Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఒక్క ప్రమాదం నా జీవితాన్నే కుదిపేసింది… నా ప్రయాణమే మారిపోయింది…

November 19, 2023 by M S R

పదేళ్ల క్రితం… నా జీవితం హాయిగా సాగేది… మంచి భర్త, ఇద్దరు ఆరోగ్యంగా ఉండే పిల్లలు, స్థిరమైన కొలువు… కానీ ఒకేసారి మొత్తం తలకిందులైంది… మా ఇంటి మొదటి అంతస్థు నుంచి నా చిన్న కొడుకు చందన్ కిందపడటంతో నా జీవితమే మారిపోయింది… అప్పటికి వాడి వయస్సు కేవలం 15 ఏళ్లు…

నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాను వాడిని వాడిని వీల్ చెయిర్‌లో కూర్చోబెట్టి హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే… ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని, ప్రపంచానికి మంచి చేయాలని కలలు గన్న నా పిల్లాడు ఆ క్షణాన అన్నీ కోల్పోయాడు… తన భవిష్యత్తుతో సహా…

చందన్ తలకు, వెన్నుకు బాగా దెబ్బలు తగిలాయి… అనేక సర్జరీలు, చికిత్సలు, మందులతో 3 నెలలు గడిచిపోయాయి… అప్పటికి గానీ లేచి నడవడం స్టార్ట్ చేయలేదు… కానీ తన ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది… తనలో తాను మాట్లాడుకునేవాడు… అకారణంగా తన దగ్గర ఉన్న మనుషుల్ని కొట్టేసేవాడు… డాక్టర్లు తనకు సైకోసిస్ అని తేల్చారు… ఇరుగూపొరుగు దాదాపుగా మమ్మల్ని వెలేశారు… మాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కారు…

Ads

తరువాత రెండేళ్లలో చాలామంది డాక్టర్లను కలిశాం, అనేక హాస్పిటళ్లకు తిరిగాం, బెంగుళూరుకు తీసుకెళ్లాం, కానీ ఏదీ వర్కవుట్ కాలేదు… తనను ఎప్పుడూ చూసుకునేవాళ్లు కావాలి కాబట్టి నా ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది… ఇవి చాలవన్నట్టుగా నా భర్త ఆరోగ్యం దెబ్బతింది… అదుపు లేని మధుమేహం, బాపీ కారణంగా… ఓ కాలు కూడా తీసేయాల్సి వచ్చింది…

అటు కొడుకు, ఇటు భర్త… నాకు వీళ్లతో వశపడటం లేదు… ఓ దశలో నా ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను… కానీ అది సరైన నిర్ణయం కాదని నాకే అనిపించింది… వాళ్లనలా వదిలేసి నేనెలా వెళ్లిపోతాను..? దాదాపు ప్రతి రాత్రీ నిద్ర ఉండేది కాదు, ఏడ్చేదాన్ని… దేవుడా, ఏదైనా అద్భుతం చేసి నన్ను గట్టెక్కించు అని ప్రార్థించేదాన్ని…

2017లో నిజంగానే ఓ అద్భుతం నన్ను పలకరించింది… The Live Love Laugh సంస్థ మా ఊరు దావణగేరెకు వచ్చింది… ఈ ఫౌండేషన్ సంకల్పం ఏమిటంటే మానసిక రోగుల్ని తిరిగి మామూలు మనుషులను చేయడం…!

వాళ్లు చందన్ బాధ్యతను తీసుకున్నారు… మందులు, చికిత్సే కాదు, వొకేషనల్ ట్రెయినింగ్ కూడా ఇవ్వసాగారు… నా డిప్రెషన్ గమనించి నాకూ కౌన్సెలింగ్ ఇచ్చారు… ఫలితంగా, నేనేమీ ఒంటరిదాన్ని కాదని, నా వెనుక చాలామంది ఉన్నారనే భరోసా కలిగింది… డిప్రెషన్ నుంచి బయటపడ్డాను…

క్రమేపీ, కాలం గడిచేకొద్దీ పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి… నా పెద్ద కొడుకు మెకానిక్‌గా పనిచేస్తున్నాడు… మా కుటుంబానికి ఆసరా అయ్యాడు… చిన్న కొడుకు చందన్ కూడా అక్కడా ఇక్కడా చిన్న చిన్న పనులు చేస్తున్నాడు… తన అనారోగ్యం కారణంగా ఎక్కడా స్థిరంగా ఉండకపోయినా సరే, వాడి మొహంలో అప్పుడప్పుడూ నవ్వును చూసి నేను స్థిమితపడేదాన్ని…
మానసిక సమస్యలున్నవాళ్లకు నేను కూడా ఏమైనా చేయాలని అనిపించేది… నాలాంటోళ్లు చాలామంది ఉన్నారు ప్రపంచంలో… అందుకని సదరు లివ్ లావ్ లాఫ్ సంస్థ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని… మా తాలూకాలోని పలు గ్రామాల్లో సంస్థ సభ్యురాలిగా పనిచేసేదాన్ని… జనంలో చైతన్యాన్ని పెంచడానికి, మానసిక రోగుల సమస్యల్ని స్టడీ చేసి, వాళ్ల పరిస్థితి మెరుగుపడటానికి ఏమేం చేయాలో సంస్థ సీనియర్ల నుంచి గైడెన్స్ అందేది…
నా జీవితానికి ఓ సార్థకత కనిపిస్తోంది… నేను వెళ్లాల్సిన మార్గం స్పష్టంగా ఉంది…
కాలం గడుస్తోంది… ప్రస్తుతం మా తాలూకాలోని దాదాపు 200 పేషెంట్ల బాధ్యతలు చూస్తున్నాను… ఆ సంస్థ నాకేం చేసిందో, నేనూ అందరికీ అదే అందిస్తున్నాను… వాళ్లలో ఒంటరితనాన్ని పారదోలడం నా ప్రథమ విధి… ఏళ్లు గడిచేకొద్దీ ఈ దిశలో నాకు పలు అవార్డులు వచ్చాయి… అవి నా బాటలో మరింత చురుకుగా నేను నడిచేలా చేశాయి…

నాకు తెలుసు… నేను వెళ్లే మార్గం చాలా పెద్దది… ఎంత దూరం వెళ్లినా ఇంకా అలాంటోళ్లు చాలామంది… చేయాల్సింది చాలా ఉంది… వాళ్లలో నమ్మకం కొడిగట్టకుండా చూడాలి… ఎందరో చందన్‌లు… మా చందన్ పూర్తి ఆరోగ్యవంతుడు కావాలంటే ఇంకా టైమ్ పట్టేట్లుంది… పర్లేదు, ప్రస్తుతానికి ఇది చాలు… నా అడుగులు సరైన తోవలోనే సాగుతున్నాయి… The Live Love Laugh Foundation

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions