సంతోష్ జార్జి కులంగర… ఒక్కసారి ఈయన గురించి చెప్పుకోవాలి… ఎందుకంటే..? ది గ్రేట్ ట్రావెలర్… మన మళయాళీయే… ఇప్పటికి 130 దేశాలు తిరిగాడు పర్యాటకుడిగా..! ఏడు ఖండాలూ చుట్టేశాడు… ఇక తిరగాల్సిన టూరిజం పొటెన్సీ దేశం ఏమీ మిగల్లేదేమో… ఏకంగా అంతరిక్షంలోకి వెళ్తున్నాడు… టూరిస్టుగానే… ఏమో, ఏకాస్త సానుకూలత దొరికినా చంద్రగ్రహం, అంగారకగ్రహం కూడా వెళ్లడానికి రెడీ… కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన సంతోష్ 1971లో పుట్టాడు… మధురై కామరాజ్ యూనివర్శిటీ నుంచి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందగానే జర్నలిస్టు అయిపోయాడు… కాదు, మాస్ కమ్యూనికేటర్ అనాలేమో…! టీవీ రిపోర్టరో, పత్రికలో డెస్క్ సబ్‌ఎడిటరో కాదు… టెలిఫిలిమ్స్, డాక్యుమెంటరీలు తీసి టీవీ చానెళ్లకు ఇచ్చేవాడు… ఎడ్యుకేషన్ పుస్తకాలు, మ్యాగజైన్లు ప్రచురించే Labour India Publications పగ్గాల్ని తీసుకున్నాడు 26 ఏళ్లకే… ఊఁహూ, ఇంకేదో కొత్తగా చేయాలనే తపన ఎక్కువ…
2001లో సంచారం పేరుతో ఓ వీడియో ట్రావెలాగ్ తీసి ఆసియానెట్ చానెల్‌కు ఇచ్చాడు… అదే పేరుతో అదే టీవీలో ఏకంగా పదకొండేళ్లు నడిచింది ఆ ప్రోగ్రాం… సూట్‌కేసు సర్దుకోవడం, ఒంటరిగానే ఏదో ఓ దేశం వెళ్లడం, తనే షూట్ చేసుకోవడం… ఎడిటర్ తనే, డైరెక్టర్ తనే, అన్నీ తనే… ఊరికే ఆయా దేశాల్లోని బీచులు, హోటళ్లు, కొండలు, గుట్టలు, నదులు, టూరిస్ట్ ప్రదేశాలు చూపించి మమ అనిపించడం కాదు… ఆయా ప్రాంతాల కల్చర్, భాష, ఫుడ్, డ్రెస్సింగ్ గట్రా అన్నీ పరిశీలించేవాడు… 2013లో తనే సఫారీటీవీ అని ఓ చానెల్ స్టార్ట్ చేశాడు… అది ప్రధానంగా ట్రావెల్ చానెల్… ఈ సంచారం ప్రోగ్రాం అందులోనే వస్తోంది ఇప్పుడు… ఇన్నేళ్లుగా మొత్తం 1800 ఎపిసోడ్లు అంటే మాటలు కాదు కదా…
Ads
అప్పుడెప్పుడో 2007లోనే వర్జిన్ గ్రూపు అంతరిక్ష పర్యాటకుల కోసం పిలుపునిస్తే వెంటనే డబ్బు కట్టేశాడు… అదే సంవత్సరం తొలి దఫా శిక్షణ పొందాడు… జీరో గ్రావిటీ, స్పేస్ లివింగ్ శిక్షణ అవసరం కదా… అంతరిక్షం మీద ఆసక్తి ఏర్పడింది… 2010లో చంద్రయాన్-1 ఇతివృత్తంతో తనే చంద్రయాన్ అని ఓ సినిమా తీశాడు… అల్లాటప్పాగా ఏమీ తీయలేదు… గ్రాఫిక్స్ మీదే ఆధారపడలేదు… శ్రీహరికోటలోని రాకెట్ అసెంబ్లీ బిల్డింగ్, లాంచ్ పాడ్, మిషన్ కంట్రోల్ సెంటర్, స్పేస్ క్రాఫ్ట్ అసెంబ్లీ బిల్డింగ్, పీఎస్ఎల్వీ రాకెట్, చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్ అన్నీ అచ్చుగుద్దినట్టు సెట్లు వేశాడు… చంద్రయాన్ ప్రాజెక్టు కోసం తెరవెనుక పనిచేసిన కీలకవ్యక్తులు, ఇండియాకు అనుకూలించిన అంశాల మీద ఫిక్షన్ స్టోరీ…
ప్రస్తుతానికొస్తే… అప్పుడెప్పుడో 2007లో ఎంపికయ్యాడు కదా… తనతోపాటు ఎంపికైనవాళ్లతో కలిసి 2012లో ఒకసారి, 2013లో మరోసారి శిక్షణకు వెళ్లొచ్చాడు… మరో దఫా వెళ్లాలి… దాదాపు రెండు కోట్ల దాకా ఖర్చు… మొన్న వర్జిన్ గ్రూపు బాస్ బ్రాన్సన్, మన శిరీష బండ్ల వెళ్లొచ్చారు కదా, తదుపరి ట్రిప్పులో వెళ్లే ఆస్ట్రో టూరిస్టుల్లో సంతోష్ కూడా ఉండబోతున్నాడు… సో, సంచారం తదుపరి వీడియో ట్రావెలాగ్ అంతరిక్ష యాత్ర మీదే అన్నమాట… ఇంట్రస్టింగు… ఈసారి ఏమాత్రం వీలున్నా చంద్రగ్రహం మీదకు పర్యాటకానికి వెళ్లిరా… నువ్వు జర్నలిస్టు, పబ్లిషర్, టీవీచానెల్ ఓనర్, డైరెక్టర్, అన్నింటికీ మించి నువ్వు గ్రేట్ టూరిస్టువు బ్రదరూ… కీపిటప్..!! (స్టోరీ మీకు నచ్చితే దిగువన ఉన్న డొనేట్ బటన్ ద్వారా ముచ్చటకు అండగా నిలవండి)…
Share this Article