Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆమెను అక్షరాలా మరిపించే ఈమె… పొట్టిబట్టల కొత్త బుట్టబొమ్మ…

September 18, 2022 by M S R

అసలే రేటింగ్ కష్టాల్లో ఉన్న ఈటీవీని యంగ్ మేడం శ్రీమతి అనసూయ భరద్వాజ గారు నట్టేట్లో వదిలేసి వెళ్లిపోయాక… ఫాఫం, ఈటీవీకి ఇక ఎవరు దిక్కు అనే పెద్ద ప్రశ్న మల్లెమాలను, ఈటీవీని మరింత భయాందోళనల్లో పడేసింది… ఇప్పటికే మూడో ప్లేసులోకి జారిపోయిన ఈటీవీ ఇంకెంత లోతుల్లోకి వెళ్లిపోతుందో అనే భావన ప్రబలింది… ఈ సంక్షోభవేళ రష్మి గౌతమ్ ఆంటీ ‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చింది… నిలబడింది… అనసూయ స్పూర్తిని అక్షరాలా కొనసాగిస్తాను అని మంగమ్మ శపథం చేసింది… ఆమె రంగమ్మత్త అయితే నేనసలే గుంటూరు టాకీస్ అని ధీమా ఇచ్చింది…

ఆఫ్టరాల్ పొట్టి బట్టలే కదా… నాకైమైనా కొత్తా..? అనసూయను మరిపించేవిధంగా వేయగలను… అసలు యాంకరింగులో, హోస్టింగులో నేనెక్కడ..? అనసూయ ఎక్కడ..? ఇక చూడండి అంటోంది… ఈరోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె డ్రెస్సు… ఆహా… ఏ ఐటం సాంగు డ్రెస్సుకూ తీసిపోదు… ఎస్, ఇప్పుడు నమ్మకం కుదిరింది… అనసూయ లేని లోటును రష్మి ఖచ్చితంగా తీర్చగలదు… ఎస్, అనసూయ వెళ్లిపోయిన వెంటనే… రష్మిని జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామాకంపెనీ… ప్రతి ప్రోగ్రాముకూ నువ్వే హోస్టువు అని మల్లెమాల కంపెనీ డిక్లేర్ చేసింది… ఆ నమ్మకాన్ని రష్మి నిలబెట్టుకుంటోంది…

Ads

rashmi

ఆ జబర్దస్త్‌ను కాసేపు వదిలేద్దాం… ఆ బూతు షోయే ఈటీవీ రేటింగులకు ఆక్సిజెన్ ఫాఫం… కానీ మొదట్లో కాస్త డిఫరెంటుగా అనిపించి, కొన్నాళ్లు ప్రేక్షకుల్ని కూడా అలరించిన శ్రీదేవి డ్రామా కంపెనీని కూడా ఇప్పుడు విజయవంతంగా భ్రష్టుపట్టించేశారు… ఇప్పుడు ప్రోగ్రామ్ చిరాకు తెప్పిస్తోంది… చివరకు జంటలు ఒకరినొకరు ఎత్తుకుని ఆడే మ్యూజికల్ చెయిర్స్‌ దాకా జారిపోయింది ప్రోగ్రామ్ క్వాలిటీ… అవే ఆది పంచులు, అవే రాంప్రసాద్ కౌంటర్లు… వినోదం తక్కువ, వికారం ఎక్కువ…

అసలు దీనికి తాజా రేటింగ్స్ పరిస్థితేమిటబ్బా అని చూస్తే… హైదరాబాద్ బార్క్ జాబితాలో మరీ ఘోరంగా 3.09 కనిపించింది… సో, ఇది పతనం వైపుకు వేగంగా నెట్టేయబడుతోంది అని అర్థం… కాకపోతే మాటీవీ వాడికి, జీతెలుగు వాడికి రియాలిటీ షోలు చేసే నైపుణ్యం లేకపోవడంతో ఈటీవీ రియాలిటీ షోలను ఈమాత్రమైనా చూస్తున్నారు… ఆలీతో సరదాగా, క్యాష్, వావ్ వంటి షోలు అచ్చంగా సినిమా ప్రమోషన్లు అయిపోయి, దరిద్రంగా మారిపోయాయి… ప్రేక్షకుడు కూడా లైట్ తీసుకుంటున్నాడు వాటిని… (గత వారం క్యాష్ రేటింగ్ 2.29…. ఆలీ షో రేటింగ్స్ అయితే చెప్పుకోవడం వేస్టున్నర… ఇప్పుడు డ్రామా కంపెనీని కూడా సినిమా ప్రమోషన్స్ కు వాడేస్తున్నారు…)

Ads

అయితే జబర్దస్త్, లేకపోతే డ్రామా కంపెనీ… కొత్తగా ఏం ఆలోచించాలో తెలియక… వాళ్ల జీవితాలనే వాళ్లు స్పూర్తిదాయక కథలుగా చిత్రీకరిస్తున్నారు… ఎపిసోడ్లు చేస్తున్నారు… రష్మి, అనసూయ, సుధీర్, గెటప్ శీను ఫైమా… ఇలా వాళ్లను వాళ్లే గొప్ప వ్యక్తులుగా చూపించుకుంటూ, చప్పట్లు కొట్టేసుకుంటున్నారు… తాజాగా పంచ్ ప్రసాద్… ఎస్, తన జీవితంలో కూడా విషాదం ఉంది, నిజమే… కానీ తరచి చూస్తే కష్టాల్లేని మనుషులు ఎవరున్నారు..? ప్రేక్షకుడు ఇదిరా నిజమైన ఇన్‌స్పిరేషనల్ స్టోరీ అని బలంగా ఫీలై, కనెక్టయ్యే కథలు కదా ఎన్నుకోవాల్సింది… త్వరలో ప్రదీప్, ఆది, ఇమ్మూ, నూకరాజు, శ్రీముఖి తదితరుల ఎపిసోడ్లూ వస్తాయేమో… వేచిచూడండి… చూస్తూనే ఉండండి, ఈటీవీ వారి శ్రీదేవి డ్రామా కంపెనీ…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మరీ అంత పెదకాపు ఏమీ కాదు… ఈ విరాటకర్ణుడు జస్ట్, ఓ చినకాపు మాత్రమే…
  • బట్టలిప్పుకుని బజారులో బరిబాతల డాన్స్ ఆడుతున్న చానెళ్లు…!!
  • బిగుసుకున్న ఇందిర చేతివేళ్ళు… సిరులు ఒలికించిన పంట చేలు…
  • పితృపక్షం అంటే ఏమిటి..? పితృదేవతలకు మనం ఏం చేయాలి..?
  • నారాతో నేను… ఒక విస్తృత దేవతా వస్త్రాల కథ…
  • ఆశలు ఉన్నచోట ఆశాభంగాలు… అలాగే లక్ష్యాలు కూడా..!!
  • 1.26 కోట్లు ఒక లడ్డూ… ఓ విల్లా ధరలా బాగా ఖరీదైన భక్తి…
  • దంచుడే దంచుడు… తెర నిండా బీభత్సమే… అచ్చమైన బోయపాటి సినిమా…
  • తలుపు తట్టిన చప్పుడు… డెయిలీ పేపర్ కింద పడిన చప్పుడు… నేనింకా బతికే ఉన్నాను…
  • అందంలో… అభినయంలో… జ్యోతికకు ఆమడదూరంలోనే ఆగింది కంగనా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions