Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!

June 7, 2025 by M S R

.

(By… రమణ కొంటికర్ల…) శ్యాంసింగరాయ్ సినిమా అనంతరం ఇప్పుడు గూగుల్ సెర్చింగ్ లో ఎక్కువ కనిపిస్తున్న పేర్లలో శాంతిదేవి ఒకటి. అయితే ఈ పేరును శ్యాంసింగారాయ్ లో కోర్ట్ సీన్ లో… నాని తరపు లేడీ అడ్వకేట్ కేసు వాదనలో భాగంగా ఉటంకించడం..

ఏకంగా మాహాత్మాగాంధీనే శాంతిదేవి పునర్జన్మ తాలూకు విశేషాల గురించి పూర్తి పరిశోధన చేయాలని ఓ కమిటీ వేయడంతో.. ఇంతకాలం చరిత్రగా ఉన్న శాంతిదేవి పేరు మరోసారి వార్తగా చర్చల్లోకి వస్తోంది. ఇప్పటికే ఈ కథ తెలిసినవాళ్లు చాలామందే ఉండొచ్చు!

Ads

కానీ.. అసలు ఆత్మలు, పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తిని రేకెత్తించే సినిమాల ప్రదర్శనల కాలంలో.. అచ్చూ శ్యాంసింగారాయ్ ను పోలిన శాంతిదేవి కథ మరోసారి చెప్పుకోవచ్చు!!

పునర్జన్మలుంటాయా…? వారు జీవించి, మరణించిన కాలానికి కొద్దిరోజుల వ్యవధిలోనే మళ్లీ పునర్జన్మ ఎత్తడం సాధ్యమేనా…? ఈ ప్రశ్నలన్నీ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ… శ్యాంసింగారాయ్ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ ఇప్పుడు మళ్లీ పునరాలోచన రేకెత్తించేదే!

మనం చెప్పుకుంటున్న శాంతిదేవి పునర్జన్మ కూడా.. ఆమె మరణించిన మరి కొద్దిరోజుల్లోనే జరగడమనేది అచ్చూ శ్యాంసింగరాయ్ సినిమాను పోలిన విశేషమే!

మథురవాసైన లుగ్డీదేవీ మరణించిన 1925, సెప్టెంబర్ 25 నాటినుంచి.. ఏడాదిపైన పదినెలలు.. అంటే సుమారు రెండేళ్లనంతరమే… డిసెంబర్ 11, 1926లో ఢిల్లీవాసైన బాబూ రంగ్ బహదూర్ కు శాంతిదేవి జన్మించడంతో.. లుబ్డీదేవి పునర్జన్మ కథ తెరపైకొచ్చింది.

పుట్టాక నాల్గేళ్ల వయస్సు వరకూ కనీసం సరిగ్గా మాట్లాడకపోయిన శాంతిదేవి.. నాల్గేళ్ల తర్వాత తన పూర్వజన్మ జ్ఞాపకాలను తనవాళ్లతో పంచుకోవడంతో.. కుటుంబీకులు, బంధువులతో పాటు… అంతా విస్మయం చెందారు. ముఖ్యంగా ఊహకు కూడా అందని ఇలాంటి విశేషాలను నాల్గైదేళ్ల ప్రాయంలో షేర్ చేసుకుంటున్న శాంతి.. సైకాలజికల్ గా డిస్టర్బ్డేమోనని కూడా భావించారు.

మరికొందరైతే ఏకంగా పిచ్చిదై ఉంటుందనీ ముద్ర వేశారు. కానీ శాంతిదేవి తన పునర్జన్మ అనుభవాలను చెబుతున్నప్పుడు మాత్రం.. 145 కిలోమీటర్ల దూరంలో మథుర పట్టణంలో తన భర్త నివశిస్తున్నాడని… తన ఇల్లు అదేనన్న స్పష్టతనివ్వడం..

అలాగే భర్తకు సంబంధించిన రూపురేఖలు, అతని మ్యానరిజమ్స్, అద్దాలు ధరించడం, ఆయన ఎడమ చెంపపై ఉన్న పెద్ద మొటిమ వంటి ఆనవాళ్లన్నింటినీ చెబుతుండటంతో… ముందు పిచ్చని భావించినవాళ్లు కూడా ఒకింత నిశ్ఛేష్ఠులై ఆలోచనలో పడ్డారు. అంతేకాదు తన భర్త నడిపే దుకాణం ద్వారకాధీష్ ఆలయానికెదురుగా ఉందని శాంతిదేవి పేర్కొనడంతో ఒకింత ఉత్సుకతకూ లోనయ్యారట.

rebirth

అయినా ఒక పట్టాన ఇలాంటివి నమ్మని సర్వసాధారణ పరిస్థితుల్లో… శాంతిదేవిని ఆమె తల్లిదండ్రులు తన పునర్జన్మ జ్ఞాపకాల నుంచి మర్చిపోయేందుకే విశ్వయత్నం చేసేవారట. కానీ దాన్ని మాత్రమే మర్చిపోలేని స్థితిలో శాంతిదేవి.. సరిగ్గా ఆరేళ్లకు ఇంటినుంచి పారిపోయింది.

మథుర చేరుకునే విఫల యత్నం చేసింది. తిరిగి బడికెళ్లిన క్రమంలో… తనకు అంతకుముందే వివాహమైందనీ… ఓ బిడ్డకు కూడా జన్మినిచ్చానంటూ అక్కడ తన ఉపాధ్యాయులతో చెప్పేసరికి వారు ఖంగుతిన్నారు.

కానీ, శాంతి మాండలికం మాత్రం.. మథుర మాండలికాన్ని పోలి ఉండటంతో కొంత ఉపాధ్యాయుల్లో ఏదో ఓ మూల ఇంత అనుమానం రేగడంతో.. ఆమె నుంచి మరిన్ని సమాధానాలు రాబట్టే యత్నం చేశాడట ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు.

ఆ క్రమంలో తన భర్త పేరు కేదార్ నాథ్ అని చెప్పడంతో… ప్రధానోపాధ్యాయుడు కొంత చొరవ తీసుకుని మథుర సందర్శించాడు. అలా ఓ పదిరోజుల సమయంలో శాంతిదేవి అనే పాప చెబుతున్నట్టుగానే… లుబ్డీదేవి అనే తన భార్యను పోగొట్టుకుని ఒక కొడుకును కల్గియున్న కేదార్ నాథ్ అనే వ్యాపారి ఆ ప్రధానోపాధ్యాయుడికి తారసపడ్డాడు.

ఆ క్రమంలో కేదార్ నాథ్ ను తన సొంత సోదరుడిలా పరిచయం చేస్తూ ఆ ప్రధానోపాధ్యాయుడు ఢిల్లీలోని శాంతిదేవి ఇంటికి క్యాజువల్ గా తీసుకెళ్లాడు. కానీ శాంతి అతణ్ని తన పునర్జన్మైన లుబ్డీదేవి జీవితంలో భర్తైన కేదార్ నాథ్ గా గుర్తుపట్టింది.

ఆమె చెప్పిన ప్రతీ ఆనవాళ్లూ.. లక్షణాలు.. జ్ఞాపకాలూ.. ఇలా అన్నీ కేదార్ నాథ్ ను కన్విన్స్ చేశాయి. తను కూడా.. తన భార్య లుబ్డీదేవి పునర్జన్మే శాంతిదేవని నమ్మాడు. ఇదిగో.. దీంతోనే సినీఫక్కీలో కథ మలుపులు తిరిగి… శాంతిదేవి పునర్జన్మ ఓ చరిత్రగా మారింది.

rebirth

ఈ కేసు కాస్తా మహాత్మాగాంధీ దృష్టికి వెళ్లింది. ఇంత విశేషమైన, అంతకుమించి ఓ విచిత్రమైన కేసు కావడంతో… విచారణకు కమిషన్‌ వేశారు/ వేయించాడు… అలా కమిషన్.. శాంతిదేవితో కలిసి 1935, 15 నవంబర్ న మథురలో పర్యటించింది. అక్కడకు వెళ్లిన శాంతి… లుగ్డీదేవి తాతతో సహా అనేక మంది కుటుంబ సభ్యులను గుర్తించింది.

లుగ్డీదేవిగా మరణశయ్యపై ఉన్న సమయంలో తన భర్త కేదార్ నాథ్ తనకిచ్చి విస్మరించిన అనేక వాగ్ధానాలనూ ఆ సందర్భంగా పూసగుచ్చింది శాంతి. ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కమిషన్… 1936లో శాంతిదేవి లుగ్జీదేవీ పునర్జన్మనేనని నిర్ధారిస్తూ ఓ నివేదికనిచ్చింది.

అయితే ఆ కమిషన్ ఇచ్చిన నివేదికపై… లుగ్డీదేవే శాంతిదేవిగా పునర్జన్మించడంపై మరిన్ని నివేదికలూ బయటకొచ్చాయి. బాల్ చంద్ నహతా ‘పునర్జన్మ కీ పర్యలోచన’ పేరుతో తన నివేదికను ఇదే అంశంపై ఓ హిందీ బుక్‌లెట్‌గా ప్రచురించారు.

అందులో తమ పరిశీలన ప్రకారం ఇప్పటివరకూ శాంతిదేవి చెబుతున్న పాత జ్ఞాపకాలుగానీ.. ఇతర ఏ విషయాలుగానీ ఆమె పునర్జన్మించిందని రుజువు చేయలేవన్నట్టుగా ఆ నివేదికలో పొందుపర్చడం.. ఆ తర్వాత మరికొన్ని నివేదికలు వాటిని ఖండించడమూ జరిగిపోయాయి. మొత్తంగా కొన్ని నిర్ధారణలు… ఇంకొన్ని వివాదాలన్న రీతిలో శాంతిదేవి పునర్జన్మ తాలూకు చరిత్ర పుటలకెక్కింది.

తనది పునర్జన్మ అని నమ్మి.. గతకాలపు యాదితోనే మళ్ళీ జీవితాంతం బతికిన శాంతిదేవి పెళ్లి చేసుకోలేదు. 1950ల చివరలో మళ్లీ తన కథను మరోసారి కూడా గుర్తు చేసింది శాంతీదేవీ…

1986లో ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఇయాన్ స్టీవెన్‌సన్, కే.ఎస్. రావత్ కూ లుగ్డీదేవీగా తన మరణానికి సమీప అనుభవాలను, జ్ఙాపకాల్ని కూడా జోడించి చెప్పడంతో… కె.ఎస్. రావత్ తన పరిశోధనలను 1987లో కూడా ఆమెపై కొనసాగించాడు. మరణానికి నాలుగు రోజుల ముందు కూడా… 1987, డిసెంబర్ 27న ఆమె తన పునర్జన్మకు సంబంధించిన చివరి ఇంటర్వ్యూ ఇచ్చారు.

స్వీడిష్ అవార్డ్ విన్నింగ్ రచయితైన Sture Lonnerstrand శాంతిదేవి పునర్జన్మ కథపై చాలాకాలం పరిశోధన చేసి.. 1994లో ఈ ప్రత్యేకమైన, విశేషమైన కేసు గురించి ఒక పుస్తకాన్ని కూడా రాయగా… 1998లో అది ఆంగ్లంలో రిలీజైంది. మొత్తంగా ఇప్పుడు ఈ శాంతిదేవి చరిత్ర ఓసారి చెప్పుకుంటుంటే…. కేవలం రెండేళ్ల కాల వ్యవధిలోనే ఆమె మరణం తర్వాత పునర్జన్మించడమంటే… అచ్చూ శ్యాంసింగరాయ్ సినిమాను పోలి ఉన్నట్టనిపించడంలేదూ..?!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జీమూత భల్లుడు… తెలుగు సినీ మహానగరంలో ఓ మాయగాడు…
  • మేం తోపు హీరోలం… మేం తురుములం… తీరా లెక్క తీస్తే వందల కోట్ల లాస్…
  • శుభమన్ గిల్… అంకెల్లో కాదు, ఆ స్పిరిట్‌లో చూడాలి తన ఆటను..!!
  • అంతరిక్ష ఖననం అనుకున్నారు… చివరకు సముద్ర ఖననం జరిగింది…
  • అసలు గానమురళి పాడేది సంగీతమే కాదని కోర్టులో కేసు వేశారు..!!
  • ఎలోన్ మస్క్ కొత్త అమెరికా పార్టీ… ఇల్లలకగానే పండుగ కాదు బాసూ…
  • హలో సారూ… తెలంగాణపై ఎవరికీ పేటెంట్ రైట్స్ లేవు మాస్టారూ…
  • చివరకు తోడు ఓ పడక మంచమే… మిగతావన్నీ వదిలేసే గురుతులు మాత్రమే…
  • ఇది దీపిక పడుకోన్ కాలం… దీపిక చిఖిలియా రోజులు కావు తల్లీ…
  • ఉప్పుకప్పురంబు…! మహానటి బ్రాండ్ ‘కీర్తి’ పలుచన…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions