.
John Kora …… నన్ను నేను బలవంత పెట్టుకోను… విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్‌పై మొదటి నుంచి క్లారిటీతో ఉన్నాడు.
గౌరవ్ కపూర్ హోస్ట్ చేసిన ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’ అనే షోలో కొన్నాళ్ల క్రితం మాట్లాడుతూ.. తాను క్రికెట్ ఆడటానికి స్పూర్తి గెలుస్తూ ఉండటమే. ఏ రోజైనా ఆటపై ప్యాషన్ పోయింది అని భావిస్తానో ఆ రోజు ఆడటం మానేస్తా. ఆడటానికి నన్ను నేను బలవంతం చేసుకోను. నా శరీరం ఎంత వరకు తీసుకోగలుగుతుందో అంత వరకే నన్ను నేను పరిమితం చేసుకుంటాను.
Ads
ఏదో ఒక రోజు మైదానంలో నిలబడి.. అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాననే ఆలోచన వచ్చినా.. గెలవాలనే తపన, శక్తి లేకపోయినా నేను ఆడలేను. జట్టు కోసం నేను ఏమీ చేయలేని సమయంలో ఇక నేను ఆడటం ఆపేస్తాను.. అని చెప్పుకొచ్చాడు…
నిరుడు ఐపీఎల్ సమయంలో కూడా తన రిటైర్మెంట్ గురించి ఒక మాటన్నాడు.. నా పని నేను పూర్తి చేశాక.. నేను వెళ్లిపోతాను. మీరు నన్ను కొంత కాలం చూడలేరు. ఆటలో నా సమయం ఉన్నంత వరకు ఏమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉంటానని అన్నాడు.
వర్తమాన క్రికెట్‌లో ఫిట్టెస్ట్, టాలెంటెడ్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. గతంలో ఎంతో మంది రికార్డుల కోసం ఆడుతున్నారనే అపవాదును మూట గట్టుకున్నారు. కానీ కోహ్లీకి అది ఇష్టం లేదు. విరాట్ కోహ్లీ మరి కొంత కాలం క్రికెట్ ఆడే సత్తా కలిగి ఉన్నాడు.
కానీ ఇటీవల టెస్టు క్రికెట్‌లో అతను అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కుంటున్నాడు. ఫామ్ లేమి, ఏకాగ్రత కొరవడటంతో ట్రోలింగ్స్ కూడా ఎదుర్కున్నాడు. ఇలాంటి పరిస్థితి వస్తే తాను ఆడటం ఆపేస్తానని గతంలోనే చెప్పాడు. అన్నట్టుగానే చేశాడు.
విరాట్ తనను తాను ఇబ్బంది పెట్టుకోలేదు. తన నెత్తిపై రికార్డుల భారం మోయాలని అనుకోలేదు. కేవలం ఆటపై ఉన్న తపన, గౌరవం వల్లే ఇంత కాలం ఆడాడన్నది సుస్పష్టం. బీసీసీఐతో విభేదాలు.. కెప్టెన్సీ అడిగాడు..
ఇలాంటి పైకి కనపడని కారణాలు మనం ఎన్నైనా రాసుకోవచ్చు, చెప్పుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. కానీ తనపై తనకు క్లారిటీ ఉన్న విరాట్.. తన రిటైర్మెంట్ గురించి మొదటి నుంచి ఏ మాట చెప్పాడో.. అదే మాట తూచా తప్పకుండా పాటించాడు.
టీ20 క్రికెట్ నుంచి గతేడాదే తప్పుకున్నాడు. తాజాగా టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు. ఇక విరాట్‌ను అంతర్జాతీయ వేదికల్లో చూడాలంటే కేవలం వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వన్డే వరల్డ్ కప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది.
2027లో సౌత్ ఆఫ్రికా, నమీబియా, జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. మరి అప్పటి వరకు కోహ్లీ ఆ ఫార్మాట్‌లో కొనసాగుతాడా అంటే అనుమానమే. కోహ్లీ తన భవిష్యత్ గురించి తప్పకుండా ముందే ప్లాన్ చేసుకొని ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉంటాడు.
ఒకవేళ ఐపీఎల్‌కు బ్రేక్ రాకుండా ఉంటే.. ఫైనల్ ముగిసిన తర్వాత తన నిర్ణయాన్ని వెలువరించి ఉండేవాడేమో. కానీ ఇప్పుడు బ్రేక్ రావడంతో.. తన ఫ్యామిలీ, సన్నిహితులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెస్తుంది. ఏదేమైనా కోహ్లీ లేని టీమ్ ఇండియా టెస్టు జట్టును ఊహించుకోవడం కష్టమే. అల్విదా చాంపియన్.. #భాయ్‌జాన్
Share this Article