Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బొద్దింక కాదు… కాజ్ గెలిచింది… సర్కారు ఓడింది… తలవంచింది…

July 25, 2026 by M S R

.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎన్డీయే ప్రభుత్వం (మోదీ ప్రభుత్వం)లో ఓ విశేషమైన అంశం… గతంలో లేదు… ఓ మంత్రి రాజీనామా చేస్తే తలవంచి, తప్పు జరిగింది అని అంగీకరించినట్టు! అందుకే రాజ్యం దానికి రెడీగా ఉండదు… కానీ బొద్దింకల పట్టు సడలలేదు… మోదీ దిగివచ్చాడు… సేమ్, వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్న ప్రకటనలాగే… ఈ రాజీనామా…

ఐతే ఇక్కడి దాకా ఎందుకొచ్చింది… మరో డిఫరెంట్ కోణం చూద్దాం… ఇది మంచా, ఇది చెడా అనే విశ్లేషణకన్నా… ఒకటి మాత్రం నిజం… గెలిచింది బొద్దింక కాదు… కాజ్, అంటే ఉద్దేశం, తీసుకున్న ఇష్యూ… అది గెలిచింది… ప్రభుత్వం ఎక్కడెక్కడ తప్పులు చేసిందో ఓసారి చూద్దాం…

Ads

ఎందుకంటే..? ఏటా లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తారు, అదొక యజ్ఞం… కోచింగుల పేరిట వేల కోట్ల దందా ప్రతి ఏటా… అందుకే లీకులు, అక్రమాలు… ఇది తెలిసీ ఎవరి మీద చర్య తీసుకోలేదు కేంద్రం… పిల్లల ఆత్మహత్యలతో జాతీయ స్థాయిలో తల్లిదండ్రుల్లో (నీట్ రాయని పిల్లల పేరెంట్స్ కూడా) కోపం పెరిగింది…

ఎప్పుడైతే సీజేపీ ఈ కాజ్ తీసుకుందో, పేరెంట్స్, పిల్లలు అందరూ కనెక్టయ్యారు… ఇది మతం, కులం, ప్రాంతం, జాతి, పార్టీకి అతీతంగా జరిగింది… సీజేపీ కూడా ఇంత బలమైన సపోర్ట్ దొరుకుతుందని ఊహించి ఉండదు… ప్రభుత్వమూ ఊహించలేదు… కానీ ఇదే అదునుగా యాంటీ బీజేపీ శక్తులు , యాంటీ నేషనల్ శక్తులు సీజేపీ వెంట నిలిచాయి… హింస పెంచి కల్లోలం వైపు ప్లాన్లు వేశాయి… విషాదం ఏమిటంటే… అవి మేమే గెలిచాం అంటున్నాయి ఇప్పుడు… ఒకరకంగా గెలిచారు కూడా…

నీట్ రీఎగ్జామ్ జరిగినా సరే, జాతీయ స్థాయిలో ఈ నీట్ అక్రమాల్ని బలమైన చర్చనీయాంశం చేయగలిగింది సీజేపీ ఆందోళన..! నీట్ లీకేజీలు, అక్రమాలు బయటపడగానే మోదీ కఠినమైన చర్యలు తీసుకుని ఉంటే సీజేపీ ఆందోళనకు ఇంత సపోర్ట్ వచ్చి ఉండేది కాదు… నీట్ అక్రమాలపై యాక్షన్ లేటైంది… అదీ ఫస్ట్ ఫెయిల్యూర్…

తరువాత కఠిన చట్టం తెచ్చారు, ఇంకొందరిపై కేసులు బుక్ చేశారు, కానీ అన్నీ లేటే… సీజేపీ కారణంగానే ప్రభుత్వం స్పందిస్తున్నదనే భావన దేశవ్యాప్తంగా పెరిగింది… ఎస్, ఇది పిల్లలు, తల్లిదండ్రుల్ని కనెక్ట్ చేసిన అంశం కాబట్టి ఈ స్పందన… ఇదే సీజేపీ ఏ FCRA ( Foreign Contribution (Regulation) Act) మీదో ఆందోళన చేస్తే జంతర్ మంతర్‌కు ఎవడూ రాడు… సో, తీసుకున్న కాజ్ ముఖ్యం, అదీ గెలిచింది… ఖచ్చితంగా ఓడింది మోదీ సర్కారే… దాసోహం అనాల్సి వచ్చింది…

కాకపోతే మోదీ సర్కారు ఇది సున్నితమైన సమస్య కాబట్టే… కఠినంగా పోలేదు… నో బుల్లెట్… పోలీసు బలగాల మీద దాడులు జరుగుతున్నా కఠినంగా రియాక్ట్ కాలేదు… సీజేపీ చుట్టూ అసాంఘిక శక్తులు చేరుతున్నా ఏమీ చేయలేని స్థితి… వాళ్లకు ఓ బలమైన కాజ్ దొరికింది…

సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించాక ఇక సీజేపీ ఆందోళన ముగిసినట్టేనని మరో తప్పుడు అంచనా వేసింది మోదీ ప్రభుత్వం… అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఉండదు అని లీకులు ఇచ్చింది… కానీ ఫలించలేదు… మోదీ స్వయంగా అర్థరాత్రి వీడియోలు రిలీజ్ చేశాడు, రీచ్ రికార్డు స్థాయి, కానీ ఇంపాక్ట్ జీరో…

ఏమాటకామాట, చీఫ్ జస్టిస్ ‘వీడియోలు చూసే టైమ్ లేదు’ అని చేసిన వ్యాఖ్య కూడా సమాజంలోకి నెగెటివ్‌గా వెళ్లింది… ఒక జాతీయ పార్టీగా మేం వెనుకబడిపోతున్నామనే సోయితో రాహుల్ గాంధీ లేటుగానైనా రంగంలోకి దిగడం ఈ కాజ్‌కు మరింత బలం చేకూర్చింది… పలు రాష్ట్రాలకు ఈ ఆందోళనలు విస్తరించి, మరింతగా పలుచన అవుతున్నామనీ, నష్టం జరుగుతోందని గ్రహించింది బీజేపీ… మంటలు ఇంకా వ్యాపిస్తే, జెన్-జీ మరింతగా రెచ్చిపోతే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో ఏం జరిగింది…? సో, ఇప్పటివరకూ జరిగిన తప్పులను పరోక్షంగా అంగీకరిస్తూనే… ఇక తప్పనిసరై మంత్రి రాజీనామాకు ఆదేశించారు…

ఎస్, అంతర్గతంగా చాలా చర్చ జరిగాకే ఈ నిర్ణయం జరిగి ఉంటుంది… తప్పదు… కానీ జంతర్ మంతర్‌లో నాడు వ్యవసాయ చట్టాలపై ఆందోళన, నేడు నీట్ అక్రమాలపై ఆందోళన… రెండూ ప్రభుత్వం మెడలు వంచాయి… రేప్పొద్దున ఇంకెవరో టెంట్లు వేస్తే..? కాచుక్కూర్చున్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మళ్లీ రెచ్చిపోతే? ఇదీ మరింత బలమైన చర్చకు దారితీస్తున్న ప్రశ్న!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహేశ్ బాబూ – ఇక ఈ యాడ్స్ జోలికి వెళ్లకు – అవి శిక్షార్హమే !!
  • Flipkart – నీ దుంపతెగ- చావును కూడా అమ్ముకోవడం ఏమిట్రా ?
  • DC … విజయ్ దేవరకొండ చేసి ఉంటే… ఓ రేంజుకు వెళ్లిపోయేదేమో…
  • ఇది ఆ ఎన్టీయార్ పరువు ప్రతిష్ట కాదు – సుమన్ – సురేష్ బాపతు !!
  • చెప్పులు పోయాయ్ – కంగారెందుకు, చాట్‌జీపీటీ ఉందిగా, అడిగెయ్…
  • హీరో యశ్… ఈ కోణంలో నచ్చావ్… గ్రేస్, మెచ్యూరిటీ… 2 మెట్లు ఎక్కావ్…
  • సద్దాం ప్రత్యక్షం – హైపర్ ఆది మాయం – వాటీజ్ దిస్ నాగబాబూ…
  • బీజేపీ నేత థర్డ్ రేట్ – క్షుద్ర వ్యాఖ్యలు … ఇజ్జత్ పోయిందిగా…!!
  • దేవదాసు చావడు… కాలం మారేకొద్దీ కొత్తగా పుడుతున్నాడు !
  • పార్టీలో అప‘స్వరాలు ! ఔట్ స్పోకెన్ రేవంత్ అసాధారణ నిశ్శబ్దం !

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions