బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు స్థాయిలో… బిగ్‌బాస్ మోనాల్‌ను ప్రతిసారీ ఎందుకు కాపాడుతూ ఉంటాడు అనే ప్రశ్న కూడా…! నిజానికి బిగ్‌బాస్ షోను చాలామంది ద్వేషిస్తారు కానీ మన తెలుగు టీవీ సీరియళ్లు, మన స్టార్ హీరోల ఫార్ములా ఇమేజ్ సినిమాలకన్నా చాలా బెటర్… ఇది రియాలిటీ షో… కానీ ప్రతిదీ స్క్రిప్టెడ్… మీ ఆట మీరు ఆడుకొండి అని వదిలేయడం ఉండదు… ఎవరెలా ఆడాలో కూడా బిగ్‌బాస్ అనే డెస్టినీ డిసైడ్ చేస్తూ ఉంటుంది… ఆడిస్తూ ఉంటుంది… అదుగో ఆ ఆటలో అందరికన్నా ఫ్లెక్సిబుల్‌గా… బిగ్‌బాస్ చెప్పినట్టు ఆడే బుట్టబొమ్మ మోనాల్… వాస్తవానికి ఓ మట్టిముద్ద… బిగ్‌బాస్ ఆమెను రకరకాల షేడ్స్‌లోకి మలుస్తూ ప్రయోగిస్తూ ఉంటాడు…
ఒక కథ… బిగ్‌బాస్ రాసిన కథే… మలుపులు తన ఇష్టం… ప్రేక్షకులకే పిచ్చి రేపుతుంటాడు తన ట్విస్టులతో… మొదట్లో అఖిల్- అభిజిత్- మోనాల్ నడుమ త్రికోణ ప్రేమ ట్రాకు… టూ మేల్, వన్ ఫిమేల్… ఆమె స్క్రిప్టు ప్రకారం అటూఇటూ ఆడసాగింది… మెల్లిమెల్లిగా అభిజిత్ ఆమె నుంచి దూరం జరిగాడు… ఆమె అఖిల్‌ను అల్లుకుపోయింది.,. ఆ ఇద్దరిదీ ఓ ప్రేమ జంట…
Ads
సీన్ కట్ చేస్తే… అభిజిత్ ఒంటరిగానే దొరికాడు కదా… హారిక వెళ్లి తనను అల్లుకుపోయింది… ఇది వేరే ప్రేమ జంట… సో, రెండు వేర్వేరు జంటలు… కథ సాఫీగా మజా ఏముంది..? సీన్ మారిపోయింది…
అభిజిత్ నాన్న మోనాల్‌ను మెచ్చుకున్నాడు… అభిజిత్ కళ్లు తెరుచుకున్నాయి… మూసేసుకున్న ప్రేమ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి… పైగా మోనాల్ అమ్మ కూడా అభిజిత్‌ను మెచ్చుకుంది… వాళ్లిద్దరి నడుమ ఎండిపోయిన ప్రేమతీగ మళ్లీ చిగురించింది… స్విమ్నింగ్ పూల్ గట్టు మీద కూర్చుని మంగళవారం కొత్త కబుర్లు కలబోసుకున్నారు… ఎలాగూ అఖిల్ ఆమెను చీదరించుకుంటున్నాడు… సో… ఇప్పుడు కథ..? అభిజిత్- హారిక్- మోనాల్… టూ ఫిమేల్, వన్ మేల్… మధ్యలో మోనాల్ అటూ ఇటూ… ఏడుస్తుంది, వెళ్లి హత్తుకుంటుంది… షో రన్ చేస్తూ ఉంటుంది…
అలాగని అఖిల్‌ను మోనాల్ నుంచి పూర్తిగా కట్ చేయడు… అది లైవ్‌గానే ఉంటుంది… ఎప్పటికప్పుడు వారి నడుమ గ్యాప్‌ను ప్యాచప్ చేస్తూ ఉంటాడు… ముందే అనుకున్నాం కదా… ప్రస్తుతం బిగ్‌బాస్ టీం పక్కాగా ఈటీవీ వాళ్ల సీరియళ్ల స్క్రిప్టు టీంలో పనిచేసినదే అయి ఉంటుంది… లేకపోతే కలం ఇన్ని మెలికలు తిరగదు… వాళ్ల దయ, ప్రేక్షకుల ప్రాప్తం… ఇక్కడ చెప్పుకునేది ఒక్కటే… మోనాల్ అనే కేరక్టర్ వాళ్లకు కావాలి… ఆమె ఎటు అంటే అటు మోల్డ్ అయిపోవాలి… ఎమోషన్స్ క్యారీ చేయాలి… ఆమెకు అప్పగించిన పని ఆమె సక్సెస్ ఫుల్‌గా చేస్తోంది… అందుకే ప్రేక్షకులు ఆమెను వోట్ల జాబితాలో చివరలో నిలబెట్టినా సరే, ఆమె సేవ్ అవుతూనే ఉంటుంది… ఇప్పటికీ పది సార్లు నామినేట్ అయినా సరే ఆమె హౌస్ వీడలేదు… అయితే ఇది చాన్నాళ్లు సాగదేమో…
ఫినాలే దగ్గరకు వస్తోంది… పోటీ విపరీతం అవుతుంది… ఈ లవ్ ట్రాకులు కుదరకపోవచ్చు… ఇదే మోనాల్‌ను హఠాత్తుగా కట్ చేసి, హౌస్ బయటికి నిర్దాక్షిణ్యంగా పంపించేయవచ్చు… అవును మరి, ఆమె ఇన్నిరోజులూ ఈ షోలో కొనసాగడమే ఓ విశేషం… వచ్చే ఆదివారం బయటికి వెళ్లాల్సి వచ్చినా హాశ్చర్యం లేదు… ఎలాగూ ఏ కుమారసాయి లేదా నోయెల్ రీఎంట్రీ ఉంటే… కథ ఎలాగూ వేరే ఉండబోతోంది…
Share this Article