ఇప్పటికే చాలామంది రాసేశారు… ఆ హార్లిక్స్‌లో ఏమీ లేదుర భయ్, ఓ గ్లాసు హార్లిక్స్‌కన్నా ఓ చపాతీ బెటర్ అని…! ఐనా మనం వినం కదా… కొంటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం… కాఫీలాగా, టీలాగా… లేదా ఓ చాకోలేట్ ఫ్లేవర్డ్ డ్రింక్‌లాగా..! వాడు ఓ కమర్షియల్ ప్రకటన ఇచ్చాడు… ఎందులో..? నమస్తే తెలంగాణలో…!! అది ఇంకెక్కడా కనిపించలేదు… చూడగానే మనకు ఏమనిపిస్తుందీ అంటే… అరె, హార్లిక్స్‌లో ఏముందిరా..? అందులో ఉన్న కాల్షియం పాలల్లో ఉంది, ఐరన్ పాలకూరలో ఉంది, విటమిన్ సీ కమలాపండులో ఉంది… ఈ తొక్కలో హార్టిక్స్ తాగడం దేనికి..? అవి తాగితే, అవి తింటే సరిపోదా..? పైగా నేచురల్….. నిజం, ఆ యాడ్ చూడగానే అనిపించేది, అర్థమయ్యేది అదే… వావ్… చివరకు నమస్తే తెలంగాణవాడికీ ప్రజారోగ్యం సోయి ఉంది, భలే భలే… ఈ కరోనా దుర్దినాల్లో ఇదొక మంచి శకునం అనీ, చివరకు మన ప్రింట్ మీడియా కూడా జనం గురించి ఆలోచిస్తోంది, మనుషుల్లా విజ్ఞత కనరుస్తోంది అనుకుని మనం భ్రమపడతాం… కానీ..?
అసలు ఈ యాడ్ ఇచ్చిందెవరు..? అంత ప్రజారోగ్యం మీద సోయి చూపించిన ధర్మాత్ముడు ఎవరు..? వాడెవడో గానీ ఖచ్చితంగా అభినందించాలీ, చప్పట్టు కొట్టి ప్రోత్సాహించాలీ అనుకుంటామా…? ఆ యాడ్ కింద కనీకనిపించనట్టున్న ఓ పిచ్చి డిస్‌క్లెయిమర్ చూసి నీరుకారిపోతాం… థూ, మన మీడియా మారదుర భయ్ అని నోటికొచ్చిన బూతులు లోలోపల తిట్టేసుకుని వదిలేస్తాం… పైన ఉన్న ఆ యాడ్, అందులో హైలైట్ చేయబడిన సదరు డిస్‌క్లెయిమర్ చదివితే మీకు క్లారిటీ వచ్చేస్తుంది… హమ్మ, ఈ హార్లిక్స్ వాడు ఇలా కొడుతున్నాడా అని… కానీ వాడి ఆలోచన ఎక్కడ ఎదురు తన్నుతోందీ అంటే… వాడు ఇంగ్లిషులో ఆలోచించి ఆ క్రియేటివ్ యాడ్ ఇచ్చాడు, ఎవడో తెలుగులోకి అనువదించాడు… ఆ కాన్సెప్టే దరిద్రం కాగా, ఆ అనువాదం మరింత దరిద్రం…
Ads
ఓసారి ఆ డిస్‌క్లెయిమర్ చదవండి… పదీపన్నెండు హార్లిక్స్ గ్లాసులు తాగినా మీకు అర్థం కాదు… ష్యూర్… అంత దరిద్రం… మళ్లీ ఇదంతా అర్థం కావాలంటే ప్యాక్ చదవండి అంటాడు… ఎన్నిసార్లు చదివినా వాడు ఏం చెప్పాలనుకున్నాడో… అసలు నమస్తే వాడు ఈ యాడ్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడో ఒక్క ముక్క కూడా… సారీ, ఆ రెండు రూపాయల హార్లిక్స్ పొట్లం వివరాలు గానీ సమజ్ కావు… నిజానికి ఇది వాడి ప్రకటన ప్రయోజనాలకు ఉల్టా… స్థూలంగా చూసేవాళ్లకు అనిపించేది ఏమిటంటే..? ఈ హార్లిక్స్ పొట్లం తాగడంకన్నా సేమ్, ప్రయోజనాల్ని ఇచ్చే పాలు, పాలకూర, కమలాపండు బెటర్ అని చెబుతున్నట్టుగా ఉంది… ఆ హార్లిక్స్ క్రియేటివ్ టీం ఎవరో గానీ, మీ కాళ్లు మొక్కాలిర భయ్… నిజానికి మీరు తెలుగు సినిమా, తెలుగు టీవీ క్రియేటివ్ టీముల్లో పనిచేయాల్సిన సరుకు…!!
Share this Article