.
Nàgaràju Munnuru …. పసిగుడ్డు, పదేళ్ల చిన్నారి, ఒంటరి మహిళా, పండు ముసలి అనే తేడా లేకుండా మహిళలను అత్యాచారం చంపుతుంటే ఏమి శిక్ష వేస్తున్నారు?
భద్రమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అవినీతి అక్రమ సంపాదనతో వందల కోట్ల రూపాయలు కూడబెట్టి ఏసీబీకి పట్టుబడితే ఏమి శిక్ష వేస్తున్నారు?
వందే భారత్ లాంటి కొత్త రైళ్లు ప్రవేశపెట్టినపుడు ఈ రైళ్ల మీద రాళ్ళు విసిరి, అద్దాలు పగులగొట్టి, ప్రయాణికుల పళ్ళురాలగొట్టే అల్లరి మూకలకు ఏమీ శిక్ష వేస్తున్నారు?
రైలు పట్టాలు పీకేసి, పట్టాల మీద బండరాళ్లు, ఇనుప రాడ్లు, గ్యాస్ సిలిండర్లు లాంటివి పెట్టి రైలు ప్రమాదం జరగాలని ప్రయత్నించే వారికి ఏమి శిక్ష వేస్తున్నారు?
Ads
లక్షకో, కోటికో ఆశపడి నీట్ లాంటి ప్రవేశ పరీక్షా పత్రాలు లీక్ చేసి అమ్ముకుంటే ఏమి శిక్ష వేస్తున్నారు?
గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తూ, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న నైజీరియా ముఠాలు, లోకల్ పెడ్లర్స్ కి ఏమీ శిక్ష వేస్తున్నారు?
పాస్పోర్ట్, వీసాలు లేకుండా భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఏమీ శిక్ష వేస్తున్నారు?
అసలు ఈ దేశంలో నేరం చేస్తే శిక్ష పడుతుంది అనే భయం ఎవడికైనా ఉందా? ఒక కేసులో న్యాయస్థానం నిర్దిష్టకాలంలో తీర్పు వస్తుందనే నమ్మకం ఉందా?
ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కావచ్చు. అంతమాత్రాన దేశంలో ఏ నేరం చేసినా చెల్లుతుంది, కొన్ని డబ్బులు ఖర్చు చేసుకుంటే శిక్షలు పడకుండా తప్పించుకోవచ్చు లేదా జీవితకాలంలో తీర్పు రాకుండా చూసుకోవచ్చు అన్న ధీమా కలిగి ఉండటం శ్రేయస్కరం కాదు. ఇలాంటి వ్యవస్థ నిజానికి బాధితులను శిక్షిస్తుంది, నిజాయితీపరుల నోరు మూయిస్తుంది.
పైన చెప్పిన నేరాలకు పాల్పడేవారిని సంవత్సరానికి ఒక వెయ్యిమందిని ఉరి తీయండి. వారు సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోండి. దీంతో దేశంలో నేరాలైనా తగ్గుతాయి, నేరస్తులైన తగ్గుతారు.
సమాజంలో ఇతరులతో కలిసి బతకడం అనేది ప్రజలందరూ పరస్పరం అంగీకరించిన నియమ నిబంధనలు. వాటిని అతిక్రమించే వారెవరు నాగరిక సమాజంలో జీవించడానికి అర్హులు కారు. కలుపు మొక్కలను ఉపేక్షిస్తే పంట మొత్తం పాడవుతుంది.
– నాగరాజు మున్నూరు
ఈ అభిప్రాయానికి మరికొన్ని జోడింపులు… ఈ నేరగాళ్లలో కావాలని సమాజంలో అన్‌రెస్ట్ క్రియేట్ చేసే సోషల్ మీడియా, మీడియా బాధ్యులను కూడా కలపాలి… ఈ దేశానికి అసలైన ప్రమాదం అర్బన్ నక్సల్స్ అండ్ సోకాల్డ్ ప్రొగ్రెసివ్ బయాస్డ్ మీడియా… ముచ్చట
Share this Article