అయోధ్య భూమిపూజ సందర్భంగా యజమాని (ప్రధాన కర్త) మోడీయే అయినా, తనకన్నా ముందు పూర్వ క్రతువులన్నీ అశోక్ సింఘాల్ కొడుకులు నిర్వహించారు… ప్రాణప్రతిష్టకు ముందు, అంటే పూర్వ క్రతువుకు ఒక కర్తగా ఆ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా వ్యవహరించగా, ప్రస్తుతం ప్రాణప్రతిష్టకు నిర్వహించే ప్రధాన ప్రాణప్రతిష్ట తంతుకు 14 జంటలు కర్తలుగా వ్యవహరిస్తున్నాయి… దేశపు నాలుగు దిక్కుల నుంచీ వీళ్లను ఎంపిక చేశారు…
‘యజ్మాన్’ జాబితాలో ఉదయపూర్‌కు చెందిన రామచంద్ర ఖరాడి పేరు ఉంది; అలాగే అస్సాం నుండి రామ్ కుయ్ జెమి; జైపూర్ నుండి గురుచరణ్ సింగ్ గిల్; హర్దోయ్ నుండి కృష్ణ మోహన్; ముల్తానీ నుండి రమేష్ జైన్; తమిళనాడుకు చెందిన అదలరాసన్, మహారాష్ట్రకు చెందిన విఠల్ రావు కమ్న్లే మహారాష్ట్ర లాతూర్‌లోని ఘుమంతు సమాజ్ ట్రస్ట్ నుండి మహదేవ్ రావ్ గైక్వాడ్; కర్ణాటకకు చెందిన లింగరాజ్ బసవరాజ్; లక్నో నుండి దిలీప్ వాల్మీకి; దోమ్ రాజా కుటుంబం నుండి అనిల్ చౌదరి; కాశీ నుండి కైలాష్ యాదవ్; హర్యానాలోని పల్వాల్‌కు చెందిన అరుణ్ చౌదరి, కాశీకే చెందిన కవీంద్ర ప్రతాప్ సింగ్…
Ads
ఇక 22న నిర్వహించబోయే ప్రధాన క్రతువులో ప్రధాన కర్తగా ప్రధాని మోడీ పాల్గొంటాడు… తనది పాలకస్థానం కాబట్టి, దైవ విశ్వాసి కాబట్టి, హిందూ ఆధ్యాత్మిక, మత నిబద్ధుడు కాబట్టి… అన్నింటికీ మించి అయోధ్య ఉద్యమంలో ప్రత్యక్ష పాత్రధారి కాబట్టి, అయోధ్య గుడి సాకారానికి కారణమైన బీజేపీకి అధినేత కాబట్టి… బోలెడు వార్తలు వస్తున్నాయి… ఫోటోలు, వీడియోలు… ఎన్నో మూలల నుంచి ఎన్నో కానుకలు, ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు…
ఈ మొత్తం కార్యక్రమంలో నిశ్శబ్దంగా, ఓ యంత్రంలా తిరుగుతూ పనిచేస్తున్నది నిజమైన ప్రధాన కర్త మరొకరున్నారు… యోగీ ఆదిత్యనాథ్… నిజంగా ఇప్పుడు యూపీలో వేరే పార్టీ లేదా వేరే ముఖ్యమంత్రి ఎలా ఉండేదో చెప్పలేం గానీ యోగీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉండటం ఒకరకంగా అయోధ్య ప్రాణప్రతిష్ఠ ఇంత వైభవంగా జరుగుతూ ఉండటానికి ప్రధాన కారణం… భూమి పూజ జరిగిన దగ్గర్నుంచీ… రేపటి ప్రాణప్రతిష్ఠ దాకా గిరగిరా తిరుగుతూనే ఉన్నాడు…
పైకి కనిపించేది ట్రస్టు… అందరినీ సమన్వయం చేసుకుంటూ… రోజువారీగా సమీక్షలు నిర్వహిస్తూ… ప్రతి పనిలోనూ తానై పరిశ్రమిస్తున్నాడు… ఎక్కడా ప్రబలంగా తను తెరపై ప్రత్యక్షం కావడం లేదు… అయోధ్య ఆలయం తన జన్మలక్ష్యంగా ప్రకటించుకున్న తనకు ఈ గుడి నిర్మాణం దక్కిన ఓ పెద్ద అదృష్టం… ఎవరెవరిని ఆహ్వానించాలనే అంశం దగ్గర నుంచి బందోబస్తు, అయోధ్య ముస్తాబు, అభివృద్ధి పనులు, భక్తుల రాకడకు రవాణా, భక్తులకు సౌకర్యాల దాకా యోగీ ప్రభుత్వం తలమునకలై ఉంది…
మునుపు ప్రభుత్వమే నిర్మించిన సోమనాథ్ గుడి ప్రారంభం సమయంలో ఇంత ఆధ్యాత్మిక శోభ లేదు… అప్పుడు కాంగ్రెస్, నెహ్రూ హయాం కావడమే కారణం… కానీ ఇప్పుడు అయోధ్య కథ వేరు… ఆ గుడి కోసం జరిగిన పోరాటం వేరు… అందుకే ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పట్ల దేశప్రజల్లో ఇంత ఆసక్తి… ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజం అభిలాష అది…
సరయూ నదీతీరం, అయోధ్య పట్టణం మునుపు ఎరుగని శోభతో కనిపిస్తున్నాయి… అయోధ్య తంతుకు సంబంధించిన ఏ వివాదంలోనూ తను కలగజేసుకోవడం లేదు, మాట మాట్లాడటం లేదు… ఎక్కడో ఓ చోట హఠాత్తుగా ప్రత్యక్షం కావడం, లోటుపాట్లపై అక్కడికక్కడే సమీక్షించడం, అవసరమైన ఆదేశాల్ని జారీచేయడం… The Real Yajman Of Entire Ayodhya Prana Pratishta Rituals… అవును, తను ఓ అలుపెరుగని భక్త శ్రామికుడు… ఆ రాముడికి హనుమంతుడిలా… అయోధ్య బాల రాముడికి ఈ యోగి… సింపుల్‌గా అంతే…
Share this Article