ఈ సినిమా జీవులు ఉన్నారు కదా… ఏం చేసినా, ఏ అడుగులు వేసినా వాటి వెనుక ఏదో ప్రమోషనో, పబ్లిసిటీయో, మరో ప్రయోజనమో ఉంటుంది… ఉండాలి… తప్పేమీ లేదు… బిగ్‌బాస్ వీకెండ్ సండే షోకు నాగార్జున కిచ్చా సుదీప్‌ను తీసుకొచ్చాడు… కాసేపే… కానీ కాస్త ఫన్… కాస్త అట్రాక్షన్… కాస్త వెరయిటీ… పైగా కన్నడలో వరుసగా ఏడు సీజన్ల బిగ్‌బాస్‌కు సక్సెస్ఫుల్ హోస్ట్… నాగార్జునకు సీనియర్… మనవాళ్లకూ ఈగ, సైరా, బాహుబలి సినిమాలతో పరిచయం… మంచిదే…
ఇలా తీసుకురావడం వెనుక కూడా కాస్త పబ్లిసిటీ, కాస్త ప్రమోషన్ ఆలోచన ఉందిలే… ఆమధ్య తమిళ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకుపోయి, కమల్‌హాసన్‌తో హాయ్ చెప్పించాడు కదా… అదేతరహాలో కన్నడ బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకుపోతే బాగుండేది కదా అంటారా..? ఇంకా కన్నడలో ఎనిమిదో సీజన్ స్టార్ట్ కాలేదు… పైగా ఇక్కడ నేరుగా వేదిక మీదకు తీసుకురావడం వెనుక ‘ది వరల్డ్ ఆఫ్ ఫాంటమ్’ అనే సుదీప్ కొత్త సినిమా మీద కావాలనే చర్చ జరపడం ఉద్దేశం…
Ads
నువ్వూ మా అఖిలూ కాస్త క్లోజట కదా, మావాడు చెబుతుంటాడు… సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సందర్భంగా మీకు దోస్తీ కుదిరిందట కదా… అని నాగార్జున ముచ్చట్లు స్టార్ట్ చేస్తే…. అవును సార్, మీరు ఇప్పటికీ ఇలా యంగ్‌గా ఉంటే ఇక మీ అఖిల్‌ను ఎవరు చూస్తారు, అదే కంప్లయింట్ అని సుదీప్ కాస్త పొగడ్తల్లో ముంచెత్తాడు… గుడ్… ఫిట్నెస్ విషయంలో నాగార్జునను అందరూ అభినందిస్తారు కూడా… కానీ ఈ సుదీప్ తక్కువోడు ఏమీ కాదు…
దాదాపు 48, 49 ఏళ్లకు వచ్చాడు కదా… ఇదుగో ఈ బాడీ బిల్డింగ్ చూడండి… అదరగొట్టాడు కదా… అదే ఆ ఫాంటమ్ సినిమా క్లైమాక్స్ కోసం తన తపన, కష్టం అది… ఇండియన్ స్వార్జ్‌నెగ్గర్ అనిపిస్తున్నాడు కదా… ఎస్…
Gud food,,, a bit of decent lifestyle,,,n a lil Discipline,, isn't bad after all ye!!.🥂🤗
Started work out again after a long gap. Courtesy: The climax part of #TheWorldOfPhantom ,,wch tired each one on set for almost a month.
Lookn forward to the last schedule.
Startn Dec 4th. pic.twitter.com/Wh80qzyaYF— Kichcha Sudeepa (@KicchaSudeep) November 26, 2020
అనూప్ భండారీ (దర్శకుడు) చెప్పాడు ఈమధ్య… మీ సినిమా అవుట్ పుట్ బాగా వస్తున్నదట కదా… ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటున్నారు, మంచి హైప్ క్రియేట్ అవుతుందట కదా అని నాగ్ అడగడం… ఆ సినిమా కథ, తను ఎందుకు ఒప్పుకున్నాడు వంటి వివరాలు సుదీప్ చెప్పడం… కాకతాళీయం, అనుకోని ప్రస్తావన ఏమీ కాదు… కావాలనే…!
ఆ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు… తెలుగులో కూడా…! త్వరలో సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికానున్నయ్… అదన్నమాట సంగతి… అంతేకాదు, ఆ సినిమా షూటింగు కొద్దిరోజులుగా అదే అన్నపూర్ణ స్టూడియోలో సాగుతోంది… సుదీప్ ఇక్కడే తచ్చాడుతున్నాడు కొన్నాళ్లుగా… కొంత పార్ట్ రామోజీ ఫిలిమ్ సిటీలో తీశారు… ప్రత్యేకంగా సెట్లు వేశారు… అందుకే ఇలా అలవోకగా, అవలీలగా బిగ్‌బాస్ సెట్లోకి తీసుకొచ్చాడు నాగ్… పనిలోపని సుదీప్ సినిమాకు పబ్లిసిటీ, బిగ్‌బాస్ వీకెండ్ షోలో కాస్త ఫన్, అన్నీ అలా కలిసొస్తాయన్నమాట…
Share this Article