అసలు సమస్య… పర్వర్టెడ్ మేధావులతోనే..! ఇలాంటి ఎన్నికల దందారాయుళ్ళతోనే..! కేసీయార్‌తో నాలుగు రోజులు కూడా ఇటీవల కలిసి పనిచేయలేక, మళ్లీ ఏపీకి పారిపోయిన ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా..? ‘‘జగన్, నితిశ్ వంటి నేతల పదవీకాంక్షలు తీరడానికి సహకరించాను, కానీ గాడ్సే విధానాలను ఓడించాలంటే గాంధీ కాంగ్రెస్ మాత్రమే ఈ దేశానికి శరణ్యం…’’
బీహార్‌లో 3500 కిలోమీటర్ల జనసురాజ్ పాదయాత్రలో ఉన్న ఆయన జగన్‌పై చేసిన వ్యాఖ్యల్ని కావాలని ఈనాడు, ఆంధ్రజ్యోతి హైలైట్ చేసుకున్నాయి, జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు కదా, అదో ఆనందం… కానీ తను బేసిక్‌గా ఆ వ్యాఖ్యలు చేసింది వేరే కాంటెక్స్ట్‌లో… నిజానికి బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌ను పెంచాలే తప్ప ఇతర పార్టీలను కాదు అనేది తన ఉద్దేశం… ఇప్పుడు తన కళ్లు తెరుచుకున్నాయట… ఈరోజుకూ తన అడుగులు కరెక్టు కాదు…
‘‘బీజేపీ అనేది కేవలం కాఫీ కప్పులో పైపైన నురగ మాత్రమే… అసలు కాఫీ ఆర్ఎస్ఎస్… ఆ గాడ్సే సిద్ధాంతాల్ని ఓడించాలంటే గాంధీ కాంగ్రెస్‌ను పెంచాల్సిన అవసరం ఉంది, అది గుర్తించలేకపోయాను…’’ ఈ వ్యాఖ్యలు కూడా అబద్ధాలు, అవకాశవాదమే… ఇదే మనిషి బీజేపీ కోసం వర్క్ చేశాడు మొదట్లో… అప్పుడు తెలియలేదా..? తెలివి లేదా..? బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్వరూపం ఏమిటో…
Ads
పోనీ, కాంగ్రెస్ పార్టీ కోసం చేయలేదా..? చేశాడు కదా… ఏం ఉద్దరించాడు..? మధ్యలోనే వదిలిపెట్టేశాడు… పంజాబ్ ప్రభుత్వంలో ఖజానా నుంచి జీతం తీసుకుని మరీ సలహాదారుగా పనిచేశాడు… ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తనకు కంట్రాక్టు ఇచ్చింది… కానీ పీకే చేసింది జీరో… ఇప్పుడు తను నిందిస్తున్న నితిశ్ ఒక దశలో ఇదే పీకేను తన వారసుడు అన్నాడు… ఆఫ్టరాల్ నాకు బీహార్ అనే చిన్న రాష్ట్రం దేనికి, నాది జాతీయ స్థాయి అనే భావనతో నితిశ్ అందించిన ఆదరహస్తాన్ని తన్నేశాడు… ఇప్పుడు మళ్లీ తనే బీహార్ కోసం పాదయాత్ర చేస్తున్నాడు… నితిశ్‌ను బీజేపీ ఏజెంట్ అంటున్నాడు…
జగన్ పదవీకాంక్షకు సాయపడ్డాను అంటున్నాడు కదా, ఈరోజుకూ తను ఏపీలో జగన్ కోసమే వర్క్ చేస్తున్నాడు… కాకపోతే తను అధికారికంగా తెరపై ఉండడు… ఏ ఒడిశాకు చెందిన రుషి టీం లీడ్ చేస్తుంటాడు… అంతెందుకు..? తన పాదయాత్రకు కూడా తను గతంలో ముఖ్యమంత్రుల్ని చేసిన నేతలు డబ్బుసాయం చేస్తున్నారని ఇదే పీకే చెప్పాడు… అంటే అందులో జగన్ కూడా ఉన్నట్టే కదా…
అయితే ఈ వ్యాఖ్య కూడా అబద్ధమే… తను వ్యూహకర్తగా పనిచేసిన నాయకుల్లో జగన్, స్టాలిన్, మమత సీఎంలుగా ఉన్నారు సరే, మరి మిగతా ముగ్గురు..? ఠాక్రే అధికారం గల్లంతైంది… నితిశ్ తన ఇంటి మెట్లు కూడా ఎక్కనివ్వడు… కేజ్రీవాల్‌తో సత్సంబంధాలు ఏమీ లేవు… మరి ఎవరు తనకు ఆర్థికసాయం చేస్తున్న ఆరుగురు సీఎంలు…
గాడ్సేలను ఓడించాలంటే గాంధీ కాంగ్రెసే కరెక్టు అనే ఆత్మస్పృహ కనిపిస్తోంది కొత్తగా… కాసేపు వాదన కోసం నిజమే అనుకుందాం… కానీ గాంధీ కాంగ్రెస్ అంటే ఏది..? గాంధీ సిద్ధాంతాలు పాటించే కాంగ్రెసా..? అది ఉందా ఇప్పుడు..? లేక నెహ్రూ కుటుంబ (సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎట్సెట్రా) గాంధీల కాంగ్రెసా..?
ఆ రాహుల్ గాంధీయే మా గాంధీల నుంచి నాయకత్వాన్ని గాంధీయేతరులకు ఇవ్వాలని పట్టుబట్టి ఖర్గేను నాయకుడిని చేశాడు కదా… (అసలు పెత్తనం రాహుల్‌దే అయినా పేరుకు ఆ కుటుంబేతరుడు అధ్యక్షుడు)… ఇప్పుడు గాంధీ కాంగ్రెసే శరణ్యం అంటున్నాడంటే పీకేకు మళ్లీ ఈ గాంధీల కాంగ్రెస్‌కు వర్క్ చేయాలని ఉందా..? మరి జగన్‌ను, మమతను వదిలేస్తాడా..? అది మాత్రం చేయడు… అవి డబ్బులు ఇచ్చే పాడిబర్రెలు కదా…
ఇప్పుడు తనేదో కొత్త విషయాన్ని కనిపెట్టినట్టు…. ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమే బీజేపీ… ఈ దేశప్రజలందరికీ ఆ క్లారిటీ ఉంది… ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ గొప్పతనం అర్థమైందట… మొన్నమొన్నటివరకూ కేసీయార్‌తో వర్క్ చేస్తూ, బీజేపీకి సరైన విరుగుడు బలమైన ప్రాంతీయ పార్టీలే అన్నట్టు మాట్లాడాడు… ఇప్పుడు ఆ కేసీయార్ కూడా తరిమేశాడు… ఇంతకీ బీహార్‌లో నితిశ్ బీజేపీ ఏజెంట్ అంటున్నావు సరే, జగన్ పదవీకాంక్ష సరే, మరి మన పాదయాత్ర వెనుక ఉన్నది ఏ కాంక్ష..?! ఇవన్నీ సరే, గాంధీ కాంగ్రెస్‌నే ఉద్దరిద్దాం… బెంగాల్, ఏపీలో కాంగ్రెస్ పార్టీని పైకి లేపగలవా పీకే..?!
Share this Article