Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ది హంట్… ఈ కొత్త సోనీ వెబ్ సీరీస్ నాకెందుకు నచ్చిందీ అంటే..?

July 11, 2025 by M S R

.

Ashok Kumar Vemulapalli ……. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన వెబ్ సిరీస్ ఇది… ది హంట్… ఎక్కడా స్కిప్ చేయకుండా, ఫార్వార్డ్ చేయకుండా చూసిన వెబ్ సిరీస్ ఇది… కథలో ట్విస్టులు ఏమీ ఉండవ్…. అందరికీ తెలిసిన విషయాలే…

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అనంతరం… హంతకుల కోసం సాగిన విచారణ మీద తీసిన సిరీస్ ఇది… ఎక్కడా హడావిడి, హంగామా ఏమీ ఉండవు… అలా ఇన్వెస్టిగేషన్ సాగిపోతుంటే… మనం అలా లీనమైపోయి కన్నార్పకుండా చూస్తూనే ఉంటాం…

Ads

మనకు అన్నీ తెలిసిన విషయాలే అనుకుంటాం గానీ… కొన్ని కొత్త విషయాల్ని ఆవిష్కరించింది ఈ సీరీస్… ఆ కొత్త విషయాలేమిటో కాసేపు చదువుకుందాం…



అందరికీ తెలిసిన వార్తలే కదా… మరి వెబ్ సిరీస్ ఇంత ఆసక్తికరంగా ఎలా తీశారు.. అందరికీ తెలిసిన విషయాన్ని మళ్లీ జనం చూసేలా ఎలా తీయగలిగారు అనేది ఇక్కడ ఆసక్తికర అంశం… వెబ్ సిరీస్ లో తీసిన అంశాలన్నీ ఎలా సేకరించారు అనేది దానికున్న అధెంటికేషన్ ఏంటనేది కూడా డిస్కషన్ పాయింట్…

సాధారణంగా మనకు తెలిసిన విషయాలకంటే కొత్తగా కొన్ని విషయాలను చూపించారు వెబ్ సిరీస్ లో… వాటిల్లో కొన్ని…

rajiv

ముందుగా ఆ మానవ బాంబును మరో మాజీ ప్రధాని వీపీసింగ్ తమిళనాడు పర్యటనలో ఉండగా టెస్ట్ ట్రయల్ చేశారు… బాంబు పేల్చలేదు గానీ… వీవీఐపీ పర్యటనలో మెటల్ డిటెక్టర్లకు దొరకకుండా… బెల్ట్ బాంబు ధరించిన ధాను…సెక్యూరిటీ వలయం దాటుకుని మాజీ ప్రధాని వీపీ సింగ్ వరకూ వెళ్లగలిగింది…

ఆయన మెడలో గంధపు మాల వేయగలిగింది… దండ ఆయన మెడలో వేసి, వంగి ఆయనకు పాదాభివందనం చేసినపుడు, నడుముకున్న బెల్ట్ బాంబ్ లో మొదటి స్టెప్ అయిన స్విచ్ ను సక్సెస్ ఫుల్ గా ఆపరేట్ చేసింది… (ఎల్‌టీటీఈ ఆపరేషన్లు ఎంత పకడ్బందీగా ఉండేవో చెప్పడానికి పర్‌ఫెక్ట్ ఉదాహరణ)…

.

ప్రభాకరన్ ఆదేశాలకు భిన్నంగా శివరాసన్...

నిజానికి టైగర్లలో ప్రభాకరన్ చెప్పిన లేదా ఆమోదించిన ప్లానే అల్టిమేట్… కానీ రాజీవ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు శివరాసన్… ఎక్కడికక్కడ బాస్ ఆదేశాలకు భిన్నంగా వెళ్లాడు… ఎందుకనే క్లారిటీ మనకు రాకపోయినా… ఎక్కడెక్కడ ధిక్కరించి, సొంత ఆలోచనలతో అడుగులు వేశాడో ఈ సీరీస్ చెబుతుంది…

రాజీవ్ గాంధీని హత్య చేసిన తర్వాత ఎల్టీటీటీఈ అధినేత టైగర్ ప్రభాకరన్ ఆదేశాల మేరకు ఒంటికన్ను శివరాసన్ బృందం తిరిగి జాఫ్నా (శ్రీలంక) వెళ్లిపోవాలి… ఆయన్ను తీసుకెళ్లడానికి ప్రభాకరన్ రైట్ హ్యాండ్ అయిన శాంతను కూడా చెన్నైవచ్చారు…

కానీ శివరాసన్ అధినేత ఆదేశాలను ధిక్కరించి చెన్నైలోనే ఉండిపోయారు… ఒక విధంగా ఎల్టీటీటీఈ కి వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు… శాంతనుకు, శివరాసన్ కు మధ్య అనేకసార్లు ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది… ఈ సంగతి కూడా చాలామందికి తెలీదు…

the hunt

రాజీవ్ గాంధీ హత్య తర్వాత శివరాసన్ మరికొన్ని హత్యలు చేయాలనుకున్నాడు… అందులో ఒకటి అప్పటి ముఖ్యమంత్రి జయలలిత… ఆమెను కూడా రాజీవ్ గాంధీ మాదిరిగా హత్యచేయాలనుకున్నాడు… ఇది ఎల్టీటీటీఈ నిర్ణయానికి వ్యతిరేకం… కేవలం శివరాసన్ తీసుకున్న నిర్ణయం మాత్రమే… దీనికి అధినేత అనుమతి కూడా లేదు… అందుకు శుభతో కలిసి స్కెచ్ కూడా వేస్తాడు శివరాసన్… జయలలిత హత్యకు ఫ్లాన్ అనేది కూడా కొత్త విషయం కావొచ్చు…

కార్తికేయన్ టీమ్‌నే లేపేయాలనుకున్నారు...

రాజీవ్ గాంధీ హత్యపై విచారణకు కేంద్రం నియమించిన కార్తీకేయన్ నేతృత్వంలోని సెట్ బృందం మొత్తాన్ని కూడా శివరాసన్ హత్య చేయాలనుకున్నాడు… ఇందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేశాడు… సిట్ టీమ్  బస చేసిన మల్లిగై గెస్ట్ హౌస్ కు మధ్యాహ్నం వెళ్లే భోజనం సాంబార్ గిన్నెలో బాంబును పంపాడు… సాంబార్ ఉన్నా కూడా బాంబ్ దెబ్బ తినకుండా ఉండేలా వాటర్ ప్రూఫ్ బాంబ్ తయారు చేశాడు...

భోజనం, బాంబుతో నిండి ఉన్న సాంబార్ గిన్నెతో ఉన్న ఆటో… మల్లిగై గెస్ట్ హౌస్ కు వచ్చాక… పోలీసులను చూసి అనుమానంతో వెనక్కి వెళ్లిపోవడంతో కార్తికేయన్ బృందం ప్రాణాలతో బయటపడింది.. ఇది కూడా ఆసక్తికర అంశం…

rajiv

ఎల్టీటీటీఈ మిలిటెంట్లు సాధారణంగా పోలీసులకు పట్టుబడిపోతే… మెడలో ఉండే సైనైడ్ ను కొరికి చనిపోతారు. అందుకే సిట్ టీమ్ యాంటీ సైనేడ్ ఇంజెక్షన్లు సిద్దం చేసుకుంటారు… అంటే తాము పట్టుకోవడానికి వెళ్లినపుడు నిందితులు సైనేడ్  కొరికితే వెంటనే ఆ ఇంజెక్షన్లు చేసి వారిని బతికించాలనేది ప్లాన్… ఇది కూడా కొత్త విషయం…

డిఫరెంట్ ఇంటరాగేషన్...

నిందితుల నుంచి శివరాసన్ లొకేషన్ చెప్పించడానికి, హత్య ప్లాన్ తెలుసుకోవడానికి సిట్ టీమ్ సభ్యుడు పట్టుబడిన గర్భవతి నళినిని ఆమె భర్త ఎదురుగా ప్రవర్తించిన తీరు కూడా ఆశ్చర్యపరుస్తుంది… ఇలా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారా అనిపించింది… భారత్ నుంచి శ్రీలంక వెళ్లిన అప్పటి శాంతిదళం సభ్యుడైన ఆ అధికారి నిజాలు రాబట్టేందుకు ఇలా మానసికపరమైన గేమ్ కూడా ఆడాల్సి ఉంటుందని సిట్ చీఫ్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు… తాను శ్రీలంకలో ఉన్నపుడు కూడా ఇదే రకమైన గేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశానంటాడు… ఇది కూడా కొత్త విషయమే…

సిట్ పర్మిషన్ లేకుండానే ఇటు తమిళనాడు, అటు కర్నాటకలో స్థానిక పోలీసులు ఎల్టీటీటీఈ సభ్యుల ఇళ్లపై దాడులు చేయడం, అలా పోలీసులను చూడగానే వాళ్లు సైనైడ్ మింగి చనిపోవడం… దానిపై సిట్ సభ్యులు సీరియస్ అవ్వడం అన్నీ ఆసక్తికర అంశాలే… ఇలా సైనైడ్ మింగి చనిపోతున్న ఎల్టీటీఈ సభ్యుల మరణాలపై అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ముందు సిట్ చీఫ్, సీబీఐ చీఫ్ ఇద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది…

rajiv murder

రాజీవ్ హత్యకు మూలకారకుడైన ఒంటికన్ను శివరాసన్ బెంగళూరు సమీపంలో ఒక పల్లెటూరులో తలదాచుకున్న లొకేషన్ ట్రేస్ అవుట్ చేశాక… సిట్ టీమ్ అతన్ని పట్టుకోవడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాదు… అప్పటి వరకూ చాలా యాక్టివ్ గా అద్భుతంగా పని చేసిన సిట్ చీఫ్ కార్తికేయన్ ఎందుకు చివర్లో ఎదురుగా శత్రువు ఉన్నప్పటికీ, పట్టుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన టీమ్ కు రైడ్ కు అనుమతి ఇవ్వరు…? ఇలా ఎందుకు డిలే చేసారో కూడా కారణం తెలీదు… సిట్ చీఫ్ వచ్చేవరకూ వేచి ఉండాలని ఒక రోజు, సీబీఐ చీఫ్ ఢిల్లీ నుంచి వచ్చే వరకూ వేచి ఉండాలని మరో రోజు ఇలా రైడ్ ను ఆలస్యం చేస్తూనే ఉంటారు…

చివరికి రెండు రోజుల అనంతరం అయినా రైడ్ కు అనుమతి దొరుకుతుందా అంటే… సైనైడ్ రియాక్షన్ ఇంజెన్లు ఎక్స్ పైరీ అయిపోయాయి కాబట్టి వాటిని వాడడానికి వీల్లేదని… మళ్లీ కొత్త ఇంజెక్షన్లు గ్వాలియర్ నుంచి తెప్పించే వరకూ రైడ్ చేయకుండా శివరాసన్ బస చేసిన ఇంటిబయటే సిట్ టీమ్, ఎన్ఎస్ జీ బృందాలు వేచి చూస్తూనే ఉండాల్సి వస్తుంది… ఇది కూడా చాలా ఆసక్తికరం, అనుమానాస్పదం కూడా…

ఇలా రెండురోజులకు పైగా ఇంట్లోంచి బయటకు రాకుండానే… శివరాసన్ చివరికి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… అదే రైడ్ చేసి ఉంటే… ప్రాణాలతో పట్టుబడేవాడు… కానీ సిట్ టీమ్ ఎందుకు ఇలా చేసింది అనేది ఎవరికీ అర్థం కాదు…

మద్రాస్ కేఫ్ సినిమా కథ డిఫరెంటు...

గతంలో మద్రాస్ కేఫ్ అనే సినిమా కూడా ఇదే ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి వచ్చింది… కానీ అందులో కథాంశం వేరు… రాజీవ్ మరణాన్ని ముందుగానే రా అధికారులు గుర్తించి, రాజీవ్ ను అప్రమత్తం చేసినప్పటికీ ఆయన కచ్చితంగా మీటింగ్ కు వెళ్లాల్సిందేనని పట్టుబట్టినట్టుగా చూపిస్తారు…

రాజీవ్ ని హత్య చేయాలనేది కేవలం ఎల్టీటీటీఈ నిర్ణయం మాత్రమే గాక… ఒక ఇంటర్నేషనల్ కార్పోరేట్ సంస్థ కుట్ర కూడా ఉందనేది ఆ సినిమా సారాంశం… తమ కంపెనీ ఇండియాలో పెట్టుబడులపై రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నపుడు అనేక ఆంక్షలు విధించడం, ఆయన మళ్లీ జరగబోయే ఎన్నికల్లో ప్రదాని అయితే తమ మనుగడ కష్టమవుతుందనే కారణంతో ఆ కార్పోరేట్ సంస్థ ఎల్టీటీటీఈతో చేతులు కలిపి లండన్ లోని మద్రాస్ కేఫ్ లో సమావేశమై రాజీవ్ ను హత్య చేసే ప్లాన్ వేసిందనేది మద్రాస్ కేఫ్ సినిమా సారాంశం… ఈ వెబ్ సిరీస్ అసలు ఆ కథ జోలికే వెళ్లలేదు…  అశోక్ వేములపల్లి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బహుశా విజయశాంతికీ గుర్తుండి ఉండదు ఇదో సినిమా చేసినట్టు..!!
  • దటీజ్ రాజనాల..! వేషం దొరికితే చాలు, దర్శకులకే క్లాసులు…
  • అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…
  • నా పెంపుడు కోడి కాళ్లు విరగ్గొట్టాడు వెధవ… వాడిని వదలొద్దు సర్…
  • అయ్యో రామా… ఓ అనాసక్త సినిమాలో ఆమే ప్లజెంట్ భామ…
  • ‘‘మేం ఏం నష్టపోయాయో, పగిలిన ఒక్క గాజుముక్క చూపించండోయ్…’’
  • ఆల్రెడీ యూట్యూబ్ వీడియోల క్వాలిటీకి ఎఐ టూల్స్ పర్యవేక్షణ…
  • బ్యాక్ బెంచర్స్..! తరగతి గది సీటింగు మార్చేస్తున్న ఓ కొత్త సినిమా..!
  • ఒక భారతీయ గురువు… ఒక పాకిస్థానీ శిష్యుడు… ఒక నోబెల్ ప్రైజ్…
  • ఈ అల్లరి చిల్లర మెంటల్ పిల్ల నోటి నుంచి ఓ వైరాగ్యపు డైలాగ్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions