో యాక్ట్ చేశాడు… నో రిగ్రెట్స్, లైఫ్ ఎటు తీసుకుపోతే అటు పోతాడు… బాధపడితే వరంగల్‌వాడు ఎలా అవుతాడు…
Ads
అమ్మది తిరుపతి… భార్యది చిత్తూరు… తన తల్లీతండ్రి పెళ్లి దగ్గర నుంచి తను సప్లిమెంటరీ పరీక్షలకు కట్టిన ఫీజుల దాకా చాలా సరదాగా షేర్ చేసుకున్నాడు… వీసమెత్తు హిపోక్రటిక్ వాసన ఉండదు… ఫాఫం, అనిల్ రావిపూడిది కూడా భలే కామెడీ నేచర్… కానీ పెద్ద హీరోలతో, అదీ కాస్త ఇగో ఆవరించి ఉన్న హీరోలతో చేయడం వల్ల తనూ ప్రెస్‌మీట్లలో, ఫంక్షన్లలో తెగ నటించేస్తుంటాడు… తప్పదు…
కాస్త విజయ్ దేవరకొండ సర్కిల్ అంతా ఇలాగే అనిపిస్తారు… బరువైన పదాలు, ఆచితూచి వాడకం, అడ్డగోలు హిపోక్రసీ, పెద్ద బిల్డప్పులు గట్రా ఏమీ కనిపించవు… అలా కాజువల్‌గా నడిచిపోతూ ఉంటుంది… అరె, హీరో అయితే ఏందిర భయ్, మాకేమైనా కొమ్ములున్నయా అనే టైపు… సేమ్, తరుణ్ భాస్కర్ కూడా… నేను కట్టిన సప్లిమెంటరీ ఫీజులతో ఓ బిల్డింగ్ కట్టొచ్చు, మా నాన్న కూడా నటుడే- మా అమ్మ ముందు మస్తు నటిస్తడు, 1000 దాకా సినిమాల్లో యాక్ట్ చేసిన లెజెండ్‌ను సార్ నేను… వంటి సరదా పంచులతో ఇరగ్గొట్టాడు… కంప్లీట్‌గా సగటు సినిమా చాట్‌కు భిన్నం… ఇండస్ట్రీ పెద్ద మాయాలోకం… సక్సెసా, ఫెయిలా జానేదేవ్… తమ ఒరిజినల్ కేరక్టర్‌ను చంపుకోకుండా నేచురాలిటీని, ఒరిజినాలిటీని చంపుకోని వ్యక్తులు అరుదు… అత్యంత అరుదు… అయితే ఇలా ఎన్నాళ్లు ఉంటారు అనేది నన్నడక్కండి… ప్లీజ్…
Share this Article