Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

టెలిగ్రాఫ్ వ్యాఖ్య… జర్మనీలో ఇది మరో ఆపరేషన్ సిందూర్ అట…

June 5, 2025 by M S R

.

అచ్చం ఆమె బాస్ మమత బెనర్జీలాగే… ఏదీ సంప్రదాయంలో ఇమడదు.,. ఆమె రాజకీయంలాగే… ఆమె పోకడలాగే… ఆమె అడుగుల్లాగే…

ఐనా మనకెందుకు లెండి… మమత ఎలా పోతేనేం అంటారా..? అలా తేలికగా తీసేయలేం… ఎన్ని ఆపరేషన్ సిందూర్‌లు చేసినా మమతలాంటి కేరక్టర్లు ఉన్నంతకాలం వేస్టే… సరే, ఈ చర్చలకేం గానీ…

Ads

మరో ఆపరేషన్ సిందూర్ ఒకటి నిశ్శబ్దంగా, రహస్యంగా జర్మనీలో జరిగిపోయిందట… పశ్చిమ బెంగాల్ వార్తలకు, హెడ్డింగులకు ప్రసిద్ధి టెలిగ్రాఫ్ వాడు… అవును, వాడు పెట్టిన హెడ్డింగే ఇది… ‘‘ఇది మరో ఆపరేషన్ సిందూర్’’…

సరే, విషయం ఏమిట్రా అంటే… మోస్ట్ కంట్రవర్షియల్ బెంగాలీ టీఎంసీ కేరక్టర్ ఉంది కదా… మహువా మొయిత్రా… ఆమె చేష్టలన్నీ విశేషాలే కదా… ఆ పాత సంగతులు ఇప్పుడు ఎందుకులే, మమత ఎంపీలందరూ అదే బ్యాచ్ కదా…

ఈ బెంగాలీ వయస్సు 50 ఏళ్లు… ఒక 65 ఏళ్ల ఒడియా వ్యక్తిని రహస్యంగా జర్మనీలో పెళ్లాడింది… అదీ వార్త… టెలిగ్రాఫ్ వాడే ఫస్ట్ బ్రేక్ చేశాడు… ఇలా ఫోటో పెట్టి…

mahua

ఆపరేషన్ సిందూర్ అన్నారు, ఆమె నొసటన సిందూరం ఏది అనే అమాయక ప్రశ్నలు వేయొద్దు… ఆమె అసలే మమత స్టయిల్… అదీ హిందుత్వ సూచన, అందుకే బహిష్కరించాను అనే బాపతు… సిందూర్ లేని పెళ్లేమిటి అనే మరో అమాయకపు ప్రశ్న కూడా వేయొద్దు… ఆమె అన్నింటికీ అతీతం…

ఫస్ట్, డేనిష్ ఫైనాన్షియర్ ఒకరిని పెళ్లి చేసుకుంది.,. ఎవరు ఎవరిని భరించలేక చేతులెత్తేశారో గానీ పెళ్లి కొన్నాళ్లకే పెటాకులు… మమతకు భలే దొరుకుతారు… ఇప్పుడు ఈయన్ని పెళ్లి చేసుకుంది… (వాళ్లు అధికారికంగా ఏమీ ప్రకటించలేదు, గానీ టీఎంసీ ఎంపీ ఒకాయన కంగ్రాట్స్ అని ఆల్రెడీ ట్వీటాడు…)

పైగా టీఎంసీ విషయాలన్నీ అధికారికంగానే వెల్లడించే మీడియా కదా టెలిగ్రాఫ్… వాడే చెప్పాక ఇక తిరుగేముంది..? పొద్దున్నుంచీ ఈ ఫోటో వైరల్ అవుతోంది, మోడీ కంగ్రాట్స్ ట్వీట్ వస్తుందేమో అని ఎదురు చూశా, కానీ రాలేదు…

ఇంతకీ ఎవరీ వరుడు… ఆమె అరాచక టీఎంసీ బ్యాచ్ అయితే అతడు కాస్త పద్ధతిగా ఉండే బీజేడీ బ్యాచ్… బెంగాల్‌కూ ఒడిశాకూ భలే కుదిరింది అంటారా..? అవును, అసలే 50 వెడ్స్ 65 మరి…

ఈ సారువాడు నాలుగుసార్లు ఎంపీ, బీజేడీ లోకసభ ఫ్లోర్ లీడర్… సుప్రీంకోర్టు న్యాయవాది… తన కుటుంబం కూడా పొలిటికల్ ఫ్యామిలీయే… తండ్రి ఎంపీ కమ్ గవర్నర్ ఒకప్పుడు…

గతంలో సంగీత్ మిశ్రా అనే ఆవిడను పెళ్లి చేసుకున్నాడు… తరువాత విడాకులు, ఆల్రెడీ ఓ కొడుకు, ఓ బిడ్డ… ఐనా ఏముందిలే… ఆమె డైవోర్సీ, ఆయనా డైవోర్సీ… మరీ ముసలాయన్ని పెళ్లి చేసుకుందేమిటి అనడక్కండి… ఆమె లెక్కలు ప్రపంచంలోనే ఎవడికీ అర్థం కావు…!!

పోనీలే, ఎట్టకేలకు ఆ నూతన వధువే స్పందించింది… అధికారికంగా పెళ్లి గురించి చెప్పలేదు గానీ, అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు కదా, థాంక్స్ అంటోంది… విచిత్రమైన కేరక్టర్…

https://x.com/MahuaMoitra/status/1930634952141426988?t=zckke_skvs8upGZ4D07C6w&s=19

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ కాళేశ్వర కదనం దేనికి..? కదం, కవాతు దేనికి..? బీఆర్ఎస్ రాంగ్ స్ట్రాటజీ..!!
  • కాపీ వీడియోల వడబోత సరే… కంటెంట్ స్టాండర్డ్స్ మాటేమిటి మరి..?!
  • హీరో మహేశ్ బాబును వదలని సాయి సూర్య ‘రియల్’ తలనొప్పి…
  • మార్ మత్ చోడో …. పండుగ సాయన్న కథలో కీలకమైన ట్విస్టు ఇదే…
  • ఆల్ ఇండియా ర్యాంకర్స్… ఆ సీన్… వివాదం పెరిగి దర్శకుడి క్షమాపణ…
  • కామాఖ్య గుడిలో తెలుగు నాయకుల భగాలాముఖి గుప్త పూజలు..!!
  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…
  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions